breaking news
Vijayawada Book Festival Society
-
డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య చెప్పారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు -
ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు
విజయవాడ పుస్తకమహోత్సవం ప్రారంభంలో సీఎం వెల్లడి సాక్షి, విజయవాడ: ప్రతి జిల్లాలోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, భాషా, సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న 28వ పుస్తకమహోత్సవాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే అనంతపురం, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, సమాజం నాలెడ్జ్ సొసైటీగా మారడానికి ఇటువంటి పుస్తకప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ విషయాల్లో మీడియా సానుకూల దృక్పథాలతో రాయడం నేర్చుకోవా లని సూచించారు. మంచి సంఘటనలు బాగా పబ్లిష్ చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో సమాచారమంతా అందుబాటులో ఉంటున్నప్పటికీ, పుస్తకం చదువుతుంటే పొందే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. పుస్తకం చదవడం ఒక అలవాటుగా పెట్టుకోవాలన్నారు.