breaking news
yaduveer wadiyar
-
మైసూరు మహారాజు వడయార్ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు. -
400 ఏళ్ల తర్వాత శాప విముక్తి..!
-
ఆ అకౌంట్ నా భార్యది కాదు: యదువీర్
బెంగళూరు: మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ కుటుంబం కూడా ఫేక్ అకౌంట్ల బారిన పడింది. తన భార్య త్రిషికా ఒడియార్ పేరులో ఫేక్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను ఎవరో క్రియేట్ చేశారని ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆ ఖాతా తన భార్యది కాదని యదువీర్ స్పష్టం చేశారు. కాగా త్రిషికా ఒడియార్ పేరుతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో త్రిషికా ఒడియార్ 246 అనే పేరుతో ఓ ఖాతాను తెరవడంతో పాటుగా త్రిషికా ఫోటోను కూడా పెట్టడం జరిగింది. దీనిపై యదువీర్ మాట్లాడుతూ త్రిషికా ఒడియార్ 246 అనే పేరుతో తాను కానీ, తన భార్యా కానీ అకౌంట్‌ను ఓపెన్ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ ఖాతాలో పెట్టిన ఫోటోలతో కానీ, వ్యాఖ్యలతో కానీ తమకు సంబంధం లేదని తెలిపారు. ఆ నకిలీ ఖాతాను ఎవరు, ఎందుకు క్రియోట్ చేశారో తెలియదని, తక్షణమే ఆ ఫోటోను తొలగించాలని యదువీర్ కోరారు.