breaking news
wifes dead body on shoulders
-
గుండెలు పిండేసే ఘటన..
బదౌన్: జబ్బుతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు. ఈలోపే ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి! మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లేదు.. ఆటోవాడూ రానన్నాడు.. చేసేదేమీలేక భార్య శవాన్ని భుజాలపై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాడు.. గుండెలు పిండేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది. బదౌన్ జిల్లా ఆస్పత్రి నుంచి భార్య మృతదేహంతో బాధితుడు వెళుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తామని బదౌన్ వైద్యాధికారి అన్నారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు రెండు వ్యాన్లు ఉన్నాయని తెలిపారు. అయితే బాధితుడు మాత్రం అక్కడ ఏర్పాట్లేవీ లేవని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
భార్య శవాన్ని భుజాలపై మోస్తూ..!
-
భార్య శవాన్నిమోస్తూ 10 కి.మీ: అసలు నిజం
భువనేశ్వర్: అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన 'భార్య శవాన్ని మోస్తూ 10 కిలోమీటర్ల నడక' ఉదంతంలో 'అసలు నిజం ఇదీ..' అంటూ ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక సమాధానం సంచలనంగా మారింది. కలహండి జిల్లాలో ఆగస్టులో చోటుచేసకున్న ఈ సంఘటనలో భార్య శవాన్ని మోసుకెళ్లిన దనా మాంఝి ఏ ఒక్కరినీ సహాయం అడగలేదని, చనిపోయినట్లు అధికారికంగా నిర్ధారించకముందే చెప్పాపెట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లాడని ప్రభుత్వం పేర్కొంది. (చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..) ఆసుపత్రిలోని ఇతర రోగులు, ప్రత్యక్ష సాక్షల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఒక రిపోర్టును తయారుచేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అతాను సబ్యసాచి ఆ రిపోర్టును శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు. మాంఝి వ్యవహారంపై ప్రభుత్వ స్పందన కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ కు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో.. దనా మాంఝి తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్లు ఆసుపత్రికి సిబ్బందికి చెప్పలేదని, ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానో లేక రెడ్ క్రాస్ నిధి ద్వారానో సహాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (నిర్దయ భారతం) మరణ ధృవీకరణ జరగకముందే, హడావిడిగా మాంఝీ తన భార్యను తీసుకెళ్లడం వల్లే ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కిందని, ఒకరు భుజాలపై శవాన్ని మోసుకెళుతున్నాడన్న సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపామని వైద్యాధికారి నివేదికలో తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్టాఫ్ నర్స్ రాజేంద్ర రాణాను డిస్మిస్ చేయగా, సెక్యూరిటీ సంస్థకు తాఖీదులిచ్చామని పేర్కొన్నారు. పేదరికంలో మగ్గిపోతున్న మాంఝి కుటుంబానికి పలు స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ప్రకటించాయి.