breaking news
of the World
-
భౌగోళిక అద్భుతం నయాగరా...
విదేశాలలో! ప్రపంచంలోనే భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది. 167 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కొండపై నుంచి కిందికి పడుతుండే దశ్యం మనోహరం. న్యూయార్క్ రాష్ర్టంలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను చేసింది. ఒకే సమయం లో కెనడా, అమెరికా దేశాల ప్రజలు, టూరిస్టులు సందర్శించేందుకు భారీ ఏర్పాట్లున్నాయి. కెనడాలోని హార్షూ జలపాతం, నయాగరా జలపాతం పక్క పక్కనే ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో హార్షూ జలపాతం కంటె నయాగరానే పెద్దది. నయాగర జలపాతాన్ని అతి సమీపం నుంచి పడవలోనూ, సొరంగమార్గం ద్వారా సందర్శించవచ్చు. పడవలో 17 డాలర్లు, సొరంగమార్గంలో వెళ్లేందుకు 12 డాలర్లు చెల్లించాలి. నయాగరాను సందర్శించేందుకు మెయిడ్ మిస్త్ నుంచి కిందికి లిఫ్ట్‌లో వెళ్లాలి. పడవలోకి వెళ్లే ముందు సందర్శకులకు రెయిన్‌కోట్ ఇస్తారు. పడవ కెనడాలోని హార్స్‌షూ జలపాతం దగ్గరగా వెళుతుంది. అ సమయంలో పై నుంచి దుముకుతున్న జలపాతాన్ని అతి సమీపం నుంచి తిలకించడం జీవితంలో మరపురాని అనుభూతిగా మిగులుతుంది. అక్కడ నుంచి పడవ నయాగరా జలపాతం వైపు మళ్లుతుంది. అక్కడ సాయంత్రం సూర్యకిరణాలు పడడం వల్ల ఇంధ్రదనుస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు ఎర్ర రంగు రెయిన్‌కోట్, అమెరికా వైపు నుంచి వచ్చే వారికి నీలిరంగు రెయిన్‌కోట్ ఇస్తారు. అమెరికా సరిహద్దు నుంచి కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, ఇతర దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నయాగరా జలపాతం అడుగు భాగానికి చేరుకునేందుకు కొండ ను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగర నది పై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్లాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారిపడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు. ఆ మార్గం దాటి వెళ్లే దారిలో తెల్లని పక్షులు స్వాగతం పలుకుతాయి. పక్షులను దాటి మెట్ల మార్గం ద్వారా నది సమీపంలోకి వెళ్లి, అక్కడ నుంచి జలపాతం పడుతున్న ప్రాంతాన్ని అతి సమీపం నుంచి చూడవచ్చు. రాత్రి పూట జలపాతం నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో తిలకించవచ్చు. - జి.గంగాధర్ -
భారత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి బంజారాహిల్స్ : భిన్న మతాలకు నెలవైన భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచదేశాలు అన్ని మతాలను గౌరవిస్తూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్, అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, వరల్డ్ అలిబేట్ అసెంబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అవెటైడ్ సేవియర్ ఇన్ వేరియస్ రిలీజియన్స్ అండ్ ఔట్లుక్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్’ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న మతాలపై అవగాహన) అన్న అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల్లో మతం పేరిట జరుగుతున్న హింసలో బలవుతున్నది సామాన్యులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ కాన్సులేట్ జనరల్ హసన్ నౌరీన్ మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ మతాలలోని మంచితనాన్ని గ్రహించి మానవాళి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. విశ్వవ్యాప్తంగా భిన్నమైన మతాలు, జాతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నాయని, వీట న్నింటి సారం ఒక్కటేనని పేర్కొన్నారు. పరస్పరం ఘర్షణ పడటం మాని విశ్వశాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెన్రీ మార్టిన్ ఇనిస్టిట్యూట్ పాదర్ పీటీ శామ్యుల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.