breaking news
Willie
-
ఇంధన ధరల సెగ.. విమాన టికెట్ల ధరలు పెంచుతాం: ఇండిగో
సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విమాన టికెట్ల ధరలను పెంచక తప్పదని ఇండిగో సీఈఓ విల్లీ వాల్ష్ వెల్లడించారు. విమాన ఇంధన ధరల పెరుగుదల వల్ల కంపెనీపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన తెలిపారు.ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలను నమోదు చేసింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో సదరు కంపెనీ రూ.1,879 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్టు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఈ సంస్థ ఆదాయం 26 శాతం పెరిగి రూ.23,364 కోట్లకు చేరింది. అయితే ఇంధన వ్యయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 67 శాతం పెరగడంతో లాభదాయకతపై ప్రభావం పడింది.ఇప్పటికే పెరిగిన ఇంధన ఛార్జీలువిమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఇండిగో అక్టోబర్ 6 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఛార్జీలను పెంచింది. దేశీయ ప్రయాణాలకు దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు ఇంధన ఛార్జీలను వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు అంతర్జాతీయ మార్గాల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉన్నాయి. యూరప్ వెళ్లే విమానాలకు మాత్రం అత్యధికంగా రూ.10,000 ఛార్జీ విధిస్తోంది.సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండిగో ప్రయాణికుల సంఖ్య 4.5 శాతం తగ్గి 2.75 కోట్లకు చేరింది. దాంతో ఈ సంస్థ ఖర్చులను నియంత్రించేందుకు విమాన సర్వీసుల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది. డిసెంబర్ త్రైమాసికంలో సర్వీసు సామర్థ్యం స్వల్పంగా పెరుగుతుందని ఇండిగో అంచనా వేస్తోంది.పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా రానున్న రోజుల్లో ఇంధన ఖర్చులు అధికంగానే ఉండే అవకాశం ఉందని వాల్ష్ తెలిపారు. పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటూనే, అవసరమైతే టికెట్ ధరలను పెంచుతామని ఆయన సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడి భార్య ఘోర ఓటమి! -
ఇంగ్లండ్, శ్రీలంక వన్డే టై
నాటింగ్హమ్: ఆఖరి బంతికి ప్లంకెట్ సిక్సర్ కొట్టడంతో శ్రీలంకతో తొలి వన్డేను ఇంగ్లండ్ టై చేసుకోగలిగింది. మంగళవారం ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ డేనైట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి అంచుల నుంచి కోలుకుని టై చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (109 బంతుల్లో 73; 5 ఫోర్లు), ప్రసన్న (28 బంతుల్లో 59; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విల్లీ, ప్లంకెట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఒక దశలో 82 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును బట్లర్ (99 బంతుల్లో 93; 6 ఫోర్లు, 1 సిక్సర్), వోక్స్ (92 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. చివర్లో ప్లంకెట్ (11బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో పాటు ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ైటె చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ 24న జరుగుతుంది.


