breaking news
Warangal district police
-
పోలింగ్ కేంద్రాలపై నజర్
సాక్షి, జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించడం కోసం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాలపై నిఘాను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల్లో ప్రశాంతమైన పోలింగ్ నిర్వహణ కోసం అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. జిల్లా పరిధిలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపడానికి పోలీస్‌శాఖ తమ చర్యలను మొదలు పెట్టింది. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 857 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన అల్లర్లు, గొడవలు, ఘర్షణల కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 857 పోలింగ్ కేంద్రాల్లో 102 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి పరిశీలన తరువాత సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను విభజన చేయనున్నారు. బైండోవర్లకు రంగం సిద్ధం.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు బైండోవర్లు చేపట్టాడానికి రంగం సిద్ధంచేశారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు, రౌడీలు, మాజీలు, దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్ చేయనున్నారు. 2018 శాసన సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4,938 మందిని బైండోవర్ చేశారు. జనవరి నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో 200 మందిని బైండోవర్ చేశారు. రెవెన్యూ శాఖను సమన్వయం చేసుకుంటూ బైండోవర్లను మరోమారు చేపట్టనున్నారు. నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరోధించడానికి నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు చెక్ పోస్టుల చొప్పున జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి, సిద్దిపేట–సూర్యాపేట రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అదేస్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతోపాటు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. గ్రామాల్లో మద్యం నిల్వలు లేకుండా చూడడంపై దృష్టి సారించారు. మద్యం షాపుల నుంచి గ్రామాలకు తరలిపోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. రూ.33 లక్షలు పట్టివేత పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని పోలీసుల తనిఖీలో భాగంగా జనగామ పట్టణంలోని ఆర్ అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కారులో తీసుకు వెళుతున్న రూ.33.03 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేశం తెలిపారు. ఆంజనేయులు కారులో నగదు తీసుకు వెళుతున్నాడనే సమాచారం పోలీసులకు వచ్చిందన్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పిస్తే.. ఎన్నికల అధికారులు విడుదల చేస్తారన్నారు. డబ్బులను ఫ్లయింగ్ స్కాడ్ కు అప్పగించినట్లు తెలిపారు. నిఘా పెంచుతున్నాం.. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా నిఘాను పెంచుతున్నాం. శాసనసభ, గ్రామ పంచా యతీ ఎన్నికలను శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగాం. సమస్యాత్మక కేంద్రాల్లోనూ అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదు. జనగామ అసెంబ్లీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసరెడ్డి, డీసీపీ జనగామ -
టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు
* పోలీసులకు పట్టుబడిన భార్యాభర్తలు * 93 నేరాలు.. 3.10 కిలో బంగారం చోరీ వరంగల్ క్రైం: ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని వెళ్లే అంతరాష్ట్ర భార్యాభర్తల దొంగల ముఠాను ఆదివారంరాత్రి వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 82 లక్షల విలువ చేసే 3.10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన బానోతు రవి ఖమ్మంలో కారు నడుపుతుండేవాడు. వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతానికి చెందిన డీ-ఫార్మసీ విద్యార్థిని ఎర్రం రాజేశ్వరితో రవికి పరిచయం అరుుంది. ఇద్దరూ ప్రేమించుకొని, పెళ్లి చేసుకుని వరంగల్ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటలో ఉంటున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దానిని విక్రరుుంచాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యూరుు. రోజూ టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే నేర కథననాలకు ఆకర్షితుడైన రవి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బు సులువుగా సం పాదించ వచ్చని భావించాడు. 2013 ఫిబ్రవరిలో హంటర్‌రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. అక్కడి నుంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. దీనికి ఆయనకు భార్య రాజేశ్వరి సహకరించింది. నిర్మానుష్య ప్రాంతాల్లో దంపతుల రెక్కీ.. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో రాజేశ్వరి రెక్కి వేసి నిందితుడు రవికి సమాచారం అందించేది. దీంతో రవి ద్విచక్రవాహనంపై బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళల కోసం కాపుకాచి, అవకాశం చూసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే తరహాలో దంపతులిద్దరూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో కలిపి సుమారు 93 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఆదివారం రాత్రి హంటర్‌రోడ్డులో క్రైమ్, మిల్స్‌కాలనీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తాము చోరీచేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో అమ్మేం దుకుగాను ద్విచక్రవాహనంపై ఉర్సుగుట్ట నుంచి హన్మకొండ బస్టాండ్ వైపు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద బంగారు ఆభరణాలు కనపడడంతో దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తాము మూడేళ్లుగా వరంగల్ కమిషనరేట్‌తో పరిధితోపాటు ఇతర జిల్లాలో పాల్పడిన నేరాలు అంగీకరించడంతో పోలీసులు వీరి వద్ద చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరాల చిట్టా ఇదీ..: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 నేరాలు, హన్మకొండ-14, మిల్స్‌కాలనీ-11, మట్టెవాడ-10, కేయూసీ-6, కాజీపేట-5, ఇంతెజార్గంజ్-3, స్టేషన్‌ఘన్‌పూర్-2, వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క చైన్‌స్నాచింగ్ చేశారు. నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనపరిచిన క్రైమ్ ఏసీపీ ఈశ్వర్రావు బృందాన్ని కమిషనర్ అభినందించారు.