breaking news
walks out
-
‘ఒక్క ప్రశ్నకు నవ్వి బయటకు వచ్చాను’
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత, మంచి వేతనం ఎంత ముఖ్యమో అంతకంటే వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, గౌరవప్రదమైన పని సంస్కృతి ముఖ్యమని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం, మంచి రివ్యూ ఉన్నప్పటికీ.. ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక విచిత్రమైన ప్రశ్నతో అభ్యర్థి ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వచ్చేశారు.సంఘటన వివరాల్లోకి వెళ్తే..సోషల్ మీడియా వేదిక రెడ్డిట్‌లో ‘సహాలిమ్న్’ అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. సదరు అభ్యర్థి తాను ఎంతో ఉత్సాహంగా హాజరైన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకుంటూ ‘ఉద్యోగ వివరణ, వేతనం, కంపెనీ రివ్యూలు అన్నీ చాలా బాగున్నాయి. హెచ్ఆర్ మేనేజర్‌ను కలిసి ఇంటర్వ్యూలో కూర్చున్న వెంటనే మొదటి ప్రశ్న వేశారు. అదనంగా ఎలాంటి పేమెంట్ లేకుండా ఓవర్ టైమ్ (Unpaid Overtime) చేయడాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు?’ అని అడిగినట్లు చెప్పారు.ఆ ప్రశ్న వినగానే అభ్యర్థి మొదట అది సరదా జోక్ అనుకుని నవ్వేశారు. కానీ, ఇంటర్వ్యూయర్ పట్టుబట్టి సమాధానం కోసం చూడటంతో అసలు విషయం అర్థమైంది. కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ తమ ఉద్యోగులంతా పని పట్ల ఎంతో మక్కువ కలిగి ఉంటారని, పని పూర్తి చేయడానికి ఎంత సమయమైనా కేటాయిస్తారని చెప్పారు. అదనపు పని గంటలకు ప్రత్యేకంగా చెల్లింపులు లేదా ట్రాకింగ్ ఉండదని స్పష్టం చేశారు. దీంతో ఏమాత్రం సంకోచించని అభ్యర్థి ‘మీ సమయానికి ధన్యవాదాలు, ఇది నాకు సరైన ఉద్యోగం కాదు’ అని చెప్పి అక్కడికక్కడే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చారు.సోషల్ మీడియా స్పందనలుఈ పోస్ట్‌కు ఇంటర్నెట్లో గంటల వ్యవధిలోనే దాదాపు 45,000 పైగా వ్యూస్ వచ్చాయి. ‘కంపెనీ మిమ్మల్ని ఉచితంగా శ్రమదోపిడీ చేయాలనే సిద్ధంగా ఉంది. మీరు సరైన నిర్ణయమే తీసుకుని పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఉచిత ఓవర్ టైమ్ శ్రమ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని, సమర్థవంతమైన నిర్వహణ లేని చోటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి ఆయన వాకౌట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అరెస్ట్‌కు నిరసనగా బుధవారం నిర్వహించిన ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా వాకౌట్ అయ్యారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ ఉందని, భయానక పరిస్థితుల్లో రాజకీయ వాతావరణమున్నట్టు అమిత్ మిత్రా ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ భేటీకి హాజరైన ఆయన, ఆశ్చర్యకరంగా ప్రీ-బడ్జెట్ మీటింగ్ నుంచి వైదొలిగారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరిస్తానని తాను భావించానని, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రికి అవగాహన ఉందని అనుకున్నట్టు ఆయన చెప్పారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. తాజా పరిస్థితులపై సమస్యలను ఆర్థికమంత్రి పట్టించుకోవాలని మిత్రా కోరారు. దేశంలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ నెలకొని ఉందని, ఆందోళనకరమైన రాజకీయ వాతావరణం ప్రతి సందర్భంలోనూ మూలమూలన దాగి ఉందని విమర్శించారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో బందోపాధ్యాయను సీబీఐ కోల్‌కత్తాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తాము చేపడుతున్న నిరసన వల్లే కేంద్రం ఈ మాదిరి వ్యవహరిస్తుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్లమెంట్లను వాడుకుని మోదీ రాజకీయ ప్రత్యర్థులను అణచి వేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమల్లో వందల కొలది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో లెదర్ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడిందని, మహారాష్ట్రలోనూ మిర్చి పరిశ్రమకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. కనీసం ఈ ఫైనాన్సియల్ ఎమర్జెన్సీపై ఆర్థికమంత్రి ఊసైనా ఎత్తడం లేదన్నారు. నిజనిజాలను ఆయన వినాలని కోరారు. తన ప్రజంటేషన్ అనంతరం బరువెక్కిన గుండెతో మీటింగ్ నుంచి బయటికి వచ్చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. చరిత్రలోనే ఇది మొదటిసారి అర్థరహితమైన బడ్జెట్‌గా నిలవబోతుందని మిత్రా పేర్కొన్నారు.


