breaking news
Xiaomi Redmi 4A
-
రెడ్ మి 4ఏ సంచలనం
న్యూఢిల్లీ : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమి తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. భారత్ లో తొలి విడతగా గురువారం ప్రవేశపెట్టిన ఈ ఫోన్ అమ్మకాలు నిమిషాల వ్యవధిలోనే పూర్తయ్యాయి. అమెజాన్, ఎంఐ డాట్ కామ్ లో నాలుగు నిమిషాల్లో రెండున్నర లక్షలు ఫైగా ఫోన్లు అమ్ముడుపోయాయి. తమ వెబ్ సైట్ లో 10 లక్షలకుపైగా ‘నోటిఫై మీ’ అలర్ట్స్ వచ్చాయని అమెజాన్ ఇండియా వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమైన వెంటనే తమ వెబ్ సైట్ కు నిమిషానికి 50 లక్షల హిట్స్, సెకను 1500పైగా ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన తమపై బాధ్యత మరింత పెంచిందని, ఈ విభాగంపై దృష్టి సారిస్తామని అమెజాన్ ఇండియా ప్రతినిధి నూర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం పట్ల షియోమి ఇండియా ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ధరలో ఇదే మోస్ట్ ఎఫోర్డ్ బుల్ స్మార్ట్ ఫోన్ అని తెలిపారు. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది. -
ఆ ఫోన్ కొంటే 28జీబీ 4జీ డేటా
చైనీస్ కంపెనీ షియోమి తాజాగా భారత్ లో లాంచ్ చేసిన రెడ్ మి 4ఏ కొనుగోలు చేసిన వారికి కంపెనీ లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. ఈ మొబైల్ కొన్న ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ డేటాను కంపెనీ తెలిపింది. మి.కామ్, అమెజాన్ రెండు ఆన్ లైన్ ప్లేస్ లో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్ మి 4ఏను అధికారికంగా లాంచ్ చేసిన వెంటనే ఐడియా కస్టమర్ల కోసం కంపెనీ ఈ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసి రూ.343 లతో రీఛార్జ్ ప్యాక్ వేసుకుంటేనే ఈ 28జీబీని పొందుతారని కంపెనీ పేర్కొంది. మరోవైపు ఈ ఆఫర్లన్నీ కూడా అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేసి వారికే వర్తించనున్నాయి. అమెజాన్ ఇండియాలో రెడ్ మి4ఏ ను కొనుగోలు చేసిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ 4జీ డేటాను రూ.343 ప్యాక్ తో అందించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా వాడుకోవచ్చని పేర్కొంది. దాంతో పాటు రెడ్ మి4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ లను పొందనున్నారని షియోమి వెల్లడించింది. ఈ రీచార్జ్ ప్యాక్ కేవలం 28 రోజుల వరకే ఉండనుంది. 28 రోజుల తర్వాత కూడా రూ343 ప్యాక్ పై ఈ ఆఫర్లనే పొందవచ్చు. ఈ 2017 జూన్ 30 తర్వాత ఈ ప్యాక్ గడువు ముగుస్తుంది. రెడ్ మి 4ఏ గురువారం నుంచి మి.కామ్, అమెజాన్ ఇండియాల్లో విక్రయానికి రానుంది. దీనిధర రూ.5,999. ఆఫ్ లైన్ ద్వారా ఇది అందుబాటులో ఉండదు. మి.కామ్ లో కొనుగోలుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.