స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోతుందనగా.. తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉందని గుజరాత్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారు. అయితే.. ఇప్పుడు ఆయన అదృశ్యం అయ్యారు! మహేష్ షా (67) అదృశ్యం అయిన విషయాన్ని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన షా ముంబై, ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన కోసం పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఫలితం మాత్రం లేదు. అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు ఆదాయ వెల్లడి పథకం సమయంలో వెళ్లిన మహేష్.. ఆ పథకం గురించి అడిగారు.