breaking news
Vishwesh Krishna moorthy
-
హ్యాపీ.. హ్యాపీ
నిర్మించిన తొలి సినిమాయే అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శితమయ్యే అవకాశం వస్తే ఏ నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్‌లోనే ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. మ్యూజిషియన్ విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘99 సాంగ్స్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఒక నిర్మాతగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు రచయిత కూడా. ఈ ‘99 సాంగ్స్’ సినిమాతో ఇహన్ భట్, ఎడిల్సీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు 24వ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో అక్టోబరు 9న ‘99 సాంగ్స్’ ప్రదర్శితం కానుంది. ‘‘99 సాంగ్స్’ చిత్రం బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోతుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్. 85 దేశాల నుంచి వచ్చిన దాదాపు 299 సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. స్క్రీనింగ్ అయ్యే సినిమాల జాబితాలో ‘ది స్కై ఈజ్ పింక్, ఆధార్’ వంటి హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే వాటిలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. -
నిర్మాతగా మారిన మ్యూజిక్ లెజెండ్
తన సంగీతంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్వర సంచలనం ఏఆర్ రెహమాన్. భారతీయ భాషలన్నింటిలో అద్భుతమైన పాటలు అందించిన రెహమాన్ అంతర్జాతీయ వేదికల మీద కూడా సత్తా చాటాడు. అంతేకాదు గ్రామీ, అకాడమీ అవార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం అందుకున్న ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెహహాన్ సంగీతంతో పాటు స్వయంగా కథను కూడా అందిస్తున్నాడు. '99 సాంగ్స్' పేరుతో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, రెహమాన్ తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది. With your support & good wishes, I'm pleased to share my movie's first poster! https://t.co/F7KOZ0bRmv— A.R.Rahman (@arrahman) March 9, 2016