breaking news
Venkatramana reddy
-
రాజకీయ సన్యాసం తీసుకుంటా : వెంకట రమణా రెడ్డి
సాక్షి కామారెడ్డి: ఖాదీ చొక్కా ధరించడం అంటే కలెక్షన్లు వసూలు చేయడం కాదని ప్రజలకు సేవ చేయడమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఈ రోజు (శనివారం) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమవేశం నిర్వహించారు. తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇంఛార్జ్ మంత్రితో షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో తాను మాట్లాడకుండా ఉంటే తన నియోజకవర్గానికి నవాబు లాగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు పోటీ చేసి ఓటమిపాలైన షబ్బీర్ అలీ అవినీతి బాగోతం గురించి ముఖ్యమంతి రేవంత్ రెడ్డి కి వివరించానని ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగినా మౌనంగా ఉన్నానని .. ఇక నుంచే భరించే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రభుత్వ కళాశాల ఆస్తుల విషయంలో తాను ఏదైనా అవినీతి చేసినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే. తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డి ప్రభుత్వ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని తన తండ్రితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడానని ఆ సమయంలో షబ్బీర్ అలీ మంత్రి హోదాలో ఉండి కూడా కామారెడ్డికి ఏమి చేయలేదని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెంకట రమణా రెడ్డి తేల్చి చెప్పారు.వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తానని నిజమైన నాయకులెవరైనా ఉంటే తన తప్పు నిరూపించాలని సవాల్ విసిరారు.అయితే ఈరోజు ఉదయం నుంచి కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేత కారు ధ్వంసం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
కామారెడ్డిలో ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల పోరు
-
ఇద్దరు స్నేహితుల కథ...
‘కె.ఎస్ 100’ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి షేర్ దర్శకుడు. కె.వెంకట్ రామిరెడ్డి నిర్మాత. శనివారం విలేఖరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ–‘మాది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్. 1995 నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంగ్లిష్ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసేవాడిని. ఇప్పటివరకు దాదాపు 25 సినిమాలు చేశాను. ‘టైమ్‌పాస్’ ‘మోడ్రన్ గర్ల్’ చిత్రాల ద్వారా నిర్మాతగా మారాను. ‘కె.ఎస్ 100’ నిర్మాతగా నా మూడవ చిత్రం. ఈ చిత్రంలోని కె అంటే కుమార్, ఎస్ అంటే స్వామి. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని సంఘటనల వల్ల వారు శత్రువులుగా మారుతారు. ఆ స్నేహితులు మళ్లీ కలిశారా? లేదా? అనేది కథ. షేర్ అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్స్ బాగుండడంతో తమిళ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా బిజినెస్ పరంగా సేఫ్‌లో ఉన్నాను’ అన్నారు. -
సైన్స్‌పై అవగాహన పెంచేందుకు జేవీవీ కృషి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సైన్స్‌పై మరింత అవగాహన పెంచేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణంలో డైట్లో పట్టణ స్థాయి చెకుముకి టాలెంట్టెస్ట్ జరిగింది. దాదాపు 47 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీషు మీడియంలో సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్, తెలుగు మీడియంలో నిర్మల విద్యామందిర్ పాఠశాలల విద్యార్థులు మొదటిస్థానం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్ధులనుద్ధేశించి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. సైన్స్‌ను నిత్యజీవితానికి అన్వయించడంలో లోపం జరుగుతుందని, దీనివల్లనే సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సైన్స్ ఫలాలు సామాన్యులకు అర్థం అయినపుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎస్కే. మస్తాన్, సమత జిల్లా కన్వీనర్ అమరావతి, పట్టణ అధ్యక్షుడు వర్ధెల్లి లింగయ్య పాల్గొన్నారు.


