breaking news
water release issue
-
సాగునీటి కోసం రైతుల ఆందోళన
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు కన్నెర్ర జేశారు. కాకతీయ కాలువ పరీవాహక ప్రాంత నిజామాబాద్ జిల్లాలోని 14 గ్రామాలకు చెందిన రైతులు వారి కుటుంబాలతో ఎస్సారెస్పీ కార్యాలయ ముట్టడికి తరలి వచ్చారు. సుమారు 3 వేల మంది ఉదయం 11 గంటల నుంచి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ప్రాజెక్ట్ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయంలోకి చొరబడ్డారు.ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, కార్యాలయ బోర్డును తొలగించారు. ఏసీలను, తలుపులను ధ్వంసం చేశారు. వీరికి మహిళా రైతులు కూడా తోడవ్వడంతో ఎస్సారెస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని చెప్పి, నీరు ఎందుకు విడుదల చేయలేదని రైతులు ప్రశ్నించారు. గంటన్నర తర్వాత పోలీసులు రైతు ప్రతినిధులు, అధికారు లతో సమావేశం ఏర్పాటు చేయించినా ఎటూ తేల్చక పోవడంతో రైతులు ఎస్సారెస్పీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి 44 వరకు కాలినడకన వెళ్లి, మెండోరా మండలం చాకీర్యాల్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేశారు. 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి 8.30 గంటల వరకు రాస్తారోకో జర గడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. 2 బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. -
రైతులను నట్టేట ముంచుతున్నారు
పుష్కరకు వెంటనే నీరివ్వాలి 27లోగా వదలకుంటే ఉద్యమమే వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ధవళేశ్వరం ఇరిగేషన్‌కార్యాలయం వద్ద నిరసన ధవళేశ్వరం : ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. పుష్కర కాలువకు నీరు ఇవ్వకపోవడంతో దోసకాయలపల్లి, నందరాడ, మధురపూడి, బూరుగుపూడి, బుచ్చింపేట, గుమ్ములూరు, కలవచర్ల లిఫ్ట్ పరిధిలోని నరసాపురం, గాదరాడ తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయా గ్రామాల రైతులతో ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించకుంటే కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగుతానని అధికారులను హెచ్చరించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్ఈ సుగుణాకరరావు పుష్కర విధులకు వెళ్లడంతో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ రాంబాబును రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు తదితరులతో పాటు ఆమె కలసి మాట్లాడారు. పుష్కర కాలువ పూడికతీత పనులు ముందుకు సాగకుండా ఇరిగేషన్ అధికారులు రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. పుష్కర ఈఈ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని ఆందోళన నిర్వహించారు. అనంతరం పుష్కర ఇఇ వాసుదేవ్ వచ్చి ఈ నెల 27 నాటికి నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన విరమించారు. ఆ నాటికి నీరు ఇవ్వకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, కనీసం సుమారు రూ.3లక్షల విలువైన పూడికతీత పనులను కూడా చేయకపోవడం దారుణమని జక్కంపూడి అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు నేడు రైతులచేత కూడా సాగు దండగ అనిపించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు నీరు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా వారికి నష్టం కలిగిసున్నారన్నారు. పంట విరామం ప్రకటిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రభుత్వం వారి అవసరాలు తీర్చే ఏర్పాటు చేయడం లేదని ఆమె విమర్శించారు. ఏటా ఇలాగే వ్యవహరిస్తున్నారని పంటకు ముందే నిర్వహణ పనులు చేపట్టాలని సూచించారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పుష్కర కాలువకు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకొండ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, రాజానగరం మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ బొల్లిన సుధాకర్ నాయకులు పడాల చినబాబు, కర్రి నాగేశ్వరరావు, తోరాటి శ్రీనివాస్, అడపా శ్రీను, మట్టా వెంకటేశులు, కల్యాణం చిట్టిబాబు, పాలెం నాగవిష్ణు, యర్రంశెట్టి పోలారావు, మద్దాల అను, పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ఏజీఆర్ నాయుడు, గపూర్ తదితరులు పాల్గొన్నారు.