breaking news
vivekananda hospital
-
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
సాగునీటిరంగ నిపుణుడు హనుమంతరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పది రోజుల కిందట తీవ్ర జ్వరంతో ఆయన బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో చేరారు. చికిత్స జరుగుతున్న సమయంలో గుండెపోటు రావడంతో కన్నుమూశారు. రాష్ట్ర సాగునీటి రంగానికి విశేష సేవలందించడంతో పాటు రాజస్తాన్ సహా వివిధ దేశాల్లోనూ సాగు, తాగునీటి సమస్యలకు హనుమంతరావు పరిష్కారాలు చూపారు.