breaking news
vishnu sahasranamam
-
విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..?
అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు, వ్యాసమహర్షి, పాండవులు శ్రద్ధగా విన్నారే కానీ ఎవరూ వ్రాసుకోలేదు. ఎంతో మహిమాన్వితమైన సహస్రనామాలను అందరికీ చేరేందుకు లిఖించబడాలి... కానీ ఇప్పుడు ఎలా? అని ధర్మరాజు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మను అడుగగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ పాండవుల్లో కనిష్టుడైన సహదేవుడు వల్లే సాధ్య అవుతుంది. అంతేకాకుండా వ్యాస మహర్షి లిఖిస్తే అందరికీ అందేలా గ్రంథస్థం చేయించవచ్చునని సమాధానమిచ్చాడు. అందుకు ధర్మరాజు అదెలా సాధ్యమనగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ మనందరిలో ఒక సహదేవుడు మాత్రమే సూతస్పటికం వేసుకున్నాడు. దానివల్లే సాధ్యమవుతుందన్నాడు.సూత స్ఫటికం అంటే.....వాతావరణంలో ప్రయాణించే శబ్ద తరంగాలను గ్రహించి తనలో నిల్వ చేసుకోగల ఒక అద్భుతమైన స్పటికం. హిందూ పురాణాల ప్రకారం సూతస్ఫటికాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. నేటి ఆధునిక టేప్ రికార్డర్లా పనిచేస్తుంది. గాలిలో కలిసిపోయిన శబ్ద తరంగాలను రికార్డు చేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ వినిపించ గల శక్తి దీనికుంది.సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం మనమందరం పిలుస్తున్న క్లౌడ్ స్టోరేజ్ లాంటిది.అంత మహిమాన్వితమైన సూతస్పటికాన్ని ధరించిన సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే స్పటికంలో నమోదుకాబడిన శబ్ద తరంగాలు వెనకకు వస్తాయని (రీప్లే)వాటిని వ్యాస మహర్షి తో వ్రాయించాలని శ్రీ కృష్ణుడు సలహా ఇవ్వడంతో సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థించడం, వ్యాసమహర్షి విష్ణు సహస్రనామాలను లిఖించడంతో, అవి మనందరికీ గ్రంథస్వరూపంలో అందాయి. వాటినే మనం ప్రతిరోజు పఠనం చేసుకుంటున్నాము.ఇదంతా ఎలా తెలిసిందంటే... బహుశా... 1940లో అనుకుంటా... అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామీజీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి టేప్ రికార్డుతో వచ్చాడు. ఆ సందర్భంగా స్వామీజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏదని అడిగితే ఎవరినుండీ....ఏ మాత్రం సమాధానం రాలేదు. అప్పుడు స్వామీజీ మనకు విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయి ?.... ఎలా లిఖించబడింది.... ఎవరు వ్రాసారు... అని ప్రశ్నించారు. మరలా మౌనమే సమాధానం కావడంతో స్వామీజీ పైన చెప్పుకున్న కథనంతా చెప్పారన్నమాట. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ఈ ఒక్క నామంతో విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం
కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామ సంకీర్తన అని అందరికీ తెలుసు. అయితే పాడటం తెలీదని చింతించనక్కర్లేదు. భజనలు ఎలా చేయాలో కూడా తెలీదు అని చింతించ నక్కర్లేదు. సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా ఉచ్చరించలేనుగా అని చింతించనక్కర్లేదు. నిజాయతీగా, భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు.‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’ – దీనిని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించిన ప్రయోజనం పొందుతాం అంటారు. అది కూడా సాధ్యం కాదా? ఐదు నామాలు చాలు. అయిదింటిలో మొదటి నామం: ‘రామ’. చింతలు, దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని రామ నామాన్ని జపిస్తే చాలు, రామ నామం విన్న వెంటనే హను మంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అంటారు. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్/ తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్’.రెండవ నామం: ‘కృష్ణ’. ఈ నామమే పాండవులను రక్షించింది. ‘కృష్ణా! నాకు కష్టాలు ఇవ్వు! అప్పుడే, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని కృష్ణుడిని వరం అడిగింది కుంతి. మానసిక బలాన్నీ, కష్టాలను భరించే ఓర్పునూ ఇచ్చే నామమిది. మూడవ నామం: ‘నారాయణ’. బాలుడు ప్రహ్లాదుడిని రక్షించిన నామం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామం. నాలుగవ నామం: ‘గోవింద’. దుశ్శాసన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి ‘గోవింద! గోవింద!’ అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామమిది. తిరుమలలో ఎల్లవేళలా ప్రతిధ్వనించే నామం. ఇక ఐదవ నామం: ‘నరసింహ’. నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు. వేరు వేరు పేర్లతో ఉన్న దేవుని ఏ పేరుతో ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడు.– యామిజాల జగదీశ్ -
పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి..!
కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరం తో విష్ణుసాయుజ్యాన్ని పొందుతాడు భీష్ముడు. ఆయన భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులూ భీష్మపంచకంగా ప్రసిద్ధికెక్కుతాయనీ, ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా... పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈరోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్ర నామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన్రపాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన ‘విష్ణుసహస్రనామస్తోత్రం’ ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరం, సకల శుభకరం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని, ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయనీ పెద్దలు చెబుతారు.ఈవేళ ఇవి నిషిద్ధం..మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి.ఉపవాస దీక్ష చేపట్టాలి.ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది.తెల్లవారు జామునే నిద్ర లేవాలి.. మధ్యాన్నం కునుకు తీయకూడదు.ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగారం చేయాలి.జుట్టు కత్తిరించకూడదు.ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు.విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది.పేదవారికి, ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం. ఈవేళ ఇలా చేయాలిపూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం’’ఓం నమోనారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించ వలసి ఉంటుంది. --డి.వి.ఆర్(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
ధనుర్మాసం అంటే ..? ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదా..?
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. శుభకార్యాలు ఎందుకు చేయరు?ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం. (చదవండి: అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!) -
సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు
చెన్నై: సోషల్ మీడియా నుంచి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను తొలగించడంతో కర్ణాటక సంగీత ప్రియులు అసంతృప్తికి గురవుతున్నారు. మార్గశిర మాసం అంటేనే కర్ణాక సంగీత ప్రియులకు అంత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ నెలలో పలు కర్ణాటక సంగీతోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాంటి కర్ణాటక సంగీతంలో ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను సోషల్ మీడియాలో ఆలకించాలని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. యూట్యూబ్ నుంచి సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామం గీతాన్ని తొలగించారు. ఆ గీతాల హక్కులను పొందిన ఆడియో సంస్థ ఆ సహస్రనామ గీతాన్ని తొలగించడం కర్ణాటక సంగీత ప్రియులను నిరాశకు గురిచేసింది.


