breaking news
veer producer
-
నమిత, వీర్ ల ప్రేమకథ
దక్షిణాది నటి నమిత తన సహనటుడు వీర్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న వీరి పెళ్లి వేడుక తిరుపతిలో జరగనుంది. తన పెళ్లి శుభలేఖతో పాటు తన ప్రేమకథను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. 'అందరికీ హాయ్, నేను, వీర్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మీ అందరికీ తెలుసనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శశిధర్ బాబు ద్వారా గత ఏడాది వీర్ నాకు పరిచయం అయ్యాడు.తరువాత మేం కూడా మంచి స్నేహితులమయ్యాం. సెప్టెంబర్ 6, 2017న ప్రత్యేకంగా నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయా. గత మూడు నెలలుగా వీర్ ను మరింతగా అర్థం చేసుకున్నా. తనతో కలిసుండటం అధృష్టంగా భావిస్తున్నా. మాకు మద్ధతుగా నిలిచి వారందరికీ కృతజ్ఞతలు'. అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది నమిత. -
సల్మాన్‌ఖాన్‌పై రూ. 250 కోట్లకు దావా
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఈ సంవత్సరం కలిసొచ్చినట్లు లేదు. సల్లూ భాయ్ మీద 'వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్లకు పరువునష్టం దావా వేశారు. సల్మాన్ వృత్తిపరమైన ప్రవర్తన బాగోలేదని, తనకు తీవ్ర మానసిక వేదన కలిగించాడని, పరువు మొత్తం పోగొట్టాడని గలానీ ఆరోపించారు. వీర్ సినిమా కోసం తాను సల్మాన్ ఖాన్‌కు రూ. 10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయానికి యువరాజ్, వాంటెడ్, ఇతర సినిమాల్లో చేస్తున్న సల్మాన్‌ఖాన్‌కు అప్పటి మార్కెట్ ప్రకారం రూ. 7-8 కోట్లు మాత్రమే ఇచ్చేవారన్నారు. సినిమా మరీ బ్రహ్మాండమైన హిట్ అయ్యి, లాభాలు ఎక్కువ వస్తే సల్మాన్‌కు రూ. 15 కోట్లు ఇవ్వాలని కూడా అప్పట్లో అంగీకారం కుదిరిందన్నారు. అయితే, ఆ సినిమా వల్ల ఎలాంటి లాభాలు లేకపోయినా.. 15 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ సల్మాన్ కార్యాలయం నుంచి తనపై ఒత్తిడి చేశారని గలానీ చెప్పారు. ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్తే.. సల్మాన్ తనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టు కూడా తన వద్ద ఉన్న ఒప్పందం పత్రాలు చూసి.. అసలు డబ్బు ఎందుకు అడుగుతున్నారని సల్మాన్ ప్రతినిధిని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే.. ఈ మూడేళ్లలో తనకు కలిగిన మానసిక వేదన అంతా ఇంతా కాదని గలానీ అన్నారు. న్యాయవివాదం కారణంగా లాయర్ల ఫీజుల పేరుతో తన డబ్బు మొత్తం ఖర్చయిపోయిందన్నారు. అందుకే సల్మాన్‌పై రూ. 250 కోట్ల పరువునష్టం దావా వేశానన్నారు.