breaking news
Vijay Shah
-
మొసలి కన్నీళ్లు వద్దు
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘‘న్యాయ విచారణ నుంచి బయటపడేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లు నటిస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. మీ క్షమాపణ అలాగే ఉంది. హైకోర్టులో మీరు క్షమాపణలు చెప్పిన వీడియో చూశాం. ఏదో కోర్టు అడిగింది కదా అని చెబుతున్నట్లుగా ఉంది. సూటిగా తప్పు ఒప్పుకుంటూ నేరుగా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. కానీ మీరేం చేశారు? అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటివల్ల ఎవరైనా బాధ పడి ఉంటే అంటూ నానా వంకలూ తిప్పారు. ఇదెక్కడి క్షమాపణ? తప్పు ఒప్పుకునే పద్ధతేనా ఇది? ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు’’ అంటూ తూర్పార బట్టింది. ‘‘నిజాయితీగా, మన స్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? మీ వ్యాఖ్యలతో యావత్ దేశం సిగ్గుపడుతోంది’’ అంటూ తీవ్రంగా మందలించింది. ఈ విషయంలో మంత్రిని అత్యున్నత న్యాయస్థానం గత వారమే తీవ్రంగా మందలించడం, కల్నల్ ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో మంత్రి క్షమాపణలు చెప్పారు. తనపై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘అలాంటి మొసలి కన్నీళ్లు వద్దు. కనుక మీ క్షమాపణలు అవసరం లేదు. మీలాంటి వాళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో మాకు బాగా తెలుసు’’ అని స్పష్టం చేశారు. ‘‘మీరో సీనియర్ రాజకీయ నాయకుడు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. తద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి. కానీ మీరేం చేశారు? కల్నల్ ఖురేషీపై వ్యాఖ్యల వీడియో పూర్తిగా చూశాం. మీరు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మరింత అభ్యంతరకర పదజాలం కూడా వాడబోయారు. సమయానికి పదాలు దొరక్క ఆగిపోయారంతే! మన సైన్యం ఘనతను చూసి దేశమంతా గర్విస్తుంటే మీరేమో ఇలాంటి మతిలేని మాటలకు దిగారు. ఇలాంటి వ్యవహార శైలికి సిగ్గుపడాలి మీరు!’’ అంటూ మండిపడ్డారు.సిట్‌లో మహిళా ఐపీఎస్మంత్రి వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. దర్యాప్తు ప్రగతిపై పోలీసులను ప్రశ్నించి వారి సమాధానంపై పెదవి విరిచింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. ‘‘మంగళవారం ఉదయం పదింటికల్లా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటవ్వాలి. ముగ్గురు ఐపీఎస్‌లూ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. ఒక మహిళా ఐపీఎస్ ఉండాలి. మే 28లోగా సిట్ తొలి నివేదిక సమర్పించాలి’’ అని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా వర్ణిస్తూ విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.దేశం ధర్మసత్రం కాదు శరణార్థులకు ఆశ్రయం కుదరదుశ్రీలంకవాసి కేసులో ‘సుప్రీం’ వ్యాఖ్యలుశరణార్థులు దేశం వీడాలని ఆదేశంన్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో ఆశ్రయం ఓ శ్రీలంక శరణార్థి పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భారత్ ఇప్పటికే 140 కోట్లకు పైగా జనాభాతో సతమతమవుతోంది. శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి దేశం ధర్మసత్రం కాదు’’ అని పేర్కొంది. శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2015లో అరెస్టయిన శ్రీలంకవాసి పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా పిటిషనర్‌కు స్వేచ్ఛగా జీవించే హక్కుందని ఆయన తరఫున లాయర్ వాదనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఆ హక్కు భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎల్టీటీఈ కార్యకర్త అనే అనుమానంతో పిటిషనర్ 2015లో అరెస్టయ్యాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిషేధ) చట్టం కింద దోషిగా తేలడంతో 2018లో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2022లో మద్రాస్ హైకోర్టు దాన్ని ఏడేళ్లకు తగ్గించింది. శిక్ష ముగియగానే భారత్ వీడాలని, అప్పటిదాకా శరణార్థి శిబిరంలో ఉండాలని ఆదేశించింది. వాటిని సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘‘2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్టీటీఈ సభ్యుడిగా పోరాడినందున అక్కడ నన్ను బ్లాక్ గెజిటెడ్‌గా ఉంచారు. కనుక శ్రీలంకలో నాకు ప్రాణహాని ఉంది. నా భార్య పలు వ్యాధులతో, కుమారుడు పుట్టుకతో వచ్చిన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వారు భారత్‌లోనే స్థిరపడ్డారు. నేను కూడా వారితో పాటు ఇక్కడే ఉండిపోతా’’ అని అభ్యర్థించాడు. శ్రీలంకలో ప్రాణహాని ఉందని వాదించాడు. దానితో జస్టిస్ దత్తా పూర్తిగా విభేదించారు. ‘‘అయితే మాత్రం ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కుంది? మరే దేశమైనా వెళ్లండి’’ అని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. రోహింగ్యా శరణార్థుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ‘‘ఐరాస శరణార్థుల కార్డుల వంటివి ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఉంటే తిప్పి పంపించేయాల్సిందే’’ అని ఆదేశించింది. -
‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నోరు పారేసుకున్న మంత్రిపై ఎఫ్ఐఆర్
జబల్పూర్: పాకిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’గురించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, దేశ ప్రజలకు ఎప్పుకప్పుడు సమాచారం అందించిన మహిళా సైనికాధికారి, కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహిళా అధికారిని కించపర్చేలా మాట్లాడిన విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ విషయం తమకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా మంగళవారం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు. అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పారీ్టలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రివర్గం నుంచి తొలగించాలివిజయ్ షాను తక్షణమే మధ్యప్రదేశ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. విజయ్ షా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనొక మూర్ఖుడు అని మండిపడ్డారు. బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ్ షా అభ్యంతకర వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఖండించారు. మహిళా అధికారి గురించి అలా మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కార్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులను గౌరవించాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అనుచితంగా మాట్లాడడాన్ని సహించబోమని హెచ్చరించారు. పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం: విజయ్ షా తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతుండడంతో విజయ్ షా బుధవారం స్పందించారు. ఎవరైనా బాధపడి ఉంటే ఒకటి కాదు పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని చెప్పారు. -
ఒక్క హెయిర్ కటింగ్‌తో 60 వేల రూపాయలు!
భోపాల్: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం సేవా భావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిదాస్ హెయిర్ సెలూన్ షాప్ పెట్టడానికి మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షాను ఆశ్రయించాడు. అయితే కటింగ్‌లో రోహిదాస్ నైపుణ్యం తెలుసుకోవడానికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయమని రోహిదాస్‌ను మంత్రి విజయ్ షా కోరారు. దీంతో కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి అద్భుతంగా కటింగ్ చేశాడు. రోహిదాస్ నైపుణ్యానికి ముగ్ధుడైన మంత్రి సంతోషంతో రూ.60,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ అంశంపై విజయ్ షా స్పందిస్తూ కరోనా ఉదృతి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా యువత ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా నిబంధనలు (మాస్క్‌లు) పాటించి సంతోషంగా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు చేయాలనుకునే యువతకు ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
హాజరు పలికేటప్పుడు జైహింద్ అనాల్సిందే
భోపాల్, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికేటప్పుడు జైహింద్ అనడం తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాత్నా జిల్లాలో తొలుత దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విజయ్ షా గత డిసెంబర్లోనే కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై విజయ్ మాట్లాడుతూ.. ఇకపై ప్రభుత్వ పాఠశాలలో ఇక నుంచి విద్యార్థులు ‘యస్ సార్, యస్ మేడమ్’కు బదులు జైహింద్ అనాలని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో దేశ భక్తి భావం పెరుగుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తారని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా ఇరవై రెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. -
పాము కరిచిందనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలింపు!
భోఫాల్: పాము కాటుకు గురైనారనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖాను నిర్వహిస్తున్న విజయ్ షా పాముకాటుకు గురయ్యారు. పాము కాటుకు గురైన మంత్రిని ప్రభుత్వ జేపీ ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురయ్యారా లేక విష కీటకం కుట్టిందా అనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని జేపీ ఆస్పత్రి ముఖ్య వైద్యాదికారి పంకజ్ శుక్లా తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు జరిగిందన్నారు. మంత్రి షాను ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.