breaking news
vigilance and monitoring committee meeting
-
అధికారుల తీరుపై ఎంపీల అసహనం
- ప్రాజెక్టులు నిర్మించేస్తున్నారు - నిర్వహణ గాలికొదిలేస్తున్నారు - మొక్కుబడిగా విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేశం - డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు సాక్షి, విశాఖపట్నం: ‘జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు..కాని వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తున్నారు...శాఖల మధ్య సమన్వయంకొరవడడంతో నిర్మించిన ప్రాజెక్టులు ప్రజలకు అక్కరకురాకుండా పోతున్నాయి’ అంటూ ఎంపీలు ముత్తంశెట్టిశ్రీనివాసరావు, కొత్తపల్లి గీతలు ధ్వజమెత్తారు. కమిటీ చైర్‌పర్శన్ కొత్తపల్లి గీత అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన విజిలెన్స్,మోనటరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీ అవంతిశ్రీనివాసరావు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. కమిటీసభ్యులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది అధికారులు మాత్రమే పాల్గొన్నారు. తొలుత గత కమిటీలోతీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై జెడ్పీ సీఈఒ మహేశ్వరరెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అవంతి మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే విద్యుత్ శాఖ కనీసం విద్యుత్ కనెక్షన్లు కూడాఇవ్వడంలేదన్నారు. ఈ రెండుశాఖల మధ్య సమన్వయ లోపంవలన కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న మంచినీటిప్రాజెక్టులు ఎందుకు కొరగాకుండాతయారవుతున్నాయన్నారు. పనిదినాలకల్పనలో విశాఖ ప్రధమ స్థానంలో ఉందని డ్వామా పీడీ శ్రీరాములనాయుడు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి జీవో జారి అయ్యిందని ఎంపీ గీత తెలిపారు.సంసద్ ఆదర్శగ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎంపీ ముత్తంశెట్టి సూచించా రు. జిల్లాలో పచ్చదనం లోపించడం వలన ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, ఈ ఏడాది వర్షకాలంలో కోటి 50లక్షల మొక్కలు నాటేంకుదు ప్రణాళికలు సిద్దం చేసినట్టు డ్వామా పీడీ తెలియజేయగా, నాటడం కాదు..వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఏంపీలు కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీలో ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు పూర్తి సహయ సహకారాలుఅందించాలని కలెక్టర్యువరాజ్ హౌసింగ్ కార్పొరేషన్ అదికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్పర్శన్లాలం భవాని పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాలని ఆళ్లగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ-ఐకేపీ, డ్వామా ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, డీఆర్డీఏ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే నంద్యాల ఎంపీ అధ్యక్షతన కార్యక్రమం సాగాలి. అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఎంపీలు రాకపోవడంతో సీనియర్ అయిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని కానిచ్చారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వివిధ అంశాలపై గళం విప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రూపనగుడి, మరివేముల నీటి పథకాలకు ఉయ్యాలవాడ మండలంలోని వివిధ గ్రామాలకు ఉప్పునీరు(రా వాటర్) వస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమీక్షించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఆ నీటిని తాగడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఏదైనా జరిగితే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపైనే కేసులు పెడతానని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి హెచ్చరించారు. తొలుత ఇందిరా ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. జిల్లాకు ఐఏవై కింద 2012-13లో 10,783 ఇళ్లు మంజూరు అయితే అన్ని పూర్తి చేశామని, 2013-14లో 8,611 ఇళ్లు మంజూరైతే 3,724 ఇళ్లు నిర్మించామని హౌసింగ్ పీడీ వివరించారు. డ్వామా పీడీ హరినాథరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ, ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్లు తదితర వాటిని వివరించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏయే నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఏయే పంటలు చేసుకోవచ్చు అనే వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. పింఛన్లను సర్పంచుతో సంబంధం లేకుండా పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి ఆరు నెలలకోసారి జరగాల్సి ఉందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎంపీలు హాజరు కాకపోవడం వల్ల సీనియర్ ఎమ్మెల్యే ాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు చెప్పిన సమస్యలపై స్పందిస్తామని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డ్వామా పీడీ హరినాథరెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, హౌసింగ్ పీడీ రామసుబ్బు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.