ప్రభుత్వ ముద్రణాలయ డీజీఎం పదవీ విరమణ
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ముద్రణాలయ సంస్థలో పనిచేస్తున్న రాయలసీమ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.శ్రీరామసత్యప్రసాద్ శనివారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా, రీజియన్‌లోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు డీజీఎంను సన్మానించారు.
డీజీఎం దంపతులతో పాటు ఇదేరోజు పదవీ విరమణ చేసిన ఫోర్మేన్ తనికిల సత్యనారాయణరావును దుశ్శాలువలు, పూలమాలలతో ముంచెత్తారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సిరాజుద్దీన్, నర్సింహులు, కేశవ, కన్నయ్య, ఆర్.నాగరాజు, తిక్కన్న, నాగరాజు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.