breaking news
yangon
-
Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి
యాంగాన్: మయన్మార్‌లో సైన్యం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూచీతో పాటు పలువురు నేతలను నిర్బంధంలోకి తీసుకొని సైనిక పాలన ప్రకటించింది. సూచీపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించింది. నాటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే మయన్మార్ సైన్యం రెచ్చిపోయింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. రక్తపాతం సృష్టించింది. మయన్మార్ చరిత్రలోనే ఇది చీకటి రోజని ప్రజాస్వామ్య అనుకూలవాదులు, మానవతావాదులు పేర్కొన్నారు. మయన్మార్‌లోని ప్రముఖులు, నటులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, కీడాకారులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు. తాజాగా మయన్మార్ మిస్ యూనివర్స్ పోటీదారు తుజార్ వింట్ ఎల్విన్ ఆదివారం పోటీలో మాట్లాడుతూ.. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు. "మయన్మార్‌లో జరిగే హింస గురించి మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి దీనిపై స్పందిస్తున్నాను. మా ప్రజలు ప్రతిరోజూ మిలిటరీ దళాల కాల్పుల్లో చనిపోతున్నారు" అంటూ ఆమె బావోద్వేగానికి గురయ్యారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ & క్యాసినోలో జరిగిన ఫైనల్స్‌లో ఆమె కనిపించారు. కాగా తుజార్ వింట్ ఎల్విన్ మిస్ యూనివర్స్ పోటీ చివరి రౌండ్లో పాల్గొనలేదు. కానీ ఆమె ధరించిన ఆ దేశ జాతీయ దుస్తులకు గాను "బెస్ట్ నేషనల్ అవార్డ్"ను గెలుచుకుంది. ఆమె ఆ దుస్తులతో కవాతు చేస్తూ "మయన్మార్ కోసం ప్రార్థించండి" అనే ఒక ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు 790 మంది భద్రతా దళాల కాల్లుల్లో మరణించగా.. 5,000 మందిని అరెస్టు చేసినట్లు, 4,000 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల కార్యకర్త బృందం తెలిపింది. (చదవండి: Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి) -
‘వాటర్ ఫెస్టివల్’ లో 285మంది మృతి
-
‘వాటర్ ఫెస్టివల్’ లో 285మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో జరిగిన సంప్రదాయ వాటర్ ఫెస్టివల్లో 285 మంది మృతి చెందారు. నాలుగురోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మరో 1073మంది గాయపడ్డారు. మయన్మార్ కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ పేరు ‘థింగ్యాన్’. బౌద్ధ మతంను అనుసరిస్తూ ఈ ఫెస్టివల్ ను జరుపుతారు. గత ఏడాది చేసిన పాపాలు ఈ ఏడాది నూతన సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనేది మయన్మార్ ప్రజలు విశ్వసిస్తారు. రోడ్డు మీద వెళ్లే వారిపై లీటర్లకు లీటర్లు నీళ్లను కొడుతూ అక్కడి ప్రజలు ఈ వేడుకను ఘనంగా ముగించారు. కాగా గత సంవత్సరం జరిగిన ఈ ఫెస్టివల్ సందర్భంగా 272 మంది చనిపోతే 1086మంది గాయపడ్డారు. అంటే ఈసారి మృతుల సంఖ్య 13 ఎక్కువ. ఈ సందర్భంగా 1200 క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 44 మంది వరకు మొత్తం 285 మంది చనిపోయారు. క్రిమినల్ కేసుల్లో హత్య, కారు యాక్సిడెంట్లు, డ్రగ్స్ వాడకం, దొంగతనాలు, హింస, ఆయుధాలు కలిగి ఉండడం వంటివి ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. -
ప్రమాదంలో పెళ్లిబృందం జలసమాధి
యాంగూన్: పశ్చిమ మయన్నార్‌లో పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ ఓ భారీ ఓడను ఢీకొనడంతో పడవలోని 20 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 30 మందిని రక్షించామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. వివాహ వేడుకను ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పడవలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు.