నిబంధనలు పాటించకుంటే చర్యలు
కడప అర్బన్ :
ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులు, అధికారులు, వ్యాపారులు నిబంధనలను తప్పక పాటించాలనీ కడప జోన్ ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు అన్నారు. ఇటీవలే బాధ్యతలను చేపట్టిన ఆయన శుక్రవారం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు.
– కృష్ణా పుష్కరాల విజయవంతానికి కృషి చేశామనీ, ప్రథమ స్థానంలో రెవెన్యూ, రెండవ స్థానంలో ఆర్టీసీ నిలిచిందన్నారు.
– ఆర్టీసీ బస్టాండ్లలో తాము సంస్థ వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వస్తు, సామగ్రిపై వున్న రేట్లకే ప్రయాణీకులకు విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
– డ్రైవర్ల పని తీరును మెరుగు పర్చుకునేందుకు యోగా లాంటి కార్యక్రమాలను చేపడతామన్నారు.
– విధి నిర్వహణ సమయంలో ఎవరైనా మద్యం సేవిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము రూట్లలోనే ఆకస్మిక తనిఖీలను మళ్లీ చేస్తామన్నారు.
– ఏదైనా సమాచారంను తమ ఫోన్ నెంబర్స్ : 99592 25754, 73829 23333లకు చేరవేయవచ్చన్నారు. తాము ప్రయాణిస్తున్న బస్సుల్లో డ్రైవర్ మార్గమధ్యంలో మద్యం సేవిస్తే తమకు తెలుపవచ్చన్నారు.