breaking news
Videocon Telecom Company
-
ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి
బార్సిలోనా: వీడియోకాన్ టెలికం సంస్థ ఈ కామర్స్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాల్లోకి రావాలని యోచిస్తోంది. స్పెక్ట్రమ్ అవసరం లేని టెలికం సంబంధిత వ్యాపారాల్లోకి రావాలనుకుంటున్నట్లు కంపెనీ డెరైక్టర్, సీఈఓ అర్వింద్ బాలి చెప్పారు. దేశమంతా ఇంటర్నెట్ సర్వీసులందజేయడానికి, ఏడు టెలికం సర్కిళ్లలో మొబైల్ సేవలందించడానికి ఈ కంపెనీకి లెసైన్స్‌లు ఉన్నాయి. స్పెక్ట్రమ్ వేలంలో ఈ కంపెనీ పాల్గొనడం లేదు. మొబైల్ వాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో భారీ అవకాశాలున్నయని బాలి పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో అంతర్జాతీయ పర్యాటకుల కోసం వరల్డ్ సిమ్ సర్వీస్‌ను ఈ కంపెనీ అందించనున్నది. -
2జీ రేట్లకే 4జీ సర్వీసులు
వీడియోకాన్ ఆఫర్ న్యూఢిల్లీ: వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రస్తుతమున్న 2జీ, 3జీ ధరలకే 4జీ ఇంటర్నెట్ సర్వీసులను అందించనున్నది. ఇక్కడ జరిగిన ఎల్టీఈ ఇండియా ఈవెంట్లో వీడియోకాన్ టెలికాం డెరైక్టర్, సీఈవో అర్వింద్ బాలి ఈ విషయం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీ సర్వీసులను అందించాలని యోచిస్తున్నామని వివరించారు. 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి 3-4 నెలలు పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా 10 నగరాల్లో 4జీ సర్వీసులందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌లో స్పీడ్ 64 నుంచి 144 కేబీపీఎస్ అని, 3జీ నెట్‌వర్క్‌లో 144 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్ అని వివరించారు. ఇక 4జీ నెట్వర్క్ స్పీడ్ 3జీ స్పీడ్ కంటే 5 నుంచి 50 రెట్లు అధికమని పేర్కొన్నారు. 4జీ నెట్‌వర్క్‌లో డేటా వ్యయాలు తక్కువగా ఉంటాయని, ఎక్కువ డేటాను తక్కువ టైమ్‌లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా ఈ సమావేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ సుమిత్ డి. చౌధురి తాను రచించిన రూల్స్ ఆఫ్ ద గేమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2,3 ఏళ్లలో మెషీన్ టు మెషీన్ (ఎం2ఎం) టెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తిలోకి రానున్నదని వివరించారు. ఈ టెక్నాలజీ కారణంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ విక్రమ్ తివాతియా పేర్కొన్నారు. ఒక సర్వీస్ ఏరియాలో ఒక వినియోగాదారుడికి 10 సిమ్ల కంటే ఎక్కువగా ఇవ్వకూడదన్న తదితర నిబంధనలను సవరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.