breaking news
Water Body
-
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
డ్యామ్‌ల పునరుద్ధరణకు రూ.645 కోట్లు
సీడబ్ల్యూసీకి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని 29 పాత డ్యామ్‌ల పునరుద్ధరణకు రూ.645కోట్ల సహాయం అందిం చాలంటూ కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అందించింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సెంట్రల్ డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ నరేందర్‌రెడ్డి బృందం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వీటిని శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాస్ ఢిల్లీలో కేంద్ర జల సంఘంలోని డ్యామ్ ప్రాజెక్టు డివిజన్ డైరెక్టర్ ప్రమోద్నారాయణ్కు అందజేశారు. కేంద్ర జల సంఘం ఈ ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకుకు పంపనుంది. డ్యామ్ రిమాబిలిటేషన్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు(డ్రిప్–2) కింద ప్రపంచబ్యాంకు ఈ నిధులు ఇవ్వనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో పాత డ్యామ్‌ల పునరుద్ధరణ, ఇతర మరమ్మ తులు చేపడతారు. -
నీటి సంఘం ఎన్నికల్లో ఇరు వర్గాల కొట్లాట
విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గోవాడలో మంగళవారం ఉదయం నీటి సంఘం ఎన్నికల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా జాబితా ప్రకటించడంతో ఇతర పార్టీల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికల నిర్వహణకు చర్చలు మొదలయ్యాయి.