breaking news
venkata kumari
-
కరోనా కట్టడికి విశాఖ కార్పొరేషన్ చర్యలు
-
విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తా:మేయర్ వెంకట కుమారి
-
మంత్రిగారి సతీమణి ఆగడాలపై ఆందోళన
గుంటూరు : శ్రీ సాయిబాబా సేవా సంఘం ఎత్తిపోతల పథకంపై మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి జోక్యాన్ని నిరసిస్తూ బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. గంగన్నపాలెంలోని శ్రీసాయిబాబా సేవా సంఘం ఎత్తిపోతల పథకం 300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తోంది. ఎంతో కాలంగా వైఎస్ఆర్సీపీకి చెందిన రైతుల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఆ పథకం నుంచి వాళ్లను తప్పించి టీడీపీ కార్యకర్తలకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా పుల్లారావు సతీమణి పోలీసుల చేత ఎత్తిపోతలకు తాళం వేయించిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎత్తిపోతల పథకంపై మంత్రి పుల్లారావు సతీమణి వెంకటకుమారి వైఖరిని నిరసిస్తూ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. టీడీపీ అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హజరయ్యారు.