breaking news
wonder boy
-
తొమ్మిదేళ్లకే పెట్టుబడులు పెట్టేస్తున్నాడు!
నిజమైన అభ్యాసం అంటే పరీక్షలు రాసి గ్రేడ్లు సాధించడం కాదు.. జీవితాన్ని కనుగొనడం, సృష్టించడం అని తొమ్మిదేళ్లకే అర్థం చేసుకున్నాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వేదార్థ్. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తరగతి గది గోడలుగా మార్చుకున్నాడు. ప్రతి క్షణాన్ని ఏదో అన్వేషించడానికి, సృష్టించడానికి.. తద్వారా ఉన్నతస్థాయికి ఎదగడానికే వినియోగిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 100కి పైగా పుస్తకాలు చదివాడు. రోబోటిక్స్, ఎల్ఈజీవో నిర్మాణం వంటి అంశాలపై వర్క్ షాపులకు వెళుతుంటాడు. ఏ సవాల్‌నైనా ఉత్సాహంతో ఎదుర్కొంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని జీవితంలో ఎలా వినియోగించుకోవాలా అని ఆలోచించడం.. అతడి నిత్యకృత్యంగా మారిపోయింది.విద్యాభ్యాసాన్ని సరికొత్తగా పునర్ నిర్వచించుకున్న వేదార్థ్ (Vedarth) అక్కడితో ఆగిపోలేదు. సొంతగా కప్‌కేక్స్ తయారు చేసి విక్రయిస్తుంటాడు. చాక్లెట్ స్టాల్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ సొమ్మును సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు అతడు రూ.10 వేల వరకు పొదుపు చేశాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడిగా వేదార్థ్ గుర్తింపు పొందాడు.తల్లే తొలి గురువు... వేదార్థ్ తల్లి విశ్రుతి తన తొలి గురువు. ఆమె వేదార్థ్ జీవితానికి నిజంగా కావాల్సింది ఏమిటో ఓనమాల నుంచే నూరిపోశారు. స్కూల్లో బట్టీ పట్టడం ద్వారా వచ్చిన జ్ఞానం తన జీవితంలో పెద్దగా ఉపయోగపడలేదని గ్రహించిన విశ్రుతి.. తన కొడుకుకు ఉత్సుకత, వాస్తవ ప్రపంచ అనుభవంతో నిండిన బాల్యాన్ని అందించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో అన్ స్కూలింగ్ అని పిలిచే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.చదవండి: హీరోయిన్ హోటల్ ముందు క్యూ కట్టిన జనం అన్ స్కూలింగ్ (unschooling) విధానంలో నిర్ణీత పాఠ్యాంశాలు, షెడ్యూల్ లేదా పరీక్షల వంటివి ఉండవు. ఇక్కడ కేవలం ఆసక్తి ఆధారిత అభ్యాస విధానం, విద్య సహజమైన ఉత్సుకత, స్వీయ–నిర్దేశిత అన్వేషణ ఆధారంగా సాగుతుంది. ఇందులో భాగంగా విశ్రుతి డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో వేదార్థ్ తల్లి ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమవుతున్నాడు. వేదార్థ్.. నువ్వు వెరీవెరీ స్పెషల్..– గౌతమి గిద్దిగాని, సాక్షి సెంట్రల్ డెస్క్ -
అతను చెప్పినట్లే జరుగుతోందా?
-
కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?
కరోనా మహహ్మారి గురించి ఏడు నెలల క్రితమే ఓ బాల మేధావి అలర్ట్ చేశాడా? ఇప్పుడు అతను చెప్పినట్లే జరుగుతోందా? మార్చి 29 నుంచి చాలా క్లిష్టపరిస్థితులు అని బాల సన్యాసి చెప్పినట్లే.. ఆ రోజు నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయా? మరిప్పుడు అతను చెప్పినట్లే ఏప్రిల్ మొదటి వారం మరింత కీలకం కానుందా? అసలు ఆ బాల సన్యాసి ఏం చెప్పాడు? ఏం జరగబోతోంది? బెంగుళూరు: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు కకావికలం అవుతున్నాయి. కోవిడ్-19 ను నిరోధించే మందు లేకపోవడంతో.. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ దిశగా కొన్ని దేశాలు ముందుగానే మేల్కొంటే.. మరికొన్ని దేశాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నాయి. కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తుండగా.. వైరస్ వ్యాప్తిపై రకరకాల కథనాలైతే ప్రచారంలోకి వస్తున్నాయి. కోరంకి జబ్బు పుట్టుకొచ్చి లక్షలాది మందిని కబళిస్తుందని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఎప్పుడో చెప్పారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. (చదవండి: కరోనా: చూయింగ్ గమ్, గుట్కా, పాన్లపై నిషేధం) ఈశాన్యంబున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ కోరంకి అను జబ్బు కోటిమందికి తగిలి కోడిలాగ తూగి సచ్చేరయ అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని.. ఇప్పుడదే జరుగుతోందని విస్తృతంగా ప్రచారం సాగింది. తాజాగా మరో ప్రచారం జోరందుకుంది. 2020లో కరోనా వైరస్ వస్తుందని ముందుగానే ఓ బాలమేధావి చెప్పినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆనాడు బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతున్నట్టే... నేడు మైసూరుకు చెందిన బాల మేధావి అభిజ్ఞా ఆనంద్ చెప్పిందే జరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా మిగతా అన్ని విషయాలు ఆ బాల మేధావి చెప్పినట్టుగానే జరుగుతుండడంతో అభిజ్ఞ ప్రిడిక్షన్ మీద ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. ఇంతకూ అతను ఏం చెప్పాడో.. ఈ వీడియో చూసి తెలుసుకోండి!! (చదవండి: సోషల్ మీడియా, ఫేక్ వీడియోల మాయలో పడకండి!) -
ఆ పసికూన.. పిడుగే!
లండన్: కేవలం నాలుగేళ్ల పసిప్రాయంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో సరితూగగల మేధస్సును సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు లండన్‌లోని ఓ పసి పిడుగు!!. ఇంత పిన్న వయసులోనే 190 పుస్తకాలను ఔపోసన పట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. లండన్‌లోని దక్షిణ యార్క్‌షైర్‌లో ఉన్న బాన్స్లే ప్రాంతానికి చెందిన షెర్విన్ సరాబి వయసు కేవలం నాలుగేళ్లు. ఇంత చిన్న వయసుకే ఆ బాలుడు 160 పాయింట్ల మేధాశక్తిని సొంతం చేసుకున్నాడు. ఇది ఐన్‌స్టీన్ సహా బిల్‌గేట్స్, స్టీఫెన్ హాకింగ్‌ల మేధాశక్తికి సరిసమానమని నిర్వాహకులు వెల్లడించారు. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డాక్టర్ పీటర్ కాంగ్డన్ మాట్లాడుతూ, షెర్విన్ మేధాశక్తి అపూర్వం, నమ్మశక్యం కానిది, బాగా ఎదిగిన పిల్లల్లాగా మాట్లాడుతున్నాడు, సామాజిక స్పృహ కూడా ఎక్కువగానే ఉంది అన్నా రు. సాధారణంగా నాలుగేళ్ల చిన్నారులు పాఠశాల ముఖం చూసివుండరు. అయితే, షెర్విన్ మాత్రం ఈ వయసుకే రాస్ట్రిక్ ఇండిపెండెంట్ స్కూల్లో చేరి 8, 9 తరగతుల విద్యార్థుల స్థాయిని అందుకున్నాడన్నారు. షెర్విన్ మానసిక వయసును 8 ఏళ్ల 9 మాసాలుగా నిర్ధారించినట్టు చెప్పారు. ప్రస్తుతం గిన్నిస్ క్లబ్ మెంబర్‌గా కూడా ఉన్న షెర్విన్ ఇప్పటికి 190 పుస్తకాలు చదివినట్టు బాలుడి తల్లి అమందా తెలిపారు. 10 నెలల బిడ్డగా ఉన్నప్పుడే చిన్నచిన్న పదాలు పలకడం ప్రారంభించాడన్నారు.


