breaking news
Weekends
-
ఖలేజా రీ రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులను అలరించారు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బ్లాక్‌బస్టర్ భైరవం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీ రిలీజ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో పెట్టుకుంటే బాగుంటుందని మనోజ్ సూచించారు. అలా చేయడం వల్ల కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వీకెండ్స్‌లో విడుదల చేస్తే మన సినిమాను ఇంకో సినిమాతో చంపేసినట్లు ఉంటుందన్నారు. ఎలాగైనా ఏ సినిమాకు ఉండే బలం.. ఆ సినిమాలకు ఉంటుంది.. ఎందుకంటే వీకెండ్స్‌లోనే అందరికీ టైమ్ దొరుకుతుందని తెలిపారు. ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదే ఈవెంట్లో కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్‌పై ప్రశ్న ఎదురవడంతో మనోజ్ స్పందించారు. ఇది సినిమా ఈవెంట్.. ఇక్కడ కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం.. ఎందుకంటే ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసని అన్నారు. మనోజ్ గతంలో కన్నప్ప సినిమాపై తాను చేసిన సరదాగా మాట్లాడానని తెలిపారు. ఆ సినిమా వెనుక ఉండే కష్టం నాకు తెలుసు.. కన్నప్ప ఘన విజయం సాధించాలని విష్ణు అన్నకు కోసం ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ మాట్లాడారు.కాగా.. భైరవం రిలీజ్ అయినరోజే మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలైంది. ఈ సినిమాకు సైతం మహేశ్ బాబు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లోనూ ఖలేజాను రీ రిలీజ్ చేశారు. మొదటి రోజే థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. -
సండే ఫండే.. ఇక సందడే..
మెట్రో నగరాల్లో వీకెండ్స్ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్ జోష్‌తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్ కార్నివాల్ కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్ జోష్‌కు మిస్ వరల్డ్ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్ మే 18న ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.నాటి వీకెండ్.. సూపర్ హిట్.. నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్ బండ్ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్ బండ్ రోడ్ ఒక ఓపెన్ ఎంటర్టైన్ మెంట్ ప్లేస్‌గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.ప్రమోషన్ యాక్టివిటీస్.. ఆరీ్మకి చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్ ట్రక్స్ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్ షోలు, ఫైర్ స్పోర్ట్స్ ఉండేవి. పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్ యాక్టివిటీస్‌కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్ సాగర్ వద్ద ఫౌంటెన్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.రీఛార్జ్.. రీస్టార్ట్.. సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్ వరల్డ్ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్ వరల్డ్ డైలీ షెడ్యూల్లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం. -
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
జాబ్ చేసేవారు తమ ఉద్యోగ కష్టాలు.. ఆఫీసులో ఎదురయ్యే అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవన్నీ చెప్పుకోవడానికి రెడ్డిట్ ఓ మంచి వేదికగా మారింది. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి.. తాను ఆఫీసులో ఎదుర్కొంటున్న కష్టాలను షేర్ చేశారు.నేను పనిచేసే కంపెనీలో.. ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆదివారాల్లో కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటలు పనిచేయాలని మేనేజర్ పేర్కొంటారు. ఇటీవల నేను నాలుగు రోజులు సెలవు కావాలని అడిగాను, చాలా చర్చలు జరిపిన తరువాత సెలవు మంజూరు చేశారు.సెలవులు ఇచ్చారు, కానీ.. సమయం దొరికినప్పుడల్లా ఆఫీస్ వర్క్ చేయాలని మేనేజర్ చెప్పారు. కానీ ఆ సమయంలో పని చేయడం కష్టమవుతుందని, వీలైతే చేస్తానని నేను (ఉద్యోగి) చెప్పాను. అయితే సెలవుల సమయంలో వర్క్ చేయలేకపోయాను.సెలవుల తరువాత నేను ఆఫీసుకి తిరిగి వచ్చాను. ఆ రోజు సాయంత్రానికే.. నా పనితీరు తక్కువగా ఉందని, నన్ను పీఐపీ( పర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్)లో ఉంచినట్లు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. దీనికి కారణం సెలవుల్లో పనిచేయకపోవడమే అని నాకు అర్థమైంది. ఇది నన్ను చాలా గందరగోళానికి గురిచేసింది. చట్టబద్ధంగా ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు? సంస్థలకు తాము చేయగలిగింది చేయగలిగేంత అధికారం ఉందా?..ఈ చర్యలను ఎదుర్కోవడానికి తగిన పరిష్కారం ఉందా.. అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కంపెనీ, మేనేజర్ పేరు చెప్పి అవమానించండి అని ఒకరు అన్నారు. చాలా కంపెనీలలో ఇలాగే జరుగుతోందని ఇంకొకరు అన్నారు. హెచ్ఆర్ను మీకు ఈ మెయిల్ చేయమని చెప్పండి అని మరొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సలహాలు ఇచ్చారు. -
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
యూపీలో వారాంతాల్లో లాక్డౌన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే శని, ఆదివారాల నుంచి అమలయ్యే ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ(హోం, సమాచార) అవనీశ్ అవస్థి పేర్కొన్నారు. ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉండే మార్కెట్లు, కార్యాలయాలను ఈ రెండు రోజుల్లో మూసివేసి ఉంచుతామన్నారు. బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని మార్కెట్లు పనిచేస్తాయన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో అన్ని రకాల దుకాణాల వద్ద ప్రత్యేక పారిశుధ్య, శానిటైజేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు 55 గంటలపాటు ఆంక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. -
కాల్ మనీ గ్యాంగ్ ... విడిదింట్లోనే వీకెండ్స్!
విజయవాడ సిటీ : నగరానికి చేరువలోని ఓ ప్రజాప్రతినిధి అతిథి గృహాన్ని రాము ముఠా వీకెండ్స్‌కు విడిది కేంద్రంగా వినియోగించుకునేవారు. శని, ఆదివారాల్లో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొనేదని స్థానికుల సమాచారం. మద్యం, మాంసం, మగువ.. ఇలా ఇక్కడికి వచ్చే అతిథులకు ఏది కావాలంటే అది క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థానాల్లోని అధికారులు వారాంతపు విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారి జాబితాలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. అందుకయ్యే ఖర్చంతా యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్, ఎలక్ట్రికల్ డీఈ ఎం.సత్యానందం తదితరులు భరించేవారని చెపుతున్నారు. వీరు ఎక్కువగా తమ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారికి ఇక్కడ ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరిని విదేశాలకు కూడా వీరి ఖర్చులతోనే పంపుతుంటారు. ఖరీదైన పార్టీలే ఇక్కడ జరిగే పార్టీలన్నీ కూడా ఖరీదైనవేనని పట్టుబడిన ముఠా సభ్యుల సహచరుల సమాచారం. వారాంతంలో రెండు రోజులు జరిగే ఈ పార్టీలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారని తెలిసింది. విదేశీ మద్యం, ఖరీదైన మాంసాహార వంటకాలు తయారు చేయిస్తారని సమాచారం. కొన్ని రకాల విదేశీ పక్షులను కూడా ఇక్కడి వంటకాల్లో ఉపయోగిస్తుంటారని చెపుతున్నారు. ఇక రాత్రయితే చాలు ఖరీదైన కార్లలో పలువురు యువతులు, మహిళలు ఇక్కడికి వస్తుంటారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన నగరాలకు చెందిన మోడల్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళుతుంటారని స్థానికుల సమాచారం. నెలలో మూడు నుంచి నాలుగు మార్లు జరిగే ఈ వేడుకలకు కాల్‌మనీ వ్యాపారంలో ఆర్జించిన మొత్తం నుంచే ఖర్చు చేస్తుంటారని తెలిసింది. వచ్చేది ప్రముఖులే జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ జరిగే పార్టీల్లో పాల్గొంటారని చెపుతున్నారు. అక్కడికి వీరిని రప్పించుకొని సకల సౌకర్యాలు సమకూర్చుతుంటారు. ఆపై వీరి నగదును పెట్టుబడిగా పెట్టించుకొని కాల్‌మనీ వ్యాపారం చేస్తుంటారు. ఆ ముసుగులో సెక్స్ రాకెట్లోకి దించిన మహిళలను వీరి వద్దకు పంపుతుంటారని సమాచారం. పైరవీలకూ వేదిక ఇక్కడ జరిగే పార్టీల నడుమ పైరవీల పర్వం కూడా సాగుతుందని తెలిసింది. ఉద్యోగాలు, పోస్టింగ్‌లు, కాంటాక్టులు.. ఇలా ప్రభుత్వపరంగా జరగాల్సిన పలు వ్యవహారాలు ఇక్కడి వీకెండ్స్‌లో ఉంటాయి. రాము, శ్రీకాంత్ తదితరులు తాము చేసుకున్న ఒప్పందాలను పార్టీకి వచ్చిన ప్రముఖుల ద్వారా పూర్తి చేయిస్తారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయని చెపుతున్నారు. ఇప్పుడీ ముఠా పోలీసులకు చిక్కడంతో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్న నేతలు, అధికారులు కంగుతిన్నారు. తమ పేర్లు బయటకు రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. -
థీమ్ బరాబర్..
సిటీలో భోజనప్రియుల అభి‘రుచు’లకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి.పోటీ పెరగడంతో ఎలాగైనాకస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నాయి. సాదాసీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో, ‘సిటీ’జనులు కొత్తవాటి కోసం చూపు సారిస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త కొత్త థీమ్స్‌తో ముస్తాబవుతున్నాయి. కొన్ని రాచరుచులతో అలరిస్తున్నాయి. మరికొన్ని ఖండాంతర రుచులను చేరువ చేస్తున్నాయి. ఇంకొన్ని ఒద్దికగా సంప్రదాయ రుచులనే సరికొత్తగా వండి వడ్డిస్తున్నాయి. ఇలాంటి థీమ్ రెస్టారెంట్లపై ‘సిటీప్లస్’ కథనం.. ‘చిరు’తిండి... భోజనప్రియులు తరచూ కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. రుచులు సరే, ఆరోగ్యం మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగానే బేగంపేట్‌లో ‘ఆహార్ కుటీర్’ మొదలైంది. నలుగురు మిత్రులు.. రాంబాబు, అర్చన, శ్రీరామ్, దినేష్.. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలతోనే ఇక్కడ అన్ని పదార్థాలనూ తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పెంచిన కూరగాయలనే వాడతారు. పల్లెవాతావరణాన్ని తలపించే ఈ రెస్టారెంట్ అలంకరణ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లో వడ్డిస్తారు. మంచినీళ్లు, మజ్జిగ మట్టిపాత్రల్లో అందిస్తారు. మహారాజ భోజనం... చాలా రెస్టారెంట్లకు పేరులోనే ‘రెస్ట్’ ఉంటుంది గానీ, అక్కడకు వెళ్లేవారికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. ఆర్డర్ చేసిన పదార్థాలు టేబుల్ మీదకు రాగానే, భోంచేయడం, ఆపై బిల్లు కట్టి, టిప్పు చదివించుకుని బయటపడటం.. ఇదంతా రొటీన్ వ్యవహారం. మణికొండలోని ‘వాక్’ (వీకెండ్స్ ఎట్ కూచిపూడి) రెస్టారెంట్ తీరే వేరు. ఇక్కడకు వెళ్లేవారెవరైనా, అడుగు పెడుతూనే ఆహారం కోసం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. విశ్రాంతిగా గడపొచ్చు. గేమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు. ఆకలేసినప్పుడు నిదానంగా ఆర్డర్ చేసి, తాపీగా భోజనం చేయవచ్చు. ‘కింగ్స్’లంచ్, ‘క్వీన్స్’ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషల్స్. ఇవి పేరుకు తగినట్లే రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్లలో అరడజనేసి స్టార్టర్స్, నాలుగు రకాల టిఫిన్లు, ఏడు రకాల బిర్యానీలు, సీఫుడ్ సహా తొమ్మిదిరకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్ ఉంటాయి. ‘కింగ్స్’లంచ్ కాస్త స్పైసీగా ఉంటే, ‘క్వీన్స్’డిన్నర్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇందులోని వైట్రూమ్ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు వెలిగినప్పుడల్లా రంగులు మారుతుంటుంది. బ్లాక్రూమ్లోని ఎల్ఈడీ దీపాలు నింగిలో చుక్కల్లా తళతళలాడుతూ కొత్త అనుభూతినిస్తాయి.