breaking news
Warwick University
-
ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ మా నినాదం
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ అభిమతమని.. ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేందుకు సర్వశక్తులూ ఉపయోగిస్తామని చెప్పారు. ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) నాలెడ్జ్ సెంటర్‌ను కేటీఆర్ శనివారం ప్రారంభించారు. పీడీఎస్ఎల్ కార్యకలాపాలను భారత్‌కు విస్తరించాలన్నారు. ఇంగ్లండ్‌లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు పరిశోధన, అభివృద్ధి సేవలను అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే..బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతో పుణే, చెన్నై సరసన హైదరాబాద్ ఆటోమోటివ్ హబ్‌గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఈ రంగంలో కేవలం పరిశోధన, అభివృద్ధికే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తెచ్చిన విధానాలు ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు. భారత్‌లో ఫార్ములా ఈ–రేసింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేటీఆర్... పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు.ఐటీ ఎగుమతుల్లోనూ పురోగతితమ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందని కేటీఆర్ పేర్కొ న్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాల యాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయని గుర్తుచే శారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతోపాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందని చెప్పారు. ఐటీ, అనుబంధ రంగాలతోపాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ భారత యువత ప్రతిభ, నిబద్ధతతో అద్భు తంగా రాణిస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువ త, విద్యార్థులతోపాటు కంపెనీలు కూడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్ ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పాల్గొన్నారు. -
మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి: ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కాన్వగేషన్‌కు తల్లిదండ్రులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వార్విక్ యూనివర్సిటీ ఛాన్సలర్ నుంచి మోహిత్ రెడ్డి 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్'లో మాస్టర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తనయుడు మోహిత్ రెడ్డి మాస్టర్ డిగ్రీ డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రిలయన్స్ సంస్థ అధినేత, టీవీఎస్ సంస్థ అధినేత, భారత దేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తల పిల్లలు గతంలో ఇదే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాస్టర్ డిగ్రీ పట్టా పొందడం విశేషం. -
పీడకలలేగా అని తీసిపారేయొద్దు!
లండన్: పీడ కలలతో చిన్నారులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తున్నారా? ఏం కాదులే..! అంటూ తీసిపారేయకండి. అలాంటి కలలే వారిలో మానసిక సమస్యలకు దారితీస్తాయని వార్విక్వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకు పీడ కలలు వస్తుంటే వారు కౌమారంలో మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉంటాయని వీరు గుర్తించారు. రాత్రివేళ భయపడే చిన్నారులు కూడా కౌమారంలో రెండు రెట్లు అధికంగా భ్రమలు, ఆలోచనలకు విఘాతం వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘పీడకలలు నిద్రలో రెండో భాగంలో వస్తాయి. అప్పుడు భయంతో నడచి వెళుతున్నట్లు అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే, నిద్రించగానే తొలి భాగం(గాఢ నిద్ర)లో ఉన్నప్పుడు భయంతో కేకలు పెట్టి లేచి కూర్చుంటారని వివరించారు.