breaking news
west godavar district tour
-
నవంబర్లో 'పశ్చిమ'కు వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. త్వరగా గ్రామ కమిటీలను పూర్తి చేయాలని వైఎస్ జగన్ సూచించారు. సమావేశం అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తామని అన్నారు. పామాయిల్ రైతులు గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్నారని, రైతుల సమస్యలపై జిల్లాలో పర్యటించాలని వైఎస్ జగన్ను కోరినట్లు ఆయన తెలిపారు. నవంబర్ మొదటి వారంలో వైఎస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. -
నవంబర్లో 'పశ్చిమ'కు వైఎస్ జగన్