breaking news
world cup quarters
-
జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ కొత్త చరిత్ర
దోహా: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు చైనా దూరమైంది. ఆసియా జోన్ అర్హత పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో చైనా 0–1 గోల్స్ తేడాతో ఇండోనేసియా చేతిలో పరాజయం పాలవడంతో... వరల్డ్‌కప్ రేసుకు దూరమైంది. ఇక ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించగా... క్వాలిఫయింగ్ పోటీల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన దక్షిణ కొరియా కూడా ముందంజ వేసింది.2026లో అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్‌నకు ఇప్పటికి 10 జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో ఈ మూడు దేశాలు నేరుగా ముందంజ వేయగా... ఆసియా నుంచి జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్... ఓసియానియా నుంచి న్యూజిలాండ్... దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా వరల్డ్‌కప్ బెర్తులు దక్కించుకున్నాయి. ఆసియా క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా... గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 1–0తో జపాన్‌పై, ఇండోనేసియా 1–0తో చైనాపై, జోర్డాన్ 3–0తో ఒమన్‌పై, సౌదీ అరేబియా 2–0తో బహ్రెయిన్‌పై, పాలస్తీనా 2–0తో కువైట్‌పై, ఖతార్ 1–0తో ఇరాన్‌పై విజయాలు సాధించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఉజ్బెకిస్తాన్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’ కాగా... ఉత్తర కొరియా, కిర్గిస్తాన్ పోరు 2–2 గోల్స్‌తో సమమైంది. దక్షిణ కొరియా 2–0తో ఇరాక్‌పై గెలవడం ద్వారా వరుసగా 11వసారి వరల్డ్ కప్ బెర్త్ దక్కించుకుంది. యూఏఈ మ్యాచ్ ‘డ్రా’ అయినా... గ్రూప్ ‘ఎ’లో ఇరాన్ తర్వాత రెండో స్థానంలో నిలవడం ద్వారా ఉజ్బెకిస్తాన్ ముందంజ వేసింది. గ్రూప్ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, జోర్డాన్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘సి’ నుంచి పోటీపడుతున్న చైనా... ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 7 పరాజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకొని చివరి స్థానంలో కొనసాగుతోంది. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... జపాన్ (20 పాయింట్లు), ఆస్ట్రేలియా (16 పాయింట్లు), సౌదీ అరేబియా (13 పాయింట్లు), ఇండోనేసియా (12 పాయింట్లు), బహ్రెయిన్ (6 పాయింట్లు)... చైనా కంటే ముందున్నాయి. 2022లో జరిగిన ప్రపంచకప్‌లో ఆసియా నుంచి 4 జట్లు మాత్రమే పాల్గొనగా... ఈసారి 8 జట్లు బరిలోకి దిగడం ఖాయమైంది. ఆఫ్రికా నుంచి 9 జట్లు, యూరప్ నుంచి 16 జట్లు వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పోటీపడుతున్నాయి.2026 ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి వరకు అర్హత సాధించిన జట్లుఆతిథ్య దేశాలు: అమెరికా, మెక్సికో, కెనడా. ఆసియా: జపాన్, ఇరాన్, జోర్డాన్, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్. ఒసియానియా: న్యూజిలాండ్. దక్షిణ అమెరికా: అర్జెంటీనా. -
బంగ్లాదేశ్ సంచలనం
పాక్‌పై వన్డే సిరీస్ కైవసం తమీమ్ ఇక్బాల్ సెంచరీ ఢాకా: ఇకపై వన్డేల్లో బంగ్లాదేశ్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరిన బంగ్లా టైగర్స్... తాజాగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్తాన్‌ను చిత్తు చేశారు. షేరే బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. తద్వారా తొలిసారి పాక్‌పై 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 239 పరుగులు మాత్రమే చేసింది. ఒక దశలో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను సాద్ న సీమ్ (96 బంతుల్లో 77 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నాడు. హారిస్ సోహైల్ (44) రాణించగా... చివర్లో వహబ్ రియాజ్ (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. బంగ్లా బౌలర్లంతా సమష్టిగా రాణించగా... షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి. బంగ్లాదేశ్ జట్టు 38.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (116 బంతుల్లో 116 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీ చేయగా... ముష్ఫికర్ రహీమ్ (70 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీతో రాణించడమే కాకుండా మూడో వికెట్‌కు తమీమ్‌తో కలిసి 118 పరుగులు జోడించాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, రాహత్ అలీ, సయీద్ అజ్మల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈనెల 22న జరుగుతుంది.