breaking news
venkatragavan
-
దిగ్గజాల విషయంలో తమిళనాడు క్రికెట్ కీలక నిర్ణయం
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీసీఎన్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని 'ఎ' స్టాండ్‌కు భారత దిగ్గజ క్రికెటర్లు ఎస్ వెంకట్రాఘవన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను పెట్టి వారిని గౌరవించనుంది. చెన్నైలో జరగనున్న చారిత్రాత్మక బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్) మ్యాచ్‌కు ముందు ఈ ముగ్గురికి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీసీఎన్ఏ పేర్కొంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన 2027 బిగ్‌బాష్ లీగ్ ప్రీమియర్ టీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 12న మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. కాగా పైన పేర్కొన్న ముగ్గురు దిగ్గజాలు తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత జట్టుకు కూడా ఆడారు. మాజీ క్రికెటర్లు క్రిష్ శ్రీకాంత్, అశ్విన్‌ల కంటే సీనియర్ అయిన ఎస్ వెంకటరాఘవన్ 1963 నుంచి 1985 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. 22 ఏళ్ల కెరీర్లో వెంకట్రాఘవన్ 57 టెస్టులాడి 156 వికెట్లు పడగొట్టారు. అంతేకాదు, 1975, 1979లో జరిగిన తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లకు ఎస్.వెంకటరాఘవన్ భారత కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇక క్రిష్ణమాచారి శ్రీకాంత్ గురించి పరిచయం అవసరం లేదు. 66 ఏళ్ల శ్రీకాంత్ 80వ దశకం ఆరంభంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన క్రిష్ణమచారి శ్రీకాంత్ 1981 నుంచి 1992 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన టీమిండియా తరఫున 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సందర్భంలో శ్రీకాంత్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు.ఇక అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈతరం బౌలర్లలో బెస్ట్ స్పిన్నర్‌గా పేరు పొందిన అశ్విన్ ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాకు చాలా మ్యాచ్‌ల్లో ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. టెస్టు క్రికెట్లో 537 వికెట్లు తీసిన అశ్విన్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కుంబ్లే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.దేశంలోని ప్రఖ్యాత స్టేడియాల్లోని స్టాండ్లకు భారత క్రికెటర్ల పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పటికే సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి సహా 17 మంది క్రికెటర్ల పేర్ల మీద స్టాండ్ లేదా పెవిలియన్ ఉంది. తాజాగా ఈ జాబితాలోకి వెంకటరాఘవన్, శ్రీకాంత్, అశ్విన్ కూడా చేరారు. ఇక చిదంబరం స్టేడియంలో క్రికెటర్ల పేరిట ఒక స్టాండ్‌కు నామకరణం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పేరు మీద మాత్రమే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు పేరు పెట్టడం జరిగింది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్.. సరికొత్త రికార్డు -
‘హరహర మహాదేవ.
శంభో శంకర’ అంటూ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. భక్త జనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. గురువారం సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివాలయూల్లో వైభవంగా సాగుతున్నారుు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజాధికార్యక్రమాలు జరిగాయి. శివ భక్తులు తమ తమ ఇళ్లల్లో ఉదయాన్నే తల స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షతో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్త్రోత్త్రం, శివ సహ స్ర నామ పారాయణం పఠించారు. ఇక సాయం సంధ్య వేళ శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. శంభో శంకర: రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి ఆలయం, కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, కుట్రాలంలోని కుట్రాలనాథేశ్వరర్ ఆలయం, కోయంబత్తూరులోని పొల్లాచ్చి సుందరేశ్వరాలయం, కన్యాకుమారిలోని ధనుమలయాన్ ఆలయం, కరూర్ జిల్లాలోని ఏకపురీశ్వరర్ ఆలయం... ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రధాన శివ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శివరాత్రి వేడుకల్లో పాల్గొని తరించారు. చెన్నై మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయం, తీర్థ స్వామీశ్వర ఆలయం, వాలీశ్వర ఆలయం, తిరువాన్మీయూరు మరుదీశ్వర ఆలయం, వేళచ్చేరి శ్రీ దండీశ్వర ఆల యం, తిరువేర్కాడు వీరకత్తీశ్వర ఆలయం, వలసరవాక్కం వేల్వీశ్వరాలయం, పూందమల్లి వైదీశ్వరాలయం, పార్క్టౌన్లోని ఏకాంబరీశ్వరాలయం, వడపళణి వేంగీశ్వరాలయం, సైదాపేట కారనీశ్వరాలయం, మింట్ దక్షిణామూర్తి ఆలయం, అనకాపుత్తూరులోని అగదీశ్వరాలయం, పాడిలోని వలిదీశ్వర ఆలయం, కోయంబేడులోని కురుందీశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. పూజలు : అన్ని శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి విడత, తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో విడత పూజ, పన్నెండు నుంచి శుక్రవారం ఉదయం మూడు గంటల వరకు మూడో విడత, మూడు నుంచి నాలుగు గంటల వరకు నాలుగో విడత చొప్పున నాలుగు కాల పూజలు భక్తి భావాన్ని పెంపొందిస్తూ నిర్వహించారు. శివుడు, పార్వతీ దేవి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. వాహనాల్లో స్వామి, అమ్మవార్లను అధిష్టించి ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ ఆవరణల్లో శివరాత్రి పరమార్థాన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాల్లో శివ లింగాన్ని దర్శించుకున్న భక్తులు రాత్రంతా జాగారం చేశారు. జ్యోతిర్లింగాల దర్శనం: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో పూజలందుకుంటున్న జ్యోతిర్లింగాల్ని బ్రహ్మకుమారి సమాజం చెన్నైలో కొలువు దీర్చింది. పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మకుమారి సమాజం, ఐశ్వర్య విశ్వ విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. పురసైవాక్కం రాజా అన్నామలై రోడ్డులోని ధర్మ ప్రకాష్ కల్యాణ మండపం వేదికగా పన్నెండు జ్యోతిర్లింగాలను కొలువుదీర్చారు. శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించవచ్చు. సంగీత విభావరి: శివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులతో పన్నెండు గంటల సంగీత విభావరి జరిగింది. కర్నాటక సంగీత విద్వాంసులు టీఎన్ కృష్ణన్, సుగుణావరదాచారి, నైవేల శాంతన గోపాలన్, గాయత్రి వెంకటరాఘవన్ తదితరులు శివ భక్తి గీతాలాపనలతో భక్తి భావాన్ని చాటారు. నగరంలోని మైలాపూర్ లజ్ కార్నర్ సమీపంలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ సంగీత విభావరి సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్విరామంగా పన్నెండు గంటల పాటు సాగింది.


