అభ్యర్థిత్వానికి చేరువలో ట్రంప్
వాషింగ్టన్ ప్రైమరీలో గెలుపు
ఒలింపియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంకోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం జరిగిన వాషింగ్టన్ స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించి అభ్యర్థిత్వానికి అతి చేరువలో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్‌తో ఆయన పోటీ పడడం ఖాయమని విశ్లేషకులంటున్నారు.
మరో పక్క డెమోక్రటిక్ పార్టీ కూడా వాషింగ్టన్ ప్రైమరీని నిర్వహించింది. ఈ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించారు. కాగా, న్యూమెక్సికోలో ట్రంప్ చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బారికేడ్లను తోసివేశారు. పోలీసులపైకి రాళ్లు, మండుతున్న టీ షర్టులు, ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు. పలువురికి గాయాలయ్యాయి.