West Indies Masters
-
ఇంటర్నేషనల్ మాస్టర్స్ చాంపియన్ భారత్
రాయ్‌పూర్: ఇంటర్నేషనల్ మాస్ట్సర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత మాస్టర్స్ జట్టు ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ మాస్టర్స్‌పై విజయం సాధించింది. తొలిసారి నిర్వహించిన ఈ లీగ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సిమ్మన్స్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), డ్వైన్ స్మిత్ (35 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, నదీమ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ అంబటి తిరుపతి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించగా... కెపె్టన్ సచిన్ టెండూల్కర్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యువరాజ్ సింగ్ (13 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (14), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. -
ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్‌తో ఫైనల్లో వెస్టిండీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League)లో వెస్టిండీస్ ఫైనల్‌కు దూసుకువచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక మాస్టర్స్ (Sri Lanka Masters)ను చిత్తు చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్ (West Indies Masters)- శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్షాహిద్ వీర్ నారాయణన్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్.. వెస్టిండీస్ మాస్టర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లలో డ్వేన్ స్మిత్(0) విఫలం కాగా.. విలియం పెర్కిన్స్(24) ఫర్వాలేదనిపించాడు.రామ్‌దిన్ ధనాధన్వన్డౌన్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్(12 బంతుల్లో 17) వేగంగా ఆడగా.. కెప్టెన్ బ్రియన్ లారా దంచికొట్టాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో చాడ్విక్ వాల్టన్‌తో కలిసి దినేశ్ రామ్‌దిన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.వాల్టన్ 20 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించగా.. రామ్‌దిన్ మాత్రం 22 బంతుల్లోనే 50 రన్స్ సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, అసేల గుణరత్నె ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.గుణరత్నె ఒంటరిపోరాటం వృథాఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసింది. ఓపెనర్లలో ఉపుల్ తరంగ(30) రాణించగా.. కెప్టెన్ కుమార్ సంగక్కర(17), వన్‌డౌన్‌లో వచ్చిన లాహిరు తిరిమన్నె(9) పూర్తిగా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో అసేల గుణరత్నె ఒంటరిపోరాటం చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 66 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇసురు ఉడానా(10 బంతుల్లో 21), దిల్రువాన్ పెరీరా(6 బంతుల్లో 11) రాణించారు. కానీ విండీస్ బౌలర్ల విజృంభణ కారణంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 173 పరుగుల వద్ద నిలిచింది.ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది వెస్టిండీస్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టినో బెస్ట్ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్ స్మిత్ రెండు, ఆష్లే నర్స్, జెరోమ్ టేలర్, లెండిల్ సిమ్మన్స్ ఒక్కో వికెట్ తీశారు.ఇండియాతో ఫైనల్‌కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో మాస్టర్స్ లీగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఇందులో భాగమయ్యాయి. నవీ ముంబై, వడోదర, రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు.ఇక తొలి సెమీస్‌లో ఇండియా ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. రెండో సెమీ ఫైనల్లో విండీస్ లంకపై గెలుపొందింది. ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య ఆదివారం(మార్చి 16) నాటి ఫైనల్‌కు రాయ్‌పూర్ వేదిక. చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్ View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
ఉత్కంఠ పోరులో.. ఇంగ్లండ్ మాస్టర్స్‌పై విండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్‌ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్‌గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఈ క్రమంలో కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు. 171 పరుగులకు పరిమితంఅయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్‌తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది. టాప్‌లో ఇండియా మాస్టర్స్ఇక ఈ టీ20 లీగ్‌లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్‌పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్‌పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు!