breaking news
YSRCP Lok Sabha Candidates List
-
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్
కడప లోక్‌సభ అభ్యర్థి పేరు : వైఎస్ అవినాష్‌రెడ్డి పుట్టిన తేదీ : 27–08–1984 విద్యార్హత : ఎంబీఏ తల్లిదండ్రులు : వైఎస్ భాస్కర్‌రెడ్డి, లక్ష్మి స్వస్థలం: పులివెందుల భార్య : సమతా రెడ్డి సంతానం : విక్రాంత్ రెడ్డి (కుమారుడు) రాజకీయ ప్రవేశం 2014లో వైఎస్సార్సీపీ తరపున కడప లోక్ సభ అభ్యర్థిగా గెలుపొందారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పేరు : మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (52) తల్లిదండ్రులు : పాపిరెడ్డి, ఆదిలక్ష్మీ భార్య : మాధవికృష్ణ కుమారులు : సాకేత్రామిరెడ్డి, ప్రణవ్సుబ్బారెడ్డి విద్యార్హత : బీకాం, ఎల్ఎల్బీ ఊరు : కృష్ణనగర్, గుంటూరు వృత్తి : వ్యాపారవేత్త నేపథ్యం: మోదుగుల వేణుగోపాలరెడ్డి 2009లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ తరఫున గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లనున్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పేరు : లావు శ్రీకృష్ణ దేవరాయలు (35) తల్లిదండ్రులు : డాక్టర్ లావు రత్తయ్య, నిర్మల భార్య : డాక్టర్ మేఘన (కంటి వైద్యులు) కుమారుడు : లావు రతన్ విద్యార్హత : మీడియా స్టడీస్ (ఆస్ట్రేలియా) ఊరు : గుంటూరు నేపథ్యం: లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్‌గా, శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏలూరులో సీబీఎస్ఇ సీల్‌బస్‌తో నడుస్తున్న స్కూల్‌కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈఎస్ఎస్ వీఇఇ ఏఏఆర్ కే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్(ఏలూరు)డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రజాసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పేరు : నందిగం సురేష్‌బాబు (42) తల్లిదండ్రులు : నందిగం పౌలు, సంతోషమ్మ భార్య : బేబిలత సంతానం : ప్రిన్సి, గ్లోరి సురేఖ విద్యార్హత : ఎస్ఎస్సీ ఊరు : ఉద్దండరాయనిపాలెం (తుళ్లూరు మండలం) నేపథ్యం: నందిగం సురేష్ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పార్టీలో సామాన్య కర్యకర్తగా నిబద్ధతతో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన క్రమశిక్షణ, నిజాయితీని చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నియమించారు. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు పంట పొలాలను తగుబెట్టిన విషయంలో పార్టీ తరఫున, రైతాంగానికి అండగా నిలిచారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి పేరు : పొట్లూరి వర ప్రసాద్ తల్లిదండ్రులు: రాఘవేందరావు, మంగతాయారు విద్య: విజయవాడలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, ఆంధ్రా లయోల కళా శాలలో కళాశాల వి ద్య, నాగార్జున యూని వర్సిటీ నుంచి మెకాని కల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆస్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ నుంచి 1995లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పుట్టిన తేది: 8–9–1970 పుట్టిన ఊరు: విజయవాడ నేపథ్యం: యుఎస్ మిచిగాన్‌లో ప్రొకోన్, అల్బియన్ ఓరియన్ అనే ఐటీ సేవల సంస్థను నెలకొల్పారు. 2001లో ‘ఇరెవ్నా అనే ఎనలిటిక్స్’ను యుకేలో ప్రారంభించారు. ఆ తరువాత పీవీపీ మీడియా, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, రంగాల పై అధికంగా దృష్టి కేంద్రీకరించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి పేరు: వల్లభనేని బాలశౌరి భార్య పేరు: భానుమతి సంతానం: ముగ్గురు కుమారులు(అనుదీప్, అరుణ్, అఖిల్) విద్యార్హతలు: ఎంఏ(పొలిటికల్ సైన్స్) పుట్టిన తేదీ: సెప్టెంబరు 18,1968 నేపథ్యం : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. 14వ లోక్‌సభ సమయంలో పార్లమెంట్ రక్షణ శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ మెంబర్‌గా సేవలందించారు. తెనాలి ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పేరు : కోటగిరి శ్రీధర్ స్వస్దలం : కృష్ణాజిల్లా, నూజివీడు నివాసం : ఏలూరు పుట్టిన తేది : 1973 విద్యార్హత : బీబీఎం తండ్రి పేరు : కోటగిరి విద్యాధరరావు తల్లి పేరు : విజయకుమారి భార్య : సరిత పిల్లలు : దేవన్, కావేరి వృత్తి : వ్యాపారం రాజకీయ ప్రవేశం: తొలుత బీజేపీలో క్రియాశీలక రాజకీయరంగ ప్రవేశం చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై చేపడుతోన్న పోరాటాలు, ఉద్యమాలు, వైఎస్ జగన్ ఆశయాలపై ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి పేరు : పోచా బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులు : ఈశ్వరమ్మ, వెంకటరెడ్డి స్వగ్రామం : ఉయ్యాలవాడ (గ్రామం), ఆళ్లగడ్డ నియోజకవర్గం పుట్టిన తేదీ : 01–01–1954 చదువు : ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) కుటుంబ సభ్యులు : భార్య రామపుల్లమ్మ, కుమార్తెలు మీనాక్షి, దేవమ్మ, వాణెమ్మ, కుమారుడు జనార్దన్‌రెడ్డి. మొదటి ఉద్యోగం : అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ప్రస్తుత వృత్తి : కొన్నాళ్లు ఉద్యోగం చేశాక మానేసి 1985లో నంద్యాలలో భారతీ సీడ్స్ కంపెనీ స్థాపించారు. ఇప్పటి వరకు కంపెనీని సక్సెస్ ఫుల్‌గా నడుపుతూ రైతులకు మంచి విత్తనాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. రాజకీయ ప్రస్థానం : 2004లో కోవెలకుంట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నించారు. ఆ ఏడాదిలో సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే సీటును పార్టీ అధిష్టానం ప్రకటించడంతో పోచాకు టికెట్ రాలేదు. పదవులు : వైఎస్ఆర్ హయాంలో ఆచార్య ఎన్జీ రంగా యూవర్సిటీ పాలక మండల సభ్యుడిగా నియామకం సేవా కార్యక్రమాలు : స్వగ్రామంలోని ప్రజలకు తాగునీరు అందించడం రాజకీయ గురువు : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత లక్ష్యం : ప్రతి రైతుకు సాగునీరు అందించడం. కర్నూలు ఎంపీ అభ్యర్థి పేరు : డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్ తల్లిదండ్రులు : రంగమ్మ, శ్రీరంగం, స్వగ్రామం : కర్నూలు పుట్టిన తేదీ : 03–01–1967 కుటుంబీకులు : భార్య డాక్టర్ వసుంధర(గైనకాలజిస్టు), కుమార్తె డాక్టర్ సౌమ్య, కుమారులు అక్షయ్, అభిరామ్ చదువు : కర్నూలు మెడికల్ కాలేజీలో 1990లో ఎంబీబీఎస్, 1995లో ఎంఎస్ (జనరల్ సర్జరీ), పూర్తి చేశారు. 2000లో హైదరాబాద్ ఉస్మానియాలో ఎంసీహెచ్ (యూరాలజీ) చేశారు. కుటుంబ నేపథ్యం : వృతిరీత్యా వైద్యుడు. కర్నూలులో ఆయుస్మాన్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రజలకు సుపరిచితుడే. ఈయన కుటుంబంలో 21 మంది వైద్యులు ఉన్నారు. సౌమ్యుడిగా పేరు ఉంది. రాజంపేట ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పేరు : పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి పుట్టిన తేదీ : 29 ఆగస్ట్ 1977 చదువు : ఎంబీఏ (యుకే) పుట్టిన ఊరు : పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారిపల్లి వయస్సు : 41 వృత్తి : రాజకీయం తల్లిదండ్రులు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,స్వర్ణలత దేవి భార్య పేరు : లక్ష్మిదివ్య పిల్లలు : ఇద్దరు సేవా కార్యక్రమాల : భాస్కర్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందిస్తున్నారు రాజకీయాలు: రాజంపేట ఎంపీగా 2014లో ఘన విజయం సాధించారు తిరుపతి అభ్యర్థి పేరు : బల్లి దుర్గాప్రసాద్ పుట్టిన తేదీ : 15.06.1956 పుట్టిన ఊరు : వెంకటగిరి విద్యార్హత : బీకాం. బీ.ఎల్ పదవులు : 1985,1994,1999, 2009 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తల్లి పేరు : రామలక్ష్మి తండ్రి పేరు : పెంచలయ్య భార్య పేరు : సరళ పిల్లలు : ముగ్గురు చిత్తూరు అభ్యర్థిపేరు : ఎన్.రెడ్డెప్ప చదువు : ఎంఏ, బీఎల్ పుట్టిన తేదీ : 01–10–1951 వయస్సు : 68 స్వస్థలం : వల్లిగట్ల, సోమల మండలం తండ్రి : కొండయ్య, తల్లి : వెంకటమ్మ, భార్య : ఎన్.రెడ్డెమ్మ, విశ్రాంత ఉపాధ్యాయురాలు కుమారుడు : దినేష్, లెఫ్టినెంట్ ఆర్మీ కర్నల్‌గా పనిచేస్తున్నారు పదవులు: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేశారు.న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా 14 సార్లు పనిచేశారు. 1981 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఏడాది పాటు పనిచేశారు. ఏజీపీగా 1984 నుంచి 1987 వరకు, ఎస్బీఐ, సప్తగిరి గ్రామీణబ్యాంకు, మున్సిపాలిటీకి, ఇతర ప్రైవేటు కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు.కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మినరల్ డైవలెఫ్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రెండేళ్లు పనిచేశారు. కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ డైరెక్టర్‌గా 2008–2009లో పనిచేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీ పేరు: కాండ్రేగుల సత్యవతి విద్యార్హత: ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్ వయసు: 52 కుటుంబ సభ్యులు: భర్త పేరు కాండ్రేగుల విష్ణుమూర్తి(డాక్టర్), కుమారుడు యశ్వంత్(డాక్టర్), కుమార్తె పావని( డాక్టర్). రాజకీయ నేపథ్యం: 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నిర్వహించిన పదవులు: రోటరీ ఒకేషనల్ అవార్డు, భారతవికాస పరిషత్ టాప్ డాక్టర్ ఆఫ్ ది టౌన్, వైఎంసీఏ డాక్టర్ ఆఫ్ ది మిలీనియం, రెండు నెలల క్రితం వైఎస్సార్సీపీ చేరారు. విశాఖ ఎంపీ అభ్యర్థి పేరు: ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ విద్యార్హత: డిగ్రీ వయసు: 54 కుటుంబ సభ్యులు: భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్. రాజకీయ నేపథ్యం: ఆరు నెలలు క్రితం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. విశాఖ పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన పదవులు: విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు. అరకు ఎంపీ అభ్యర్థి పేరు: గొట్టేటి మాధవి విద్యార్హత: బీయస్సీ,బీపీఈడి వయసు: 27 కుటుంబ సభ్యులు: తండ్రి పేరు గొడ్డేటి దేముడు( దివంగత మాజీ ఎమ్మెల్యే), అమ్మ పేరు చెల్లయ్యమ్మ. రాజకీయ నేపథ్యం: ఈమె తండ్రి చింతపల్లి శాసన సభ్యుడిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2018 ఆగష్టు 27 వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది. నిర్వహించిన పదవులు: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త. విజయనగరం ఎంపీ అభ్యర్థి పేరు : బెల్లాన చంద్రశేఖర్ తండ్రి : లేటు సింహాచలం వయస్సు : 56 విద్యార్హత : బీఎ, బీఎల్ భార్య : శ్రీదేవి కుమారుడు: వంశీకష్ణ (అమెరికా) ఫోన్ నంబర్: 94401 94059 పదవులు: బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లిలో గల మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో జెడ్పీటీసీగా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. బెల్లాన చంద్రశేఖర్ తండ్రి సింహాచలం ప్రముఖ న్యాయవాది. ఆయన రెండు దశాబ్దాల పాటు చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి పదేళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. గరివిడి ఎస్డీఎస్ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1980–1983 వరకు డిగ్రీ చదివిన రోజుల్లో వి ద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. 1990–1993లో మహారాజా కళాశాలలో బీఎల్ చదివారు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి పేరు: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం: భార్య దువ్వాడ వాణి(టెక్కలి మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు). విద్యార్హత: బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్, బీఎల్ (పీఆర్ కళాశాల, కాకినాడ) రాజకీయ ప్రవేశం: 2001లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా, 2006 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పీఆర్పీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఉప ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఉద్యమాలు: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2010 నుంచి పోరాడుతున్నారు. నియోజకవర్గం : నరసాపురం అభ్యర్థి అభ్యర్థి : కనుమూరి రఘురామకృష్ణంరాజు వయసు : 57 ఏళ్లు, కులం : క్షత్రియ భీమవరం: రఘురామకృష్ణంరాజు స్వగ్రామం ఆకివీడు మండలం ఐభీమవరం. ఆయన ఎం.ఫార్మశీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలకుపైగా విద్యుత్ రంగంలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భార్య రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు భరత్ ఉన్నారు. కాకినాడ అభ్యర్థి అభ్యర్థి : వంగా గీత కుటుంబం: భర్త కాశీ విశ్వనా«థ్, కుమార్తె సత్యపావని వయస్సు: 52 విద్యార్హత: ఎంఏ, ఎంఏ, బీఎల్, ఎంఏ సైకాలజీ రాజకీయ నేపథ్యం: 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2000 వరకూ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా. అమలాపురం అభ్యర్థి అభ్యర్థి : చింతా అనూరాధ తల్లిదండ్రులు: విజయభారతి, కృష్ణమూర్తి భర్త: తాళ్ల సత్యనారాయణ పుట్టిన తేదీ: 18.10.1972 విద్యార్హత: బీఏ వచ్చిన భాషలు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం రాజకీయ రంగ ప్రవేశం : ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. తండ్రి చింతా కృష్ణమూర్తి 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా కొంతకాలం పనిచేశారు. అనురాధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తండ్రి కృష్ణమూర్తి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం అభ్యర్థి అభ్యర్థి : మార్గాని భరత్‌రామ్ తల్లిదండ్రులు: ప్రసూన, నాగేశ్వరరావు పుట్టిన తేదీ : 12.05.1986 విద్యార్హతలు : ఎంబీఏ నేపథ్యం: విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ‘ఓయ్ నిన్నే’ సినిమాలో హీరోగా నటించారు. తండ్రి నాగేశ్వరరావు బీసీ సంక్షేమసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్నారు. భరత్‌రామ్ ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి పేరు : మాగుంట శ్రీనివాసులరెడ్డి తండ్రి: రాఘవరెడ్డి, తల్లి: కౌసల్యమ్మ స్వగ్రామం: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు ప్రస్తుత నివాసం: రాంనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా కుటుంబం: భార్య గీతా లతమ్మ, పెద్ద కుమారుడు రాఘవరెడ్డి, పెద్ద కోడలు చందన, చిన్న కుమారుడు నిఖిల్‌బాబు విద్యార్హత: బీకాం డిగ్రీ (1973లో నెల్లూరు జిల్లా వీఆర్ కాలేజీలో పూర్తిచేశారు. ) పుట్టిన తేదీ: 15.10.1953 రాజకీయ నేపథ్యం : 1998, 2004, 2009 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తాజాగా 2019 ఎన్నికల్లో ఆరోసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి పేరు : ఆదాల ప్రభాకర్‌రెడ్డి తండ్రి – ఆదాల శంకరరెడ్డి భార్య – వింధ్యావళి కుమార్తెలు– భానురేఖ, హిమబిందు విద్యార్హత – (ఇంజినీరింగ్) వృత్తి – క్లాస్–1 కాంట్రాక్టర్ 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించి 1999లో అల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009లలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. 2014లో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. -
బీసీ అజెండా
దళపతులు నిర్ణయమయ్యారు. ఎన్నికల యుద్ధంలో వైఎస్సార్సీపీని విజయతీరం చేర్చేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. మీ వెంటే మేమంటూ లక్షలాదిగా ఉన్న పార్టీ కార్యకర్తల సైన్యం కదం తొక్కుతోంది. బీసీలకు పెద్దపీట వేస్తూ.. సామాజిక న్యాయానికి సరికొత్త భాష్యం చెబుతూ.. పార్టీ సారధి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో నవ్యోత్సాహం నింపింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఆరు బీసీలకు కేటాయించడం, మరో మూడు ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా ఒకేసారి అభ్యర్థులందరినీ ప్రకటించి చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. నామినేషన్ల ఘట్టం ప్రారంభానికి 24 గంటల ముందుగానే ఒకేసారి 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల జాబితాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఆదివారం ప్రకటించారు. జిల్లాలోని మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నిర్ణయంలో సామాజిక సమతూకం పాటించడం కొత్త జోష్ నింపింది. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలో మెజార్టీ సామాజికవర్గాలైన బీసీలకు అగ్రపీఠం వేశారు. అధికార టీడీపీ అంచనాలను తలకిందులు చేస్తూ ఆ వర్గాలకు ఎంపీ స్థానంతోసహా ఏడు సీట్లు కేటాయించారు. ఇక ఇతర సామాజికవర్గాల పరంగా చూస్తే కాపులకు రెండు, క్షత్రియులకు రెండు, బ్రాహ్మణులకు ఒకటి, రెడ్లకు ఒకటి, కమ్మకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు మూడు సీట్లు కేటాయించారు. పార్టీ తరఫున నలుగురు మహిళలను చట్టసభలకు పంపించే అరుదైన అవకాశాన్ని కల్పించడం విశేషం. లోక్‌సభకు ఇద్దరు, అసెంబ్లీకి ఇద్దరు మహిళలను ఎంపిక చేశారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ కాండ్రేగుల సత్యవతి, అరుకు లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేవుడు కుమార్తె గొడ్డేటి మాధవి, అలాగే భీమిలి అసెంబ్లీ నుంచి అక్కరమాని విజయనిర్మల, పాడేరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు. తొలిసారి8 మందికి ఛాన్స్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న వారిలో ఎనిమిది మందికి తొలిసారి ఎన్నికల బరిలో నిలవడం మరో విశేషం. మూడు లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దింపిన అభ్యర్థులు కొత్తవారే. పాడేరు, అరుకు, విశాఖ తూర్పు, ఉత్తరం, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఎన్నికలకు కొత్తవారే. అదే విధంగా పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న వారికి అగ్రపీఠం వేశారు. పార్టీ కో ఆర్డినేటర్లలో 16మందికి టికెట్లు కేటాయించారు. విశాఖ, అరుకు లోక్‌సభ టికెట్లను కో ఆర్డినేటర్లకే కేటాయించారు. అదే విధంగా విశాఖ దక్షిణం మినహా మిగిలిన వారందరూ కో ఆర్డినేటర్లుగా పనిచేసిన వారే. తనతో పాటు పార్టీ జెండాపై గెలుపొందిన ఇరువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ప్రలోభా లకు లొంగి ఫిరాయింపులకు పాల్పడగా, తాను మాత్రం ప్రలోభాలకు గురికాకుండా పార్టీలోనే కొనసాగిన శాసనసభ పక్ష ఉపనేత బూడి ము త్యాలనాయుడు తిరిగి మాడుగుల సీటునే కేటాయించారు. టీడీపీలో కానరాని సామాజిక న్యాయం అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడా కన్పించలేదు. ఇప్పటి వరకు పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మూడు పార్లమెంటు స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడు తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 10 స్థానాల్లో తొమ్మిది చోట్ల సిట్టింగ్‌లకే అవకాశం కల్పించింది. సామాజిక వర్గాల సమతూకం కూడా పాటించిన దాఖలాలు కన్పించలేదు. ఒకే ఒక్క మహిళకు ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో అవకాశం కల్పించారు. ఇంకా ప్రకటించనున్న స్థానాల్లో కూడా మహిళలకు కేటాయించే అవకాశాలు కన్పించడంలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. లోక్‌సభ అభ్యర్థులు విశాఖæ–ఎంవీవీ సత్యనారాయణ(ఓసీ–కమ్మ) అనకాపల్లిæ– డాక్టర్ కాండ్రెగుల సత్యవతి(బీసీ–గవర) అరకు –గొడ్డేటి మాధవి(ఎస్టీ–కొండదొర) అసెంబ్లీ అభ్యర్థులు అనకాపల్లి – గుడివాడ అమర్నా«థ్ (కాపు) యలమంచిలి– యూవీ రమణమూర్తి (ఓసీ–క్షత్రియ) పాయకరావుపేట– గొల్ల బాబురావు(ఎస్సీ –మాల) నర్సీపట్నం–పెట్ల ఉమాశంకర్ గణేష్(బీసీ–వెలమ) చోడవరం– ధర్మశ్రీ(బీసీ–కాపు) మాడుగుల– బూడి ముత్యాలనాయుడు(బీసీ–వెలమ) పెందుర్తి–అన్నంరెడ్డి అధీప్‌రాజ్(బీసీ–వెలమ) అరకు– శెట్టి పాల్గుణ(వాల్మీకి–ఎస్టీ) పాడేరు–కొట్టగుల్లి భాగ్యలక్ష్మి(ఎస్టీ–భగత) భీమిలి–అవంతి శ్రీనివాస్(కాపు) విశాఖ తూర్పు– అక్కరమాని విజయనిర్మల(బీసీ–యాదవ్) విశాఖ పశ్చిమ– మళ్ల విజయప్రసాద్(బీసీ–గవర) విశాఖ దక్షిణ–ద్రోణంరాజు శ్రీనివాస్(ఓసీ–బ్రాహ్మణ) విశాఖ ఉత్తర– కమ్మిల కన్నపురాజు(కె.కెరాజు)(ఓసీ–క్షత్రియ) గాజువాక– తిప్పల నాగిరెడ్డి(రెడ్డి) -
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి
జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. వీరి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.... పేరు: దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం: భార్య దువ్వాడ వాణి(టెక్కలి మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు). విద్యార్హత: బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్, బీఎల్ (పీఆర్ కళాశాల, కాకినాడ) రాజకీయ ప్రవేశం: 2001లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా, 2006 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పీఆర్పీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఉప ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఉద్యమాలు: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2010 నుంచి పోరాడుతున్నారు. -
వైఎస్సార్సీపీ దళపతులు
జాబితా విడుదలైంది.. విజయం మనదే అంటూ జగన్ సేన సిద్ధమైంది..నవరత్నాలు వంటి పథకాలు ఇప్పటికే జనంలోకి బాగా వెళ్లగా రెట్టించినఉత్సాహంతో వైఎస్సార్సీపీ దళపతులు పోటీకి సై అంటున్నారు. రాజకీయకుట్రలను దునుమాడుతూ.. ప్రజా కంటక పాలనను అంతమొందిస్తూ.. జనంకలలను నిజం చేసే మధుర క్షణాల కోసం ఇన్నాళ్ల పోరాటం.. ఇన్నాళ్లనిరీక్షణ సఫలమయ్యేలా రాజకీయ రణరంగంలోకి ప్రవేశిస్తున్నారు. పాత కొత్తల మేలు కలయికతోసాగిన అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతోంది. ఇక ఎన్నికల క్రతువే మిగిలింది. అనకాపల్లి ఎంపీ : కాండ్రేగుల సత్యవతి విద్యార్హత: ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్ వయసు: 52 కుటుంబ సభ్యులు: భర్త పేరు కాండ్రేగులవిష్ణుమూర్తి(డాక్టర్), కుమారుడు యశ్వంత్(డాక్టర్), కుమార్తె పావని( డాక్టర్). రాజకీయ నేపథ్యం: 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నిర్వహించిన పదవులు: రోటరీ ఒకేషనల్ అవార్డు, భారతవికాస పరిషత్ టాప్ డాక్టర్ ఆఫ్ ది టౌన్, వైఎంసీఏ డాక్టర్ ఆఫ్ ది మిలీనియం, రెండు నెలల క్రితం వైఎస్సార్సీపీ చేరారు. విశాఖ ఎంపీ :ముళ్లపూడివీర వెంకట సత్యనారాయణ విద్యార్హత: డిగ్రీ వయసు: 54 కుటుంబ సభ్యులు: భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్. రాజకీయ నేపథ్యం: ఆరు నెలలు క్రితం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. విశాఖ పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన పదవులు: విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు. అరకు ఎంపీ: గొట్టేటి మాధవి విద్యార్హత: బీయస్సీ,బీపీఈడి వయసు: 27 కుటుంబ సభ్యులు: తండ్రి పేరు గొడ్డేటి దేముడు( దివంగత మాజీ ఎమ్మెల్యే), అమ్మ పేరు చెల్లయ్యమ్మ. రాజకీయ నేపథ్యం: ఈమె తండ్రి చింతపల్లి శాసన సభ్యుడిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2018 ఆగష్టు 27 వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది. నిర్వహించిన పదవులు: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త. భీమిలి :ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యార్హత: ఎం.ఏ., ఎల్ఎల్బీ వయసు:52 కుటుంబ సభ్యులు: భార్య జ్ఞానేశ్వరి, కుమార్తె ప్రియాంక, కుమారుడు వెంకట శివనందేష్ రాజకీయ నేపథ్యం: అవంతి విద్యాసంస్థల అధినేత. 2009లో రాజకీయ ప్రవేశం. నిర్వహించిన పదవులు: 2009–2014 వరకూ భీమిలి ఎమ్మెల్యే, 2014–2019 వరకూ అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. పెందుర్తి :అన్నంరెడ్డి అదీప్‌రాజ్ విద్యార్హత: ఎంబీఏ, వయసు:36 కుటుంబ సభ్యులు: భార్య శిరీష, కుమారుడు సత్యధన్విరాజ్ రాజకీయ నేపథ్యం: వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నిర్వహించిన పదవులు: రాంపురం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. గాజువాక :తిప్పల నాగిరెడ్డి విద్యార్హత:ఇంటర్మీడియట్ వయసు:65 కుటుంబ సభ్యులు: భార్య రాధ, కుమార్తె కవిత, కుమారులు వంశీరెడ్డి, దేవన్‌రెడ్డి రాజకీయ నేపథ్యం: వీఏఓగా పనిచేస్తూ.. ఆ వ్యవస్థను రద్దు చేయడంతో 1984లో కాంగ్రెస్‌లో చేరారు. నిర్వహించిన పదవులు: 2007 జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి, వీఏవో సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విశాఖ తూర్పు : అక్కరమాని విజయనిర్మల విద్యార్హత: ఇంటర్మీడియట్, వయసు : 47 కుటుంబ సభ్యులు: భర్త వెంకటరావు, కుమార్తె భారతి, కుమారుడు అవినాష్ రాజకీయ నేపథ్యం: 2005లో రాజకీయ ప్రవేశం. నిర్వహించిన పదవులు: 2005లో భీమిలి మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. అదే ఏడాది మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2008–2010 వరకూ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. విశాఖ పశ్చిమ : మళ్ల విజయప్రసాద్ విద్యార్హత: డిగ్రీ వయసు:53 కుటుంబ సభ్యులు: భార్య అరుణకుమారి, కుమార్తెలు అనూష, అలేఖ్య రాజకీయ నేపథ్యం: వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థ అధినేతగా ఉంటూ 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నిర్వహించిన పదవులు: 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విశాఖ దక్షిణ : ద్రోణంరాజు శ్రీనివాస్ విద్యార్హత: బి.కాం., బీఎల్ వయసు:58 కుటుంబ సభ్యులు: భార్య శశి, కుమారుడు శ్రీవత్సవ, కుమార్తె శ్వేత, రాజకీయ నేపథ్యం: తండ్రి ద్రోణం రాజు సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ నేత. తండ్రి మరణాననంతరం శ్రీనివాస్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. నిర్వహించిన పదవులు 2006లో జరిగిన ఉప ఎన్నికలో ద్రోణంరాజు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేశారు. విశాఖ ఉత్తర : కేకే రాజు విద్యార్హత: బీఏ, వయసు:42 కుటుంబ సభ్యులు: భార్య సుమ, కుమార్తెలు సాత్విక, హాన్విక రాజకీయ నేపథ్యం: 2014 నుంచి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిర్వహించిన పదవులు: ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. మాడుగుల : బూడి ముత్యాలనాయుడు విద్యార్హత: ఇంటర్మీడియట్ వయసు : 57 కుటుంబ సభ్యులు: భార్య రమణమ్మ రాజకీయ నేపథ్యం: 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ కన్వీనర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితర పదవులు నిర్వహించారు. నిర్వహించిన పదవులు: తారువా గ్రామ సర్పంచ్, ములకలాపల్లి ఎంపీటీసీ సభ్యుడు, దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవులు చేపట్టారు. అరకులోయ :చెట్టి పాల్గుణ విద్యార్హత: ఎం.ఏ. పాలిటిక్స్, వయసు:57 కుటుంబ సభ్యులు: భార్య అనురాధ, కుమారులు వికాస్, వినయ్, సాయి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం: టీచర్‌గా చేరి..1984లో ఎస్బీఐ క్లర్క్‌గా పనిచేసి..33 ఏళ్ల తరువాత బ్యాంకు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. తరువాత రాజీనామా చేశారు. 2017లో వైఎస్సార్ సీపీలో చేరారు. నిర్వహించిన పదవులు: మన్యప్రజల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పాడేరు :కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విద్యార్హత: ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బీఈడీ వయసు:34 కుటుంబ సభ్యులు: భర్త తమర్భ నర్సింగరావు, కుమారుడు వివేక్, కుమార్తెలు జస్మితశ్రీనందన గాయిత్రి రాజకీయ నేపథ్యం: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. 2009 నుంచి 2014 వరకు ట్రైఫాడ్ చైర్‌పర్సన్‌గా పని చేశారు. నిర్వహించిన పదవులు: అరకు పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2014 నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2017లో వైఎస్సార్సీలో చేరారు. నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్ గణేష్ విద్యార్హత: బీఏ, వయసు: 47 కుటుంబ సభ్యులు: భార్య కళావతి, కుమారులు అవినాష్, ఆదర్శ్ రాజకీయ నేపథ్యం: 1992లో టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో ప్రారంభం నుంచి ఉన్నారు. నిర్వహించిన పదవులు: బాపిరాజు కొత్తపల్లి సర్పంచ్‌గా 1995 నుంచి 2001 వరకు, తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్‌గా 2009 నుంచి 2012 వరకు పనిచేశారు. యలమంచిలి : ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు) విద్యార్హత: బీకాం డిస్కంటిన్యూ.., వయసు:67 కుటుంబ సభ్యులు: రాధాదేవి, సుకుమారవర్మ, కుమార్తెలు రోజారాణి, రూపారాణి రాజకీయ నేపథ్యం: రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్ ఉండేవారు. 1999లో రాజకీయ ప్రవేశం చేశారు. నిర్వహించిన పదవులు: 2004,2009లో వరుసుగా కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. పాయకరావుపేట :గొల్ల బాబూరావు విద్యార్హత: ఎం.ఏ., ఎల్ఎల్బీ, వయసు:65 కుటుంబ సభ్యులు: భార్య వసంతకుమారి, కుమారుడు సాయికార్తీక్, కుమార్తె నాగసౌమ్య రాజకీయ నేపథ్యం: పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేశారు. 2009,2012 (ఉప ఎన్నిక) ఎమ్మెల్యేగాగా పనిచేశారు. నిర్వహించిన పదవులు: 2011 నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చోడవరం :కరణం ధర్మశ్రీ విద్యార్హత: బీఏ, బీఎడ్, బీఎల్ వయసు: 51 కుటుంబ సభ్యులు: భార్య వెంకట విజయ, కుమార్తెలు కుసువు, స్వాతి, కుమారుడు సూర్య రాజకీయ నేపథ్యం: 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్ష పదవితోపాటు అనేక పార్టీ పదవులు చేపట్టారు. నిర్వహించిన పదవులు: 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనకాపల్లి :గుడివాడ అమర్నాథ్ విద్యార్హత: ఇంజినీరింగ్ పట్టభద్రుడు వయసు: 35 కుటుంబ సభ్యులు: తండ్రి దివంగత మంత్రి గుడివాడ గురునాథరావు, తల్లి నాగమణి రాజకీయ నేపథ్యం: 21 ఏళ్లకే రాజకీయ అరంగేట్రం చేసి, 2007లో టీడీపీ చేరారు. నిర్వహించిన పదవులు: 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 65వ వార్డు కార్పొరేటర్‌గా గెలుపొందారు.