voluntary disclosure scheme
-
అందని ద్రాక్షగా వీడీఎస్
చింతల్: అక్రమ నీటి కనెక్షన్లను సక్రమంగా చేసుకునేందుకు జలమండలి (వాలంటరీ డిస్పోజల్ స్కీమ్) ప్రవేశపెట్టిన వీడీఎస్ పథకం నెల రోజులు కావస్తున్నా కుత్బుల్లాపూర్ వాటర్ వర్క్స్ డివిజన్ పరిధిలో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో వినియోగదారులు వాటర్ వర్క్స్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ కనెక్షన్లను గతంలో సంవత్సరం పాటు నీటి బిల్లుల వేసి వీడీఎస్‌కు బదిలీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎటువంటి రుసుము చెల్లించకుండానే కనెక్షన్లను మార్పు చేసేందుకు వీలు కల్పిస్తున్నా ఏ ఒక్క కనెక్షన్ ఇంత వరకు వీడీఎస్‌కు బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పథకం అసలు అమలు అవుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో పనికి.. ఒక్కో రేటు.. వాలంటరీ డిస్పోజల్ స్కీమ్‌తో ప్రతి రోజు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెండు కనెక్షన్లు ఉన్న వారు సైతం వీడీఎస్‌కు దరఖాస్తు చేస్తున్నారు. కాగా కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే బదలాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ అధికారులు తమ సిబ్బంది తెచ్చిన వాటినే స్వీకరిస్తూ మిగతా వాటిని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడపనిదే ఫైల్ ముందుకు కదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఒక్కో రేటు చొప్పున ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఫైల్ రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీడీఎస్ దరఖాస్తులు అధికారుల వద్దకు చేరినా క్రమబద్ధీకరణకు గడువు ముంచుకొస్తుండటంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. చివరి నిమిషంలో ఫైల్ నాట్ సబ్మిటెడ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారని కొంతమంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు అప్లోడ్ చేసినా నేటికీ ఆర్డర్ కాపీ/ఫీజుబులిటీ కాపీలు రావడం లేదు. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటు న్నాయి. సిబ్బందే మీడియేటర్లు.. వీడీఎస్ స్కీమ్ దరఖాస్తులను సిబ్బందే మీడియేటర్లుగా మారినట్లు సమాచారం ఒక్కో కనెక్షన్‌కు రేట్లు మాట్లాడుకుని దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎటువంటి పనులు లేకపోయినా ఆ పని.. ఈç పని అంటూ ఉదయం రావడంతో పైరవీలు చేయడం వారి దినచర్యగా మారినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వసూళ్ల పేరుతో ఉద్యోగం చేస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. కొత్త కనెక్షన్ల విషయంలోనూ వారే అధికారులకు వెన్నుదన్నుగా ఉండి నూతన భవనానికి గోతులు తీయగానే గద్దల్లా వాలిపోయి కనెక్షన్ల పైరవీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు నేరుగా కార్యాలయానికి వచ్చే వారిని మధ్యవర్తుల వద్దకు పంపుతున్నట్లు కోడై కూస్తోంది. అధికారులు ఎక్కడా నేరుగా వినియోగదారులతో సంప్రదింపులు జరుపకుండా మధ్యవర్తులనే ముందు నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా త్రిబుల్ టైమ్ బిల్లులు.. డివిజన్ పరిధిలోని వివిధ సెక్షన్లలో అధికారులు ఇష్టారాజ్యంగా ఫీజుబులిటీలు ఇచ్చినట్లు వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 600 గజాలు దాటిన వాటికి బిల్డింగ్‌లకు పోర్షన్ల వారీగా నమోదు చేయాల్సి ఉండగా 100 నుంచి 200 వందల గజాలకు సైతం పోర్షన్లు యాడ్ చేశారు. రూ.650 రావాల్సిన నీటి బిల్లుకు పోర్షన్లు యాడ్ చేయడంతో రూ.3,600కు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా కొన్ని భవనాలకు పోర్షన్ల వారీగా నమోదు చేయడంతో వినియోగదారులు డివిజన్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్న జీఎం శ్రీధర్‌రెడ్డి వాటిని సాధారణ కనెక్షన్లుగా మార్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ఈ ఫిర్యాదులే వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జలమండలి శుక్రవారం వీడీఎస్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎలాంటి అదనపు చార్జీల్లేకుండానే కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. 2020 ఫిబ్రవరి 21 వరకు 90 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. నగరవాసులకు మంచి నీటిని సరఫరా చేసేందుకు జలమండలి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని నగరానికి తీసుకొస్తోంది. ఇందుకు ప్రతి వెయ్యి లీటర్లకు గాను రూ.47 చొప్పున ఖర్చు చేస్తోంది. రోజుకు 472 మిలియన్ గ్యాలన్లు అంటే 214.76 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇందులో 37శాతం వివిధ కారణాలతో వృథా అవుతోంది. మరోవైపు కొంతమంది అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకొని జలమండలి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఫలితంగా జలమండలికి ప్రతినెల సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ నల్లా కనెక్షన్లపై దృష్టిసారించిన జలమండలి వీడీఎస్‌కు శ్రీకారం చుట్టింది. గతంలోనూ క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వగా.. మూడేళ్ల బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ చార్జీలు పెనాల్టీగా వసూలు చేశారు. కానీ ఈసారి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చారు. ఈ పథకం కాలపరిమితి ముగిసిన తర్వాత క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే రెట్టింపు కనెక్షన్ చార్జీలు, మూడేళ్ల వినియోగ చార్జీలతో పాటు రూ.300 సర్వీస్ చార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీడీఎస్లోనే క్రమబద్ధీకరించుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడంతో పాటు చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. వీడీఎస్‌కు సంబంధించి జలమండలి కార్యాలయ అధికారులను గానీ, 155313 నంబర్లో గానీ సంప్రదించొచ్చని సూచించారు. -
ఆ 13,860 కోట్లు నావి కావు
నేను మధ్యవర్తినే.. ఐటీ అధికారులతో గుజరాత్ వ్యాపారి మహేశ్ అహ్మదాబాద్: నల్లధనం మార్చుకునేందుకు కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తనను పావుగా వాడుకున్నారంటూ గుజరాత్ వ్యాపారవేత్త మహేష్ షా శనివారం వెల్లడించాడు. ఆదాయం వెల్లడి పథకంలో భాగంగా రూ. 13,860 కోట్లు ప్రకటించిన మహేష్ షా... చివరికి మొదటి వారుుదా కట్టకుండా చేతులెత్తేసి ఐటీ అధికారులకు షాక్ నిచ్చాడు. నవంబర్ 29 నుంచి పరారీలో ఉన్న షా ... చివరికి తనంతట తానే అహ్మదాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. శనివారం అతనిని ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకముందుకు ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ కొందరి ఒత్తిడి మేరకే ఈ పని చేశానని, సొమ్ము తనదిగా ప్రకటిస్తే కమిషన్ ఇస్తానంటూ వారు వాగ్దానం చేశారని షా పేర్కొన్నాడు. ఐడీఎస్ పథకం కింద ఎవరి డబ్బైతే వెల్లడించానో... వారు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని, అందుకే మొదటి వారుుదా కట్టలేకపోరుునట్లు చెప్పాడు. చేసిన తప్పును తెలుసుకున్నానని, ఐటీ విభాగం విచారణ అనంతరం అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నాడు. పాలు, కేబుల్ బిల్లుకు డబ్బుల్లేవు కానీ... స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకం సమయంలో రూ.13,860 కోట్ల నల్లధనాన్ని వెల్లడించిన షా అతి సాధారణ జీవితం గడిపేవాడనీ, పాలు, కూరగాయలకు కూడా అప్పు ఉన్నాడని తెలిసి ఐటీ శాఖ అధికారులు నివ్వెరపోయారు. షా అహ్మదాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారం చేసేవాడు. అతి సాధారణ జీవితం గడిపే షా ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోవాలలతో బేరమాడేవాడు. పాలుకు రూ.8,000, కూరగాయలకు రూ.5,800 అప్పు ఉన్నాడు. బిల్లు కట్టకపోవడంతో కేబుల్ టీవీ కనెక్షన్ కూడా తొలగించారు. అలాంటి వ్యక్తి ఐడీఎస్‌లో తన వద్ద రూ.13,860 కోట్ల లెక్క చూపని డబ్బు ఉందంటూ ఆదాయపు పన్ను శాఖకు సమాచారమిచ్చాడు. ఆ డబ్బుకు సంబంధించి నవంబర్ 30 లోపు రూ.1,560 కోట్లు తొలి వారుుదాగా పన్ను రూపంలో చెల్లించాలి. ఆ డబ్బు కట్టలేకపోవచ్చని ఐటీ శాఖకు సమాచారం రావడంతో మహేష్, ఆయన స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు దాడులు చేశారు. దాడుల్లో మహేష్ ఇంట్లో రూ.29,000 మాత్రమే దొరికింది. మహేష్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు సరిగా తెలీదని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెహ్ముల్ సేత్నా చెప్పడం గమనార్హం. మహేష్ ఐదు సెల్ఫోన్లను వాడేవాడని, తరచూ నంబర్లు మార్చేవాడని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు తరచూ వెళ్తూ ఉండేవాడనీ, విమానాశ్రయానికి మాత్రం రిక్షాలో వెళ్లేవాడని తెలిసింది. -
13వేల కోట్ల వెల్లడి కేసులో సంచలనం..!
-
13వేల కోట్ల వెల్లడి కేసులో సంచలనం!
-
13వేల కోట్ల ఆస్తిపరుడు మహేష్ షా.. మిస్సింగ్!
-
13వేల కోట్ల ఆస్తిపరుడు.. మిస్సింగ్!
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోతుందనగా.. తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉందని గుజరాత్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారు. అయితే.. ఇప్పుడు ఆయన అదృశ్యం అయ్యారు! మహేష్ షా (67) అదృశ్యం అయిన విషయాన్ని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన షా ముంబై, ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన కోసం పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఫలితం మాత్రం లేదు. అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు ఆదాయ వెల్లడి పథకం సమయంలో వెళ్లిన మహేష్.. ఆ పథకం గురించి అడిగారు. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోతుందనగా.. అదేరోజు రాత్రి 11.55 గంటలకు ఆయన అహ్మదాబాద్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి, తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో పథకం గడువు ముగిసిపోయింది. తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్పేస్తానని ఆయన అన్నట్లు సీఏ షెత్నా చెప్పారు. వెల్లడించినదంతా నగదు రూపంలోనే ఉండటం, అది చాలా పెద్దమొత్తం కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన రహస్యాలు, ఇతర వివరాలన్నింటినీ అధికారులు ఆయనకు వివరించారు. పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ. 1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు. నవంబర్ 29 నుంచే షా కనిపించడం లేదని సీఏ షెత్నా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని షెత్నా చెప్పారు. -
13వేల కోట్ల ఆస్తిపరుడు.. మిస్సింగ్!