ఒక్క హెయిర్‌ కటింగ్‌తో 60 వేల రూపాయలు!

One Haircut Gets Sixty Thousand For Madhya Pradesh Person - Sakshi

భోపాల్‌: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం సేవా భావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిదాస్‌ హెయిర్ ‌సెలూన్‌ షాప్‌ పెట్టడానికి మధ్యప్రదేశ్‌ అటవీశాఖ మంత్రి విజయ్‌ షాను ఆశ్రయించాడు. అయితే ‌కటింగ్‌లో రోహిదాస్‌ నైపుణ్యం తెలుసుకోవడానికి హెయిర్‌ కటింగ్‌, షేవింగ్‌ చేయమని రోహిదాస్‌ను మంత్రి విజయ్‌ షా కోరారు.  దీంతో కరోనా నేపథ్యంలో మాస్క్‌ ధరించి అద్భుతంగా కటింగ్‌ చేశాడు. 

రోహిదాస్‌ నైపుణ్యానికి ముగ్ధుడైన మంత్రి సంతోషంతో రూ.60,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ అంశంపై విజయ్‌ షా స్పందిస్తూ కరోనా ఉదృతి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా యువత ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా నిబంధనలు (మాస్క్‌లు) పాటించి సంతోషంగా హెయిర్‌ కటింగ్‌ చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు చేయాలనుకునే యువతకు ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top