breaking news
women riders
-
బైక్ రైడర్స్ బైక్స్ ఆన్..
వేగంలో గాలితో పోటీపడుతూ సాహసమే ఊపిరిగా, స్వేచ్ఛే లక్ష్యంగా... రయ్‌మంటూ దూసుకెళ్తూ... తమ కలలకు హద్దులు లేవని చాటిచెబుతున్నారు మహిళా బైక్ రైడర్స్. బైక్ రైడింగ్‌ను కేవలం అభిరుచిగానే కాకుండా, ఉపాధిగానూ, సాహసంగానూ తమ జీవితంలో ఓ భాగంగా మార్చుకున్నారు. ఆత్మవిశ్వాసమే తోడుగా ముందుకు సాగుతూ నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లో ‘షీ పవర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న రైడర్స్ చెప్పిన విషయాలివి...మహిళా సాధికారతకుచిన్న వయస్సునుంచే బైక్ నడపాలని కోరిక ఉండేది. అందుకు మా నాన్న కూడా సపోర్ట్ చేశారు. ఆ తరువాత ఉమెన్ బైక్ రైడర్లను చూశాను. వారిలో కొందరు సోలో బ్రైక్ ట్రావెలర్స్ కూడాను కలిశాను. వారి నుంచి నేను స్ఫూర్తి పొంది, అయిదేళ్లుగా బైక్ రైడింగ్ చేస్తున్నా. నేను అన్ని రకాల బైక్‌లు నడపగలను. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎక్కడ బైక్ ర్యాలీలు జరిగినా వాటిలో పాల్గొంటున్నాను. నేను ఎలాగైతే స్ఫూర్తి పొందానో. అలాగే మరికొందరు తమ శక్తి ఏంటో తెలుసుకోవడం కూడా స్ఫూర్తిగా నిలవాలనుకున్నాను. ఈ రోజుల్లో కూడా మహిళలు బైక్‌లు నడుపుతున్నారంటే.. ‘అవసరమా’ అన్నట్టు చూస్తూ వెళ్లేవారిని గమనిస్తుంటాం. మహిళలు తమ శక్తి ఏంటో తెలియాలంటే పోరాటం ఉండే రంగాలలోకి రావాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. – దీప, ఉమన్ బైకర్ప్యాషన్తో మొదలుపెట్టి...మహిళలు పెళ్లి అవగానే ఇంటిపనులకే సమయమంతా కేటాయిస్తారు. తమ వ్యక్తిగత జీవితం మొత్తాన్నీ, శక్తినీ వదులుకుంటారు. వృత్తి, ద్యోగాలలో రాణిస్తున్నప్పటికీ చాలా మంది ఒంటరిగా ఏం చేయగలం.. అనుకుంటుంటారు. కానీ, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నాకున్న ఆసక్తులపై దృష్టి పెట్టాను. బైక్ రైడింగ్ అంటే ఉన్న ప్యాషన్‌పై దృష్టి పెట్టాను. అక్కడితో ఆగకుండా షీ మోటో ఉమెన్స్ రైడింగ్ క్లబ్ ఏర్పాటు చేశాను. తెలుగు రాష్ట్రాలలో మహిళలకు బైక్‌రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు, వారు స్వయంగా ఎదగడానికి కావల్సిన సూచనలతో ప్రోత్సహిస్తున్నాను.– వి.ఎం.లీనారెడ్డి, షీ మోటో ఉమెన్స్ రైడింగ్ క్లబ్ ఫౌండర్లూనాతో స్టార్ట్ చేసి బీటెక్ పూర్తి చేసి, ఓ టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. పెళ్లి, ఉద్యోగం.. ఎన్ని పనులున్నా మన శక్తిని పెంచే ఇష్టాలలోనూ రాణించాలి. నాకు పద్నాలుగేళ్ల వయసులో ఇంట్లో ఉండే లూనాతో మొదట ప్రాక్టీస్ చేశా. అప్పుడు ఏదో పెద్ద మిషన్‌ను నడుపుతున్న అనుభూతి కలిగేది. ఆ తరువాత 12 ఏళ్లుగా అన్నిరకాల బైక్‌లు నడుపుతున్నాను. తెలంగాణ బైక్ రైడింగ్ సీజన్–1లో పోడియం విన్నర్‌గా నిలిచాను. బెంగళూర్‌లో ట్రాక్ డ్రాగ్ రేస్ విన్నర్‌తో పాటు బైక్ రైడింగ్‌లో ఎన్నో అవార్డులను అందుకున్నాను. – సబా జబీన్, సాఫ్ట్వేర్ ఉద్యోగికంపెనీ స్టార్ట్ చేసే దిశకుపన్నెండేళ్ల వయసులో మా నాన్న బైక్ చూసి రైడింగ్ చేయాలన్న కోరిక కలిగింది. మా ఇంట్లో వాళ్లు వద్దన్నారు. కానీ, నాకున్న ఇష్టం వదిలేది కాదు. దీంతో మా నాన్న పడుకున్నాక బైక్ తీసేదాన్ని. ఇది చూసి, బైక్ నడపడానికి మా బ్రదర్ సపోర్ట్ ఇచ్చాడు. అలా బైక్ రైడింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కాలక్రమం లో ఆ బైక్ రైడింగ్ ఓ కంపెనీ స్టార్ట్ చేసే దిశగా నన్ను తీసుకెళ్లింది. బైక్ రైడింగ్‌లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చాను. ఇస్తున్నాను. అడ్డుకుంటున్నారనో, అబ్బాయిలు మాత్రమే చేసే పని అనో భయపడి ఆగిపోతే ఏదీ సాధించలేం. మన శక్తి ఏంటో చూపాలంటే సాహస రంగాలలోనే రాణించాలి. – నళిని, ఉమన్ బైకర్– ఎం.మహేందర్, సాక్షి -
Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా
తీరిక దొరికినప్పుడు ఏదో ఒక పుస్తకంలో మునిగిపోయి ఇల్లుదాటేది కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయన. ఈసారి చదివిన ఒక పుస్తకం ప్రభావం వల్ల ఇల్లే ప్రపంచం కాదని, ఇల్లు దాటితేగాని ప్రపంచం పరిచయం కాదనే విషయం అర్థమైంది. ‘ఎర్నెస్టో చే గువేరా మోటర్ సైకిల్ డైరీస్ పుస్తకం నన్ను మార్చేసింది. మిత్రుడితో కలిసి బైక్‌పై తొమ్మిది నెలల్లో వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు చే. కొండలు, కోనలు దాటుతూ ఒకే ప్రపంచంలో అనేక ప్రపంచాలు చూశారు ఇద్దరు. ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయాణం ఉపయోగపడుతుందనే వాస్తవం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను’ అంటున్న నయన ‘సీఆర్ఎఫ్’ తరపున మూడు రోజుల ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ యాత్రను విజయవంతంగా పూర్తిచేసింది. సీఆర్ఎఫ్ (కాలికట్ రైడర్స్ ఫ్యామిలీ)లో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన రైడర్స్ వేరే ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడి ‘సీఆర్ఎఫ్’ సభ్యులు ఆతిథ్యం ఇస్తుంటారు. ఒకరికొకరు పరిచయం అవుతుంటారు. ‘సీఆర్ఎఫ్’లో సభ్యులుగా గృహిణులు, విద్యార్థులు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉన్నారు. ‘సీఆర్ఎఫ్’ సభ్యురాలైన షామ్న మొదట్లో సరదాగా భర్త బైక్ తీసుకొని అక్కడక్కడే రైడ్ చేసేది ‘సీఆర్ఎఫ్’లో భాగం అయిన తరువాత ఆమె ప్రయాణ విస్తృతి పెరిగింది. ‘బైక్‌పై భర్త వెనక కూర్చొని వేరే ఊరికి పోవడం తప్ప, నేను సొంతంగా డ్రైవ్ చేస్తూ పరాయి ఊరు ఎప్పుడూ వెళ్లలేదు, దీనికి కారణం భయం. నాలోని భయాన్ని సీఆర్ఎఫ్ తొలగించి, ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది’ అంటుంది షామ్న. ‘మినీ కె టు కె’ గ్రూప్‌లోని పద్నాలుగు మందిలో షామ్న ఒకరు. ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ బైక్ రైడ్‌కు ‘మినీ కె టు కె’ అని పేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వారి భవిష్యత్ లక్ష్యం... కె టు కె. అంటే కన్యాకుమారి టు కశ్మీర్. ‘మినీ కె టు కె’ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పద్నాలుగు మంది బృందం భవిష్యత్ ‘కె టు కె’ లక్ష్యంపై దృష్టి పెట్టింది. ‘మినీ కె టు కె’లో జావా, బీఎండబ్యూ, కేటియం డూక్, రాయల్ ఎన్ఫీల్డ్, క్లాసిక్ అండ్ హిమాలయన్.. ఇలా సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో కంపెనీ బైక్‌లు వాడారు. రోడ్డుపై ఈ బైక్‌లు పరుగులు తీస్తుంటే...అదొక సుందరదృశ్యం. ‘జర్నీ ఈజ్ మై హోమ్’ అనే వాక్యాన్ని గుర్తు చేసే సందర్భం! చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! పాత వీడియో -
మహిళలకు ‘హెల్మెట్’తప్పనిసరి చేయాలి
నోయిడా: ఢిల్లీలో ద్విచక్రవాహనదారులకు(మహిళలకు) హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ ఇటీవల ఆ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ద్విచక్ర వాహనాన్ని నడిపే మహిళతోపాటు, వెనుక కూర్చున్న మహిళ కూడా హెల్మెట్ ధరించాల్సిందే. సిక్కు మహిళలకు మినహా మిగతా మహిళలకూ ఈ నిబంధన వర్తిస్తోంది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే జరిమానా విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది ఎంతో దోహదపడుతోంది. కానీ నోయిడాల్లో ఇలాంటి చట్టాలు లేవు. హెల్మెట్ లేకుండా వెళ్లే ద్విచక్ర వాహనదారులకు కనీసం (మహిళలకు) జరిమానా విధించడానికి కూడా ఇష్టపడడం లేదు. మహిళా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మహిళలకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ చేసిన చట్టం ఢిల్లీలో సత్ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడ కూడా అలాంటి చట్టాల్ని అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుకొంటున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే... హెల్మెట్ వాడడం తప్పనిసరి నోయిడా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఓ పబ్లికేషన్‌లో పనిచేస్తున్న అగ్రిమా సింగ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం మహిళా రైడర్స్‌కు హెల్మెట్ త ప్పని సరి చేయడంతో, అక్కడ హెల్మెట్ వినియోగం పెరిగింది. ఇంతకు ముందు హెల్మెట్ లేకుండానే వెళ్లేదాన్ని, ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పని సరి అని తెలుసుకొన్నానన్నారు. వాహనదారులకు మేలు ఎంఎన్సీలో పనిచేస్తున్న జగృతి గుప్తా మాట్లాడుతూ.. హెల్మెట్ వాడడటం ద్విచక్రవాహనదారులకు సురక్షితంగా ఉంటుంది. హెల్మ్‌ట్ తప్పని సరి చేయకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు..వికలాంగులుగా మారే ప్రమాదం ఉంది. నోయిడాలో కూడా హెల్మెట్ వాడడాన్ని తప్పని సరి చేయాలని అన్నారు. నోయిడాలో అమలు చేయాలి మరికొందరు మహిళలు మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలపై వెళ్లే మహిళలను నోయిడా ట్రాఫిక్ సిబ్బంది నియంత్రించడం లేదంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదన్నారు. నోయిడాలో డిల్లీ ట్రాఫిక్ నిబంధనలు ఇక్కడ అమలు చేయడం లేదని కాలేజీ విద్యార్థిని అంకితాసింగ్ అన్నారు. గతవారం ఢిల్లీలో ద్విచక్ర వాహనంపై వెళ్లే మహిళలు హెల్మెట్‌ను తప్పకుండా వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు మహిళలను మాత్రం మతప్రాదికన మినహాయించిందన్నారు. ఆదేశాలొస్తే.. ఇక్కడా అమలు చేస్తాం: ట్రాఫిక్ పోలీస్ అధికారి ట్రాఫిక్ పోలీసు అధికారి ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తీసుకొన్న నిర్ణయం కొత్తదేమీ కాదు. కానీ అక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నోయిడాలో అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదు. మాకు ఉన్నతాధికారుల నుంచి వస్తే ఇక్కడ కూడా అమలు చేయడానికి వెనుకాడబోమని అన్నారు.


