breaking news
vijay hazare one day trophy
-
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్‌కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయాలు సాధించాయి. కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్మోల్, హర్నూర్ శతకాలు ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గింది. మొదట ఛత్తీస్‌గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్మోల్ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్‌లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్‌పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదు. -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్‌పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులుభవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్‌గా కనిపించాడు. ఇదే సిరీస్‌లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ). చదవండి: Viral Video: ఎంతుంటే ఏంటన్నయ్యా.. గెలిచానా లేదా..? -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జై వచ్చాడు.. మరో సెంచరీ కొట్టాడు.. అయినా కరుణించరా..?
దేశవాలీ క్రికెట్లో అభినవ బ్రాడ్‌మన్‌గా పిలుచుకునే ముంబై రన్ మెషీన్ సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ బాదాడు.విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా బుధవారం (నవంబర్ 23) రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన జట్టును గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 117; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ ఆజింక్య రహానే (82 బంతుల్లో 88; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (47 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ముంబైని విజయతీరాలకు (48.3 ఓవర్లలో 338/5) చేర్చారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సర్ఫరాజ్ ఖాన్.. డిశ్చార్జ్ అయిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి సెంచరీ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది.సర్ఫరాజ్ సాహసానికి ముగ్దులైన అభిమానులు అతన్ని వేనోళ్లతో పొగుడుతున్నారు. ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగడమే ఓ ఎత్తైతే, సెంచరీ బాది మరీ గొప్పతనాన్ని చాటుకున్నాడంటూ ఆకాశానికెత్తుతున్నారు. సర్ఫరాజ్ గురించి బాగా తెలిసిన వాళ్లైతే.. వీడు టీమిండియాలో చోటు దక్కేంతవరకు సెంచరీలు బాదుతూనే ఉంటాడని అంటున్నారు. కాగా, దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతనికి భారత జట్టులో చోటు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ను ఇటీవలే సెలెక్టర్లు కరుణించారు.త్వరలో బంగ్లాదేశ్‌లో జరుగనున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు అతన్ని ఎంపిక చేశారు. -
VHT 2022: సెంచరీతో చెలరేగిన అశ్విన్.. బిహార్‌పై ఆంధ్ర ఘన విజయం
బెంగళూరు: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 132 పరుగుల తేడాతో బిహార్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అశ్విన్ హెబర్ (141 బంతుల్లో 154; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగగా...రికీ భుయ్ (65 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హనుమ విహారి (70 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం బిహార్ 44.3 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. వీర్‌ప్రతాప్ సింగ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సకీబుల్ ఘని (42) మినహా అంతా విఫలమయ్యారు. హరిశంకర్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...అయ్యప్ప, షోయబ్, నితీశ్ కుమార్ తలా 2 వికెట్లు తీశారు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్‌గా రావాలి -
రియాన్ పరాగ్ ఊచకోత.. కెరీర్లో తొలి శతకం బాదిన రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ (అస్సాం).. విజయ్ హజారే వన్డే ట్రోఫీ-2022లో భాగంగా నిన్న (నవంబర్ 12) రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లిస్ట్-ఏ క్రికెట్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 84 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం.. రియాన్ పరాగ్ సెంచరీతో కదం తొక్కడంతో 46.5 ఓవర్లలో 271 పరుగులు చేసి ఆలౌటైంది. పరాగ్ మినహా మరే ఇతర బ్యాటర్ రాణించకపోవడంతో అస్సాం తమ కోటా ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. పరాగ్ తర్వాత నెక్స్ టాప్ స్కోరర్‌గా ముక్తర్ హుసేన్ (39) ఉన్నాడు. అనంతరం 272 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్.. అస్సాం బౌలర్లు మ్రిన్మోయ్ దత్తా (3/34), అవినోవ్ చౌదరీ (3/25), రజాకుద్దీన్ అహ్మద్ (2/25), ముక్తర్ హుసేన్ (1/17) ధాటికి 128 పరుగులకే ఆలౌటైంది (33.3 ఓవర్లలో). ఫలితంగా అస్సాం 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చదవండి: Vijay Hazare Trophy: రోహిత్ రాయుడు, తిలక్ వర్మ సెంచరీలు -
అందుకు పృథ్వీ షా అర్హుడే.. అయినా వెయిట్ చేయక తప్పదు
హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించి, సరికొత్త రికార్డులను సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీషాపై భారత లెజెండరీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశవాళీ వన్డే టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 165.40 సగటుతో 827 పరుగులు సాధించి, తన జట్టును చాంపియన్‌గా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని.. టీమిండియాలో చోటుకు అతను అర్హుడని ఆకాశానికెత్తాడు. 8 మ్యాచ్‌ల్లో నాలుగు భారీ శతకాలు బాది సెలెక్టర్లకు సవాలు విసిరిన అతను.. జాతీయ జట్టులో స్థానం ఆశించడం సహజమేనని, అయితే అందుకు షా మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని, అందులోనూ ఓపెనింగ్ స్థానం కోసం నలుగురు పోటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో షా విఫలం కావడం ప్రతికూలాంశంగా మారిందని, అతని స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో షా క్యూలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. షా ప్రస్తుతం గిల్ తర్వాత స్థానంలో ఉన్నాడని, అతనికి కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో షాతో పాటు పడిక్కల్ సైతం వరుస శతకాలతో పరుగుల వరద పారించాడని గర్తు చేశాడు. పడిక్కల్.. గత ఐపీఎల్ సీజన్లో సైతం 4 అర్ధశతకాలను సాధించి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడని పేర్కొన్నాడు. ముంబయిని విజేతగా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని, భారత జట్టులో ఆడే అవకాశం త్వరలోనే అతడి తలుపు తడుతుందని ఆయన జోస్యం చెప్పాడు. చదవండి: నాన్నకు ప్రేమతో.. కృనాల్, హార్ధిక్ ఏం చేశారో తెలుసా..? -
చరిత్ర సృష్టించిన పృథ్వీ షా..
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కుర్రాడు పృథ్వీ షా ధానాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 4 శతాకాలతో (105 నాటౌట్, 227 నాటౌట్, 185 నాటౌట్, 165) శివాలెత్తిన ఈ ముంబై ఆటగాడు.. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సైతం విధ్వంసం సృష్టించి, విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 800కుపైగా పరుగులు (827 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి..తన జట్టుకు శుభారంభాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
చిత్తుగా ఓడిన గంభీర్ సేన!
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో గౌతం గంభీర్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు చిత్తుగా ఓడింది. గుజరాత్ జట్టు విసిరిన 274 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. కేవలం 134 పరుగులకే ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. పవన్ నేగి 57 పరుగులతో రాణించగా.. ఉన్ముక్ చంద్ 33 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టులో నలుగురు బ్యాట్స్మెన్లు డకౌటయ్యారంటే గుజరాత్ బౌలర్లు ఏమేరకు చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ ఓపెనర్లు రిషబ్ పాంట్(0), శిఖర్ ధవన్(5), కెప్టెన్ గౌతం గంభీర్(9) వరుసగా పెవిలియన్ కు చేరారు. గుజరాత్ బౌలర్లలో ఆర్పీ సింగ్ నాలుగు వికెట్లు సాధించగా, భుమ్రాహ్ కు ఐదు వికెట్లు దక్కాయి. అంతకుముందు గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. కీలక మ్యాచ్ లో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) దుమ్మురేపాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ, పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరినా.. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ), కలారియా(21) సమయోచితంగా ఆడటంతో గుజరాత్ 273 పరుగులను స్కోరు బోర్డుపై ఉంచింది. -
ఎదురీదుతున్నగంభీర్ సేన
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గుజరాత్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ఢిల్లీ ఎదురీదుతోంది. గుజరాత్ విసిరిన 274 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన గౌతం గంభీర్ సేన ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ ఓపెనర్లు రిషబ్ పాంట్(0), శిఖర్ ధవన్(5), కెప్టెన్ గౌతం గంభీర్(9), మిలింద్ కుమార్(0) వరుసగా పెవిలియన్ కు చేరారు.అనంతరం ఉన్ముక్ చంద్(33) వెనుదిరగడంతో ఢిల్లీ 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. గుజరాత్ బౌలర్లలో ఆర్పీ సింగ్ నాలుగు వికెట్లు సాధించగా, భుమ్రాహ్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. కీలక మ్యాచ్ లో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) దుమ్మురేపాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ, పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరినా.. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ), కలారియా(21) సమయోచితంగా ఆడటంతో గుజరాత్ 273 పరుగులను స్కోరు బోర్డుపై ఉంచింది.


