breaking news
yem maya chesave
-
సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా?
సమంత(Samantha), నాగ చైనత్య కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సమంత నటిగా ఎంట్రి ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. అంతేకాదు నాగచైతన్యతో ప్రేమలో పడడానికి కారణం కూడా ఈ మూవీనే .అందుకే అటు నాగ చైతన్య(Naga Chaitanya)కు గాని, ఇటు సమంతకు గాని ‘ఏ మాయా చేసావే’ చిత్రం చాలా స్పెషల్. సమంత అయితే ఏకంగా ఈ చిత్రం పేరు (వైసీఎం)తో టాటూనే వేయించుకుంది. చైతన్యతో విడిపోయినా.. ఇప్పటికీ తన ఫేవరేట్ చిత్రం ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నాగ చైతన్య కూడా తన ఫేవరేట్ చిత్రాల్లో వైఎంసీ ఒకటి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇలా ఇద్దరికీ చాలా ఇష్టమైన చిత్రం మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. జులై 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. అటు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సమంత అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీరిలీజ్ చేయాలని సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జెస్సీ(సమంత), కార్తీక్ (నాగ చైతన్య)ల లవ్‌స్టోరీ మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ సినిమా కంటే ఎక్కువగా మరో విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రీరిలీజ్ ప్రమోషన్స్ లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారా? అని ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుంటున్నారు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇది అసాధ్యమనే చెప్పాలి. చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మాజీ భర్తని కలిసేందుకు ఇష్టపడుతుందా అంటే .. కష్టమనే చెప్పాలి. అటు నాగ చైతన్య కూడా శోభితతో పెళ్లి తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కూడా సామ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమే. అభిమానుల కోరుకున్నట్లుగా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పట్లో అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. సినిమాలు ఉన్నా లేకున్నా..ఆమె మాత్రం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూనే ఉంటారు. అలాగే తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ సంస్ధకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ స్పెషల్ వీడియోలో సమంత ‘నథింగ్ టు హైడ్’ అని రాస్తూ.. నవ్వుతూ తిరిగి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా..పలువురు నెటిజన్స్ సమంత టాటూపై కామెంట్ చేస్తున్నారు. ఆమె మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటు ఆ వీడియోలు కనిపించడం లేదు. దీంతో ‘వైఎంసీ టాటూని తొలగించావా సమంత?’ అని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మేకప్‌తో అది కవర్ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.వైఎంసీ టాటూ స్పెషల్ ఏంటి?సమంత హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు. 2010లో విడుదలైన ఈ ప్రేమ కథాచిత్రం .. ఆ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత ‘వైఎంసీ’(ఏం మాయ చేసావే) అనే టాటుని వేయించుంది. ఈ టాటు తనకు చాలా స్పెషల్ అని సమంత పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ సామ్ మాత్రం ఈ టాటుని తొలగించలేదు. తాజాగా ఈ టాటూ కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడే సామ్ ఈ టాటూలు వేయించుకుంది. విడాకుల తర్వాత ఒక్కో టాటూని తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘చై’ అనే టాటూని తొలగించింది. వెబ్ సిరీస్.. సినిమాలతో బిజీ బిజీఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత
అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు తొలి సక్సెస్ ఇవ్వటంతో పాటు సమంత లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సూపర్ హిట్ సినిమా 'ఏం మాయ చేసావే..'. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమాలొ నాగచైతన్య సమంతలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చైతు, సమంతలు కలుసుకొని ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ' నాగ చైతన్య తో కలిసి ఎదిగిన ఫీలింగ్ కలుగుతోంది. ఏడేళ్లుగా మంచి మిత్రులుగా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది' అంటూ సమంత ట్విట్టర్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఈ కామెంట్ పై స్పందించిన చైతన్య ' కాలం మారినా కొన్ని విషయాలు మాత్రం మారవు సమంత' అంటూ ట్వీట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే ఫిబ్రవరి 26, 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది.