breaking news
wrong phone call
-
కొంప ముంచిన రాంగ్‌కాల్..!
జోగిపేట: ఫోన్లో పరిచయం స్నేహంగా మారింది. ఆపై ప్రేమకు దారితీసింది. ఆరు నెలలపాటు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై ప్రేమికురాలి వద్ద నుంచి రూ.4.25 లక్షలు తీసుకుని ఉడాయించాడా ప్రేమికుడు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా జోగిపేటలో వెలుగు చూసింది. ఆరు నెలల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్ గ్రామానికి చెందిన ఏఎన్ఎం శ్రీలత ఫోన్‌కు రాంగ్‌కాల్ వచ్చింది. దీంతో ఆమె ‘రాంగ్‌కాల్’ అంటూ పెట్టేసింది. అతను మళ్లీ.. మళ్లీ కాల్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహం వరకు వెళ్లింది. తనను తాను కిశోర్‌బాబుగా పరిచయం చేసుకున్న అతను, తనది విజయవాడ అనీ.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సొంతిల్లు ఉందని చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆరు నెలలుగా ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తాను ప్లాట్ కొంటున్నానని.. రూ. 35 వేలు తక్కువగా ఉన్నాయని.. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని ఒత్తిడి పెంచాడు. జోగిపేట ఎస్బీఐలో డబ్బు డ్రా చేసేందుకు మంగళవారం ఉదయం ఇద్దరూ కలిసి వెళ్లారు. తన ఖాతానుంచి శ్రీలత రూ.35 వేలు డ్రా చేసి ఇచ్చింది. అదే సమయంలో శ్రీలత ఖాతాలో మరో రూ.3.90 లక్షల వరకు నగదు ఉన్నట్టు గమనించిన అతడు.. అంతలోనే కుట్ర పన్నాడు. ఇంత డబ్బు ఉద్యోగి ఖాతాలో ఉండకూడదని, సంవత్సరం చివర కావడంతో ఇన్‌కంటాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాడు. ఆమెతో రూ.3.90 లక్షలు డ్రా చేయించాడు. మధ్యాహ్నం వరకు బ్యాంకులోనే ఉండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న వెంకటేశ్వర సినిమా థియేటర్లోకి సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలోనే బ్యాగులో ఉన్న డబ్బును ఆమెకు తెలియకుండా (రూ.3.90 లక్షలు) కాజేసీ, తనకు ఫోన్ వస్తుందని మాట్లాడి వస్తానంటూ బయటకు వెళ్లిపోయాడు. 15 నిమిషాల వరకు అతను రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తన బ్యాగును చూసుకుంది. అందులో డబ్బులు లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది. బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీనిపై బుధవారం జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బ్యాంకులోని వీడియో ఫుటేజీలను పరిశీలించారు. కాగా, అతని సెల్ నంబర్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, శ్రీనివాసరావు పేరు మీద ఉన్నట్లు ఎస్ఐ విజయ్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కిశోర్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రాంగ్ కాల్‌తో నయవంచన
సెల్‌ఫోన్ రాంగ్ కాల్‌తో ఓ బాలికకు పరిచమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమ పేరుతో ఆ బాలికను ఏ మార్చారు. రాత్రికి రాత్రే ఆ బాలికను మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ ఆరు నెలలుగా నిర్భందించాడు. అతడు, స్నేహితులు ఐదుగురు కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు గూడూరు రూరల్ మండలం చెన్నూరు బీసీ కాలనీకి చెందిన బాలిక (16)కు రాంగ్ కాల్ ద్వా రా మదనపల్లి సమీపలోని ఎగువ కమ్మపల్లికి చెందిన హరిప్రసాద్‌నాయుడుతో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. హరిప్రసాద్‌నాయుడు ప్రేమిస్తున్నానంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తనతో వచ్చేయాలని చెప్పా డు. దీనికి ఆకర్షితురాలైన ఆ బాలిక అందుకు ఒప్పుకుంది. దీంతో హరిప్రసాద్‌నాయుడు తన స్నేహితులు దయాళ ఆంజనేయుడు అలియాస్ అంజి, పుట్టా రామచంద్రనాయుడు, రామరెడ్డయ్యనాయుడు, సురేంద్రనాయక్‌తో కలిసి గతేడాది ఆగస్టు 9వ తేదీన వాహనంలో చెన్నూరుకు వచ్చా రు. రాత్రి భోజనాలు చేశాక, కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించాక ఆ బాలిక వారి తో కలిసి మదనపల్లికి వెళ్లిపోయింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి కుమార్తె ఇంట్లో కనిపించకపోవడంతో ఎక్కడకు వెళ్లిందోనని బంధువుల గ్రామాలకు వెళ్లి విచారించారు. ఎక్కడా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో గతేడాది డిసెంబర్ 26న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ఆ బాలికను తీసుకెళ్లిన హరిప్రసాద్‌నాయుడు, అతని స్నేహితులు మదనపల్లి సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉ న్న పొలాల్లో పాడుబడిన ఇంట్లో నిర్బంధించారు. హరిప్రసాద్‌నాయుడు తో పాటు అతని స్నేహితులు అంజినాయుడు, రామచంద్రనాయుడు, శ్రీరాములరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్ నిత్యం ఆ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన అదే గ్రామానికి చెందిన మునిస్వామినాయక్ పోలీసులకు చెప్పేస్తానంటూ వారిని బ్లాక్మెయిల్ చేసి వారి తో పాటు అతను కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే వారు తరచూ మకాంను మారుస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారు పూటుగా మద్యం సేవించి ఉండగా ఆ బాలిక వారి సెల్‌ఫోన్ నుంచి తన సోదరి సెల్‌కు కాల్ చేసి తను నిర్బంధానికి గురైనట్లు చెప్పింది. దీంతో బాధితులు ఆ సెల్‌ఫోన్ నంబరును గూడూరు రూరల్ పోలీసులకు అందజేశారు. పోలీసులు కాల్‌లిస్టు ఆధారంగా ఆ ఫోన్ నంబరు మదనపల్లి ప్రాంతానికి చెందిందని గుర్తించారు. ఈ మేరకు ఎస్సై ఎస్కే మహ్మద్ హనీఫ్, హెడ్ కానిస్టేబుల్ తిరుపాలయ్య, కానిస్టేబుళ్లు పీఎం రాజ, నాగరాజు, బాలిక సోదరుడుని వెంట బెట్టుకుని మదనపల్లిలోని రామారావుకాలనీకి చెందిన ఓరుగంటి సునీల్ ఇంట్లో ఉన్న నిందితులను అదుపులోలకి తీసుకున్నారు. నిర్భయ కేసు నమోదు బాలికను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన హరిప్రసాద్‌నాయుడు, అంజినాయుడు, రాంచంద్రనాయుడు, శ్రీరామరెడ్డయ్య నాయుడు, సురేంద్రనాయక్‌తో పాటు మునుస్వామనాయక్‌పై నిర్భయ కేసును నమోదు చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు.