breaking news
white man
-
సిక్కు అమ్మాయిపై 'తెల్లోడి' పైత్యం
-
అమెరికాలో మరో విద్వేషం
న్యూయార్క్: అమెరికాలో జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సబ్వే రైలులో ప్రయాణిస్తున్న ఓ సిక్కు మహిళను శ్వేతజాతీయుడు దూషించిన ఘటన వెలుగుచూసింది. ఆమెను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళగా భావించి ‘ఈ దేశానికి చెందిన వ్యక్తివి కావు. లెబనాన్‌కి తిరిగి వెళ్లిపో..’ అంటూ ఆ దుండగుడు తీవ్రంగా దూషించాడు. ఈ ఘటనను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే ‘దిస్ వీక్ ఇన్ హేట్’లో ఆమె వివరించింది. స్నేహితురాలి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు రాజ్‌ప్రీత్ హైర్ అనే మహిళ మన్‌హట్టన్ వైపు వెళ్లే సబ్వే రైలు ఎక్కింది. ఆ సమయంలో రైలులోని ఓ శ్వేతజాతీయుడు ఆమెను దేశం విడిచి వెళ్లాలంటూ పెద్దగా కేకలు వేశాడు. పరుష పదజాలంతో తీవ్రంగా దూషించాడు. కాగా, తాను మధ్య ప్రాచ్యానికి చెందిన మహిళను కాదని, ఇండియానాలోని ఓ నగరంలో జన్మించినట్లు పేర్కొంది. అయితే ఆ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఆ దుండగుడు తనను దూషించి ఉండవచ్చని ఆమె పేర్కొంది. అనంతరం ఇద్దరు మహిళలు తనకు ధైర్యం చెప్పారని, మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొంది. ఇది మా దేశం... ఇక్కడే ఉంటాం వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా ఇండో–అమెరికన్లు గళమెత్తారు. ‘ఇది మా దేశం. ఇక్కడ నివసించడానికే వచ్చాం. ఈ దేశంలో మా న్యాయ, సమాన హక్కులను డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ టౌన్‌హాల్ సమావేశంలో దక్షిణాసియా అమెరికన్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) ప్రతినిధి సుమన్ రఘునాథన్ అన్నారు. ఇటీవల పెరిగిన విద్వేష దాడులకు వ్యతిరేకంగా యూదులు, ముస్లింలు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల్లో శాంతి నింపేందుకే ఈ ప్రయత్నమన్నారు. -
సిక్కు అమ్మాయిపై 'తెల్లోడి' పైత్యం
సిక్కు-అమెరికన్ అమ్మాయిపై ఓ శ్వేతజాతీయుడు తన జాతివిద్వేష పైత్యాన్ని వెళ్లగక్కాడు. ఆమెను చూసి మధ్యప్రాచ్యపు యువతిగా భావించిన అతడు.. 'నువ్వు ఈ దేశానికి చెందినదానికి కావు.. లెబనాన్ తిరిగి వెళ్లిపో' అంటూ కేకలు వేశాడు. దక్షిణాసియా వాసులపై అమెరికాలో విద్వేష నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల మ్యాన్‌హట్టన్‌లో ఈ ఘటన జరిగింది. తన స్నేహితురాలి పుట్టినరోజు వేడకకు వెళ్లేందుకు రాజ్‌ప్రీత్ హేర్ సబ్వే రైలులో బయలుదేరింది. రైలులో తాను తన ఫోన్ చూస్తుండగా ఓ శ్వేతజాతీయుడు తనవద్దకు వచ్చి అరవడం మొదలుపెట్టాడని, తనను ఉద్దేశించి పరుషమైన, తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించే 'దిస్ విక్ ఇన్ హేట్'లో ఆమె వివరించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్వేష నేరాలను ఈ కాలమ్ కింద న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది. -
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
-
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్వైజర్కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా? నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సూపర్వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్వైజర్కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో భారతీయులపై మళ్లీ దాడి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’