breaking news
Vines phogat
-
తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా?
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ హెచ్చరించారు. రుజువులు ఉన్నాయా? ‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, ఒలింపియన్ల మద్దతు కోరతాం. విదేశీ ఆటగాళ్లు కూడా ఇందులో గళం విప్పేలా ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని వినేశ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన కమిటీ తమను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో, ఆడియో రుజువులు అడిగిందని రెజ్లర్లు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. తండ్రిలాంటి వారు తాకితే కూడా అపార్థాలా? కమిటిలోని ఓ మెంబర్ ఓ మహిళా రెజ్లర్‌తో మాట్లాడుతూ.. తండ్రిలాంటి బ్రిజ్ భూషణ్ ఏదో తెలియక, చనువుగా మిమ్మల్ని తాకితే దానిని కూడా అపార్థం చేసుకుంటారా అని అన్నట్లు వారు చెప్పారని తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ సిబ్బంది, కోచ్, బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లంతా తమ విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారని మరో రెజ్లర్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి ఇటాలియన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ పోరాటం ముగిసింది. రోమ్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–7 (8/10), 10–12తో డిమినార్–కుబ్లర్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సూపర్ టైబ్రేక్‌లో బోపన ద్వయం ఒక మ్యాచ్ పాయింట్ చేజార్చుంది. బోపన్న జోడీకి 29,300 యూరోల (రూ. 26 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు? -
ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ
లాస్ వెగాస్ (అమెరికా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. బబితా కుమారి, వినేశ్ ఫోగత్, నవ్‌జ్యోత్ కౌర్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. 2012లో కాంస్యం సాధించిన బబిత (53 కేజీలు) క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయింది. బబిత 2-6తో చైనాకు చెందిన గ్జూచున్ జోంగ్ చేతిలో ఓడింది. యువ రెజ్లర్ వినేశ్ (48 కేజీలు) తొలి రౌండ్లోనే 4-8తో కిమ్ హ్యోన్ గ్యాంగ్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం పాలైంది. నవ్‌జ్యోత్ (69 కేజీలు) కూడా తొలి రౌండ్లోనే 0-8తో అలినా స్టాడ్నిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల 85 కేజీల గ్రీకో రోమన్ విభాగం క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్ 0-10తో రమీ ఆంటెరో (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయాడు.