breaking news
veenavamka
-
పసిపాపను అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపాప శుక్రవారం అమ్మకాన్ని గురైంది. వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు లక్షా పదివేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. పసిపాప కనిపించకపోయేసరికి తల్లి పద్మ నిలదీయడంతో పాపను అమ్మిన విషయాన్ని పద్మ తల్లి కనకమ్మ తెలిపింది. దీంతో పసి పాప తల్లి తన భర్త రమేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి అత్తతో గొడవ పడ్డారు. ఈ విషయంపై స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా పసిపాప అమ్మకం బయటపడింది. పసిపాపను మళ్ళీ తల్లి చెంతకు చేర్చారు విక్రయించిన అమ్మమ్మ కనకమ్మ ను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లలను అమ్మిన కొన్న నేరమని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. -
వీడని మిస్టరీలు..
వీణవంక మండలం ఐలాబాద్‌లో జరిగిన తోటి చంద్రయ్య హత్య కేసు ఇంకా మిస్టరీగానే మారింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామిడి రాజు హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసును పక్కకు పడేయడంతో నిందితులు ఎ వరనేది మిస్టరీగానే మిగిలింది. మండలంలోని ఐలబా ద్ గ్రామంలో జనవరి 22న అర్ధరాత్రి తోటి చంద్రయ్య దారుణహత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒక్కరు బైక్ వద్ద ఉండగా.. ఇద్దరు ముసుగులు ధరించి అన్నలం వచ్చామంటూ తలుపులు తీయమని కత్తులతో చంద్రయ్యను పొడిచారు. అడ్డొచ్చిన అతడి భా ర్య లక్ష్మిని బీరు సీసాతో గాయపర్చారు. ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం రేగింది. ఈ హత్య భతాగాదాలతోనే జరిగిందని, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల పనేని ప్రత్యర్థుల ఇంటి ఎదుట శవంతో బంధువులు ధర్నా చేశారు. చంద్రయ్య వద్ద గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసిన రామిడి రాజు ప్రధాన నిందితుడని పోలీసులు నిర్ధారించారు. రాజును పోలీసులు పట్టుకునే సమయంలో హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో జనవరి 24న రైలు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు కేసును పట్టించుకోవడం మానేశారు. దీంతో చంద్రయ్య హత్య మిస్టరీగానే మిగిలింది. అయితే బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చారని చంద్రయ్య భార్య లక్ష్మి ఆరోపించగా.. మిగిలిన ఆ ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. పోలీసులు సైతం ఆ ఇద్దరు వ్యక్తుల గురించి వాకబు చేసిన సంఘటనలు లేవు. రాజుది హత్య..ఆత్మహత్యా..? చంద్రయ్య హత్యలో ప్రధాన నిందితుడు రాజు జనవరి 24న హైదరాబాద్‌లోని యాకబ్పూర-ఉపుగూడ రైల్వే ట్రాక్‌పై శవమై తేలడం అప్పట్లో కలకలం సృష్టించింది. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసిన, ఇక్కడి పోలీసులు మాత్రం రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సాక్ష్యం లేకుండా చేయడానికే రాజును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి అన్న ఆరోపించడం చర్చనీయూంశంగా మారింది. దీంతో అటు చంద్రయ్య హత్య, ఇటు రాజు మృతి మిస్టరీగానే మిగిలాయి. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చంద్రయ్య హత్య మిస్టరీని ఛేదించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.