breaking news
YARAPATHINENI
-
ఎమ్మెల్యే యరపతినేని హింస రాజకీయం
-
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ
-
టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ
-
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీఐడీ మొక్కుబడి విచారణ
-
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌పై విచారణ
సాక్షి, గుంటూరు:టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఈ దందాపై ఎట్టకేలకు విచారణను ప్రారంభించారు. దీనిలో భాగంగా సీబీఐ, మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల పీఎస్‌కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్ లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతోంది. సున్నం తయారీ మిల్లర్లతోనూ సమావేశం ఏర్పాటుచేశారు. అంతకుముందు అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వటానికే... గురజాల అక్రమ మైనింగ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీనచీట్ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏ ఎమ్మెల్యే నైనా విచారించిన ఘనత సీఐడికి ఉందా అని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై వేలు విలువ చేసే భూములను అప్పట్లోనే రెండు మూడు లక్షల చొప్పున కొన్నారని, ఈ భూములపై యరపతినేని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..? -
అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేసే కుట్ర జరుగుతోందని అధికారులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్‌లో ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి.. అక్రమ సున్నపురాయి క్వారీల కేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని వారు అంటున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని వారు చెప్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నలుగురు తహశీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, ఐదుగురు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేసి అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందని, అందుకే కిందిస్థాయిలో ఉన్న తమను టార్గెట్ చేస్తున్నారని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాజకీయ నేతలు, వారికి సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకుండా.. తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు. -
‘పర్యటన అడ్డుకున్నా.. ఉద్యమాన్ని ఆపలేరు’
సాక్షి, గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులను అడ్డం పెట్టుకుని వాయిదా వేయగలిగారనీ, కానీ టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. మైనింగ్ అక్రమాలు వెల్లడైతే ప్రభుత్వం ఇరుకునపడుతుందని యరపతినేని వణికిపోతున్నారని అన్నారు. అందినకాడికి దోచుకున్న యరపతినేని మైనింగ్ కేసులో తన దగ్గర పనిచేసే డ్రైవర్, వాచ్మెన్, గుమాస్తాలను బాధ్యులను చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియా నుంచి వసూలు చేసిన రెండువేల కోట్ల పెనాల్టీని పల్నాడు అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన 6 నెలల్లో అక్రమ మైనింగ్ జరిగిన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ప్రజా తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో యరపతినేనికి త్వరలో చూపిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు దారుణమైన ఓటమి తప్పదని మహేష్‌రెడ్డి హెచ్చరించారు. -
అక్రమ మైనింగ్ కేసు: యరపతినేనిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం
-
టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్‌కి గ్రీన్ ట్రిబ్యునల్ చెక్
-
ఖనిజ దందాకు బ్రేక్..
జీవో 124పై ఎన్జీటీ స్టే.. రాష్ట్ర సర్కారుకు చెంపపెట్టు.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని స్కెచ్‌కి చెక్ - ఆశ్రీతుని మేలు కోసమే అడ్డగోలు జీవో.. - ఏపీఎండీసిని రంగంలోకి దింపి అభాసుపాలు.. - గుంటూరు జిల్లాలో ఏళ్లుగా అక్రమ తవ్వకాలు - హైకోర్టు ఆదేశాలనే అమలు చేసే పరిస్థితి లేదు.. - లోకాయుక్త విచారణలో బయటపడ్డ అక్రమాలు.. సాక్షి, అమరావతి: అధికారపార్టీ ఎమ్మెల్యేకి మేలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగమేఘాలపై జారీ చేసిన ఓ అడ్డగోలు జీవోకు బ్రేక్ పడింది. గుంటూరు జిల్లాలో 95 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఈ జీవోను ఆమలు చేయరాదని ఆదేశించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో 95 ఎకరాలను ఏపీఎండీసీకి రిజర్వు చేస్తూ ఈ ఏడాది సెప్టెంబరు ఏడో తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబరు 124 దీంతో ఆగిపోయింది. గనుల తవ్వకాలు జరపకూడని ప్రాంతంలో ప్రభుత్వం ఏపీఎండీసీకి సున్నపురాయి నిక్షేపాలను రిజర్వు చేయడం చట్ట విరుద్ధమని, అందువల్ల దీనిని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని గుంటూరు జిల్లాకు చెందిన టీజీవీ కృష్ణారెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పులిచింతల నిర్వాసిత కాలనీ వాసులు దుమ్ము, కాలుష్యం బారిన పడతారని పిటిషన్లో పేర్కొన్నారు. డేంజర్ జోన్లో ఉన్నందున ఇక్కడ తవ్వకాలు జరపడం ప్రమాదకరమని కూడా వివరించారు. ఇందుకు సంబంధించి గతంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), గనుల భద్రత సంచాలకులు ఇచ్చిన నివేదికలను కూడా ఆధారాలుగా సమర్పించారు. ఏపీఎండీసీని పావుగా వాడుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పులను ఒప్పులుగా మార్చడం, టెండరు పేరుతో ఖనిజ నిక్షేపాలను కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని స్పష్టీకరించారు. ఈ ప్రాంతంలో ఖనిజ అక్రమ తవ్వకాలకు అడ్డకట్ట వేయాలని, ఇప్పటి వరకూ ఖనిజ సంపదను దోచుకున్న వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడంలేదని వివరించారు. వీటిని పరిశీలించిన ఎన్జీటీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ జీవో 124ను అమలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు జీవో 124పై ‘స్టే’ ఉత్తర్వులను రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి, భూగర్భ గనుల శాఖ సంచాలకులకు, ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్‌కు పంపించింది. ‘పచ్చ’దండు దందా ఇదీ.. గుంటూరు జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించడం ద్వారా కోట్లు దండుకుంటుంటే... మరో ఎంపీ సోదరుని సంస్థ జీవీపీ ఇన్ఫ్రా 982 ఎకరాల అభయరణ్యానికే ఎసరు పెట్టేందుకు స్కెచ్ వేసింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే మరీ బరితెగించి లీజులు లేకుండానే సున్నపురాయిని అడ్డగోలుగా తవ్వించి పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వందల కోట్లు దండుకుంటున్నారు. జాతీయ సంపదైన ఖనిజ నిక్షేపాలను కాపాడాల్సిన, అక్రమ తవ్వకాలను, తరలింపును అడ్డుకోవాల్సిన భూగర్భ గనుల శాఖ కళ్లుండీ చూడలేని కబోదిలా మారింది. అయితే లోకాయుక్త డెరైక్టర్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో తన అక్రమ తవ్వకాల దందాకు అడ్డుకట్టపడే ప్రమాదముందని గ్రహించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అక్రమాలను ‘చట్టబద్ధం’ చేసుకునే దిశగా పావులు కదపడం.. అందుకోసం రాష్ర్టప్రభుత్వం ఏకంగా ఏపీఎండీసీనే రంగంలోకి దించి ఆగమేఘాలపై జీవో జారీ చేయడం గమనార్హం.. ఎమ్మెల్యే స్కెచ్ ప్రకారమే జీవో.. హైకోర్టు ఆదేశాలు కూడా అమలుకావడంలేదని లోకాయుక్త నివేదిక ఇవ్వడం, ఎప్పటికైనా తాము నివేదిక సమర్పించక తప్పదని జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేయడంతో అక్రమ తవ్వకాలను ‘చట్టబద్దం’ చేసుకోవాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేపై అనేక అభియోగాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలవల్ల లీజులు ఇచ్చే పరిస్థితి లేదని గనుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏపీఎండీసీకి ఈ ప్రాంతాన్ని రిజర్వు చేయించి ఆ సంస్థ ద్వారా ఖనిజ తవ్వక అధికారాలు పొందడం ఉత్తమమని గ్రహించి ఎమ్మెల్యే చకచకా పావులు కదిపారు. యరపతినేని స్కెచ్వేశారు.. దానికి రాష్ర్టప్రభుత్వం సరేనంది. దాంతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలోని 690, 691, 692 సర్వే నంబర్లలో 95 ఎకరాలను తమకు రిజర్వు చేయాలంటూ ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా దానిని సర్కారు ఆమోదించి జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం ఈ నిక్షేపాల ప్రాంతాన్ని రిజర్వు చేసిందే తడవుగా... ఇక్కడ ఖనిజ తవ్వకం, ఖనిజ నాణ్యత పెంపు కోసం ఆసక్తిగల సంస్థలు దరఖాస్తులు సమర్పించాలంటూ ఆగస్టు నాలుగో తేదీన ఏపీఎండీసీ ఓ ప్రకటన జారీ చేసింది. టెండరు పేరుతో ఖనిజ నిక్షేపాలను యరపతినేనికి కట్టబెట్టేందుకే ఈ మొత్తం తంతు చేపట్టారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఏపీఎండీసీ అనేక చోట్ల సున్నపురాయి, ఐరన్‌ఓర్, బాక్సైట్, బెరైటీస్, బీచ్‌శాండ్ తదితర మైనింగ్ లీజులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులనే సరిగా చేసుకోలేక ఏళ్లతరబడి పనులు ముందుకు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితిలో కోనంకిలో అదీ పులిచింతల పునరావాస ప్రాజెక్టు నిర్వాసిత కాలనీ డేంజర్ జోన్లో ఉన్న ప్రాంతాన్ని రిజర్వు చేయించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. యరపతినేని కోసమే దీనిని చేపట్టి ఏపీఎండీసీ అభాసుపాలైంది’ అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే... కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం పిడుగురాళ్ల, కోనంకి గ్రామాల పరిసరాల్లో సున్నపురాయి నిక్షేపాలను స్థానిక కూలీలతో అక్రమంగా తవ్వించి విక్రయించడం ద్వారా కొంతమేరకు ఆర్జించిన యరపతినేని టీడీపీ అధికారంలోకి వచ్చాక అడ్డూ అదుపూ లేకుండా రేయింబవళ్లు అక్రమ తవ్వకాలు సాగించారు. ఈ ఖనిజాన్ని సిమెంటు కర్మాగారాలకు సరఫరా చేస్తూ వందల కోట్లు ఆర్జించారు. అనుమతులు లేకుండా యరపతినేని సున్నపురాయి నిక్షేపాలను తవ్విస్తున్నా అధికారయంత్రాంగం అడ్డుకోలేదు. ‘పిల్’తో వెలుగులోకి... టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగిస్తున్న ఖనిజ దందా చూసి ఆవేదన చెందిన గుంటూరుకు చెందిన కె.గురువాచారి 21-08-2015న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారించిన హైకోర్టు అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయడంతోపాటు ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని వారి నుంచి అపరాధ రుసుంతో సహా వసూలు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖ అధికారులను ఆదేశిస్తూ గత మార్చి 28న ఆదేశాలు జారీ చేసింది. తన తీర్పు తర్వాత కూడా అక్రమ తవ్వకాలు కొనసాగితే జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాలని కె.గురువాచారికి హైకోర్టు సూచించింది. అయినా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేగానీ, ఎస్పీ నారాయణ నాయక్ గానీ హైకోర్టు ఆదేశాల అమలుకు సాహసించలేకపోయారు. అక్రమాలను బైటపెట్టిన లోకాయుక్త విచారణ.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగిస్తున్న గనుల దందాపై పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అన్నపురెడ్డి హనిమిరెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోకాయుక్త విచారణ విభాగం ఇన్‌ఛార్జి డెరైక్టర్ కె.నరసింహారెడ్డి విచారణ చేసి లోకాయుక్త రిజిష్ట్రార్‌కు నివేదిక సమర్పించారు. పిడుగురాళ్ల, కోనంకి ప్రాంతాల్లో 2014కు ముందు స్థానిక కూలీలతో ఎమ్మెల్యే యరపతినేని సున్నపురాళ్లను తవ్వించే వారనీ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురు లేదనే ధీమాతో అడ్డూఅదుపూ లేకుండా ఖనిజాన్ని తవ్వి తరలిస్తున్నారేది అందరికీ తెలిసిన అంశమేనని లోకాయుక్త డెరైక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో యరపతినేని అక్రమాలను నిరోధించే సాహసం ఎవరూ చేయలేదని ఆయన నివేదికలో స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను ఆదేశిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని డెరైక్టర్ కె.నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణమండలి వద్దన్నా... ఇక్కడ తవ్వకాలు సాగిస్తే పులిచింతల నిర్వాసిత కాలనీ వాసులు కాలుష్యంవల్ల అనారోగ్యాల బారిన పడతారు. ఈ ప్రాంతం డేంజర్ జోన్ పరిధిలో ఉన్నందున తవ్వకాలు జరపరాదని గనుల భద్రత సంచాలకులు గతంలో నివేదిక ఇచ్చారు. ఇక్కడ తవ్వకాలు జరిపితే దుమ్ము, కాలుష్యం వల్ల నిర్వాసిత కాలనీ వాసులు ఇబ్బంది పడతారనే కారణంగానే గతంలో ఆరు సంస్థలు మైనింగ్ కార్యకలాపాల కోసం పెట్టుకున్న కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ) దరఖాస్తులను కాలుష్య నియంత్రణ మండలి తిరస్కరించింది. అయినా అధికారపార్టీ ఎమ్మెల్యేకోసం రాష్ర్టప్రభుత్వం ఆ ప్రాంతంలో మైనింగ్ జరిపేందుకు అనుమతించే దిశగా అడుగులు వేసింది. ‘‘గుంటూరుజిల్లాలో ఖనిజ అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే అధికాార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కాబట్టి జిల్లా కలెక్టరు కాంతిలాల్ దండే, ఎస్పీ కూడా భయపడి మిన్నకుండిపోతున్నారు. ఖనిజ అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయడమే కాక చట్టవిరుద్ధంగా ఖనిజ నిక్షేపాలను తరలించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా కలెక్టరు, ఎస్పీలు ఉన్నారు.’’ -లోకాయుక్త వ్యాఖ్య ఇది.. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, గనుల శాఖఅధికారులు అక్రమ తవ్వకాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలి. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని వారి నుంచి అపరాధ రుసుంతో సహా వసూలు చేయాలి. - 2015 ఆగస్టు 28న హైకోర్టు తీర్పు -
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత
-
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత
దాచేపల్లి(గుంటూరు): కృష్ణా పుష్కర పనుల్లో అవినీతి జరిగిందని ఒకరు.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మరొకరు.. సవాల్‌కు ప్రతిసవాల్ విసురుకోవడంతో.. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య ఈ విషయంలో వాదోపవాదాల అనంతరం ఆధారాలతో నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని యరపతినేని సవాల్ చేశారు. దీంతో అవినీతికి సంబంధించిన ఆధారాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. అలాగే.. గురజాల ఎమ్మెల్యేను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా మాచర్లలోని ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. చర్చావేదికకు వెళ్లేందుకు యత్నిస్తున్న పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లికి చెందిన వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. -
యరపతినేనికి చెక్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న సున్నపురాయి అక్రమ దందాపై ప్రభుత్వశాఖల ముట్టడి ప్రారంభమైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ దందాపై ప్రత్యేక నివేదికను రూపొందించనున్నాయి. లోకాయుక్త నియమించనున్న కమిటీ దీనిపై పూర్తి వివరాలు సేకరించనుంది. ఒకేసారి యరపతినేని చుట్టూ ముడి బిగిస్తుండటంతో ఇప్పటివరకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పక్కకు తప్పుకొన్నాయి. దీంతో 20 రోజుల నుంచి అక్రమ మైనింగ్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు గత శుక్రవారం పిడుగురాళ్ల, దాచేపల్లిలోని క్వారీలను పరిశీలించి వివరాలు సేకరించారు. యరపతినేని అక్రమ సున్నపురాయి తవ్వకం, తరలింపుపై వైఎస్సార్ సీపీ బీసీసెల్ నేత గురువాచారి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతకుముందే ఆ నియోజకవర్గ ఇన్చార్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, యరపతినేని అక్రమ మైనింగ్‌పై ఆందోళన నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు సాక్ష్యాధారాలతో వినతిపత్రాలు అందచేశారు. స్పందించకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతోపాటు అక్రమ మైనింగ్, సున్నపురాయి కంపెనీల విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల కాపీలను ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికారిక మైనింగ్ లేకపోయినా క్వారీల్లో 30 నుంచి 40 అడుగుల లోతులో సున్నపురాయి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లను లోకాయుక్తకు అం దచేశారు. ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించి ఒక కమిటీని ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలోని సభ్యులు త్వరలో ఇక్కడి అక్రమ క్వారీయింగ్‌ను పరిశీలించి లోకాయుక్తకు నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త అక్టోబరు 5 వ తేదీలోపు అక్రమ క్వారీయింగ్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సంచాలకులను ఆదేశించింది. రహస్య నివేదిక .. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివిధ ప్రభుత్వశాఖలతోపాటు టీడీపీలోని కొందరు ముఖ్యులు ఇచ్చిన రహస్య నివేదికలో రెండు ప్రధాన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గంలో సున్నపురాయి తీయడానికి అవకాశం ఉన్న భూములను గుర్తించి, వాటిని పారదర్శకంగా లీజుకు ఇవ్వాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉందని, వారంతా యరపతినేని దందాను నిలువరించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా మద్యం వ్యాపారుల్లో కొంతమంది యరపతినేనికి వాటాలు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారని, అదేవిధంగా లీజుకు ముందుకు వచ్చే వ్యాపారులు కూడా యరపతినేని ప్రతిపాదనలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కుదరని పక్షంలో గురజాల నియోజకవర్గంలో మిగిలిన సున్నపురాయి క్వారీలను రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇలా యరపతినేని ఆగడాలను నిలువరించే అవకాశం ఉంటుందని, లేకుంటే ఇక్కడ విధులు నిర్వహించడం కష్టంగా ఉందని పలు ప్రభుత్వశాఖలు నివేదికలిచ్చినట్టు తెలుస్తోంది. చర్యలకు డిమాండ్.. అక్రమ మైనింగ్ దందాకు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.