breaking news
Weightlifter Venkat Rahul
-
‘టాప్’లో చోటు కోల్పోయిన రాహుల్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్–2020 లక్ష్యంగా ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ (85 కేజీలు) పేరును తొలగించారు. రాహుల్‌తోపాటు ఇతర వెయిట్‌లిఫ్టర్లు పూనమ్ యాదవ్ (69 కేజీలు), సతీశ్ శివలింగం (77 కేజీలు) పేర్లను కూడా ఈ జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఈ ముగ్గురూ గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. స్టార్ షూటర్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పేరును కూడా ఈ జాబితా నుంచి తప్పించారు. ఏడోసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న గగన్ ఈసారి రిక్తహస్తాలతో తిరిగి వచ్చాడు. ఇటీవలి ప్రదర్శన, ఫిట్నెస్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఆరుగురు షూటర్లను, ముగ్గురు వెయిట్లిఫ్టర్లను, ఇద్దరు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను ‘టాప్’ పథకం నుంచి తొలగించామని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒకే ఒక్కడు... 16 రికార్డులు
►వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ సంచలనం ►కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు ►రాహుల్ తమ్ముడు వరుణ్‌కు కూడా పసిడి పతకం గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): గతంలో జూనియర్‌స్థాయిలో కనబరిచిన ప్రదర్శనను సీనియర్స్థాయిలోనూ పునరావృతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ సంచలనం సృష్టించాడు. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ గుంటూరు జిల్లా లిఫ్టర్ ఒకే రోజు 16 రికార్డులను సవరించడం విశేషం. సీనియర్, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్ రెండు విభాగాల్లోనూ స్నాచ్‌లో 156 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీలతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రాహుల్ అర్హత సాధించాడు. స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తిన రాహుల్ సీనియర్ స్థాయిలో వికాస్ ఠాకూర్ (155 కేజీలు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి సీనియర్ స్థాయిలో తన పేరిటే (188 కేజీలు) ఉన్న రికార్డును సవరించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు ఎత్తిన రాహుల్ 341 కేజీలతో తన పేరిటే ఉన్న రికార్డును అధిగమించాడు. ఇక జూనియర్ విభాగంలో రాహుల్ ఆరు రికార్డులు సవరించాడు. స్నాచ్‌లో రెండు ప్రయత్నాల్లో 152 కేజీలు, 156 కేజీలు ఎత్తి వికాస్ ఠాకూర్ (150 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (188 కేజీలు) రికార్డును అధిగమించాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 341 కేజీలు, 351 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న (338 కేజీలు) ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇక కామన్వెల్త్ జూనియర్‌స్థాయిలో రాహుల్ ఐదు రికార్డులు అధిగమించాడు. స్నాచ్‌లో 156 కేజీలు ఎత్తి బోడీ సాంటవీ (కెనడా–152 కేజీలు) పేరిట ఉన్న రికార్డును దాటాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండు ప్రయత్నాల్లో 189 కేజీలు, 195 కేజీలు ఎత్తి స్టీవెన్ కరి (పాపువా న్యూగినియా–185 కేజీలు) రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం విభాగంలో రెండు ప్రయత్నాల్లో 345 కేజీలు, 351 కేజీలు బరువెత్తి కొజుమ్ తాబా (భారత్–330 కేజీలు) పేరిట ఉన్న రికార్డును సవరించాడు. రాహుల్ సోదరుడు రాగాల వరుణ్ జూనియర్ బాలుర 77 కేజీల విభాగంలో బరిలోకి దిగి స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ (320 కేజీలు) స్వర్ణాన్ని అందించాడు. జూనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో అజయ్ సింగ్ (310 కేజీలు)... జూనియర్ మహిళల 69 కేజీల విభాంలో నిరుపమా దేవి (178 కేజీలు)... యూత్ బాలికల 69 కేజీల విభాగంలో నికిత (163 కేజీలు) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. యూత్ బాలుర 77 కేజీల విభాగంలో అభిషేక్ (256 కేజీలు) కాంస్య పతకాన్ని గెలుపొందాడు. ఓవరాల్‌గా గురువారం భారత్‌కు 7 స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి. రాహుల్ - వరుణ్