breaking news
woman commit to suicide
-
పెళ్లై ఏడాది కూడా కాకముందే వివాహిత ఆత్మహత్య
సాక్షి, పూసపాటిరేగ(విజయనగరం): మండల కేంద్రమైన పూసపాటిరేగలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే...శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం యాగాటిపేటకు చెందిన గుడబల్ల సోనియా (26)ని శ్రీకాకుళం జిల్లా బూర్జకు చెందిన మడపాన సుధీర్‌కు ఇచ్చి ఏడు నెలల కిందట వివాహం చేశారు. పూసపాటిరేగలోని రెడ్డీస్ ఫుడ్ క్యాంటీన్లో ఉద్యోగం నిమిత్తం భార్యతో కలిసి పూసపాటిరేగ సాలిపేటలో సుధీర్ నివాసం ఉంటున్నాడు. పది రోజులు కిందట కన్నవారి ఊరైన యాగాటిపేట వెళ్లిన సోనియా ఈ నెల 14న పూసపాటిరేగకు వచ్చింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తరుచూ అదనపు కట్నం కోసం అల్లుడు వేధించడం వల్లే తమ కుమార్తె తనువు చాలించిందని సోనియా తల్లిదండ్రులు పైడమ్మ, ఈశ్వరరావు, సోదరుడు కూర్మారావులు బోరున విలపించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. ఈమేరకు పూసపాటిరేగ ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డిన్నర్ @ఫ్లైట్.. ఈ ఫోటోలు చూస్తే మీకూ వెళ్లి తినాలనిపిస్తుంది.. -
మహిళ ఆత్మహత్యాయత్నం
శామీర్‌పేట్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిమహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్రానికి చెందిన రాజేశ్వరి (30), దయానంద్ దంపతులు మూడు నెలల క్రితం మండలంలోని అలియాబాద్‌కు వలస వచ్చారు. స్థానిక హెచ్‌బీఎల్ కంపెనీలో రోజువారి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, దయానంద్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనేపథ్యంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు చేపలు తీసుకువచ్చి వండమని రాజేశ్వరికి చెప్పాడు. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి దయానంద్ ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ఒటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించచుకుంది. విషయం గమనించిన స్థానికులు, కుటుంబీకులు మంటలు ఆర్పి ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.