breaking news
varmi
-
వర్మి కంపోస్ట్ కొనుగోలు
– ముందుకు వచ్చే రైతులతో ఎంఓయూ - అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : రైతులు తయారు చేసిన వర్మికంపోస్ట్ వారి అవసరాలు పోను మిగిలినది ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే వారితో ఎంఓయూ చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను మంజూరు చేశామని, రైతులకు కూడా 15 యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇరిగేషన్‌కు సంబంధించి కాలువల్లో గుర్రపు డెక్కను ఉపాధి హామీ పథకంలో తొలగించడానికి చర్యలు చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. ఏజెన్సీలో ఇచ్చిన 50 శాతం సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్‌శాఖ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌లోని 15 మండలాల్లోని గర్భిణులకు ఏడో నెల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించాలని, ఇందుకు డీఎంహెచ్ఓ, డీఆర్డీఏ పీడీ, ఐసీడీఎస్ పీడీ సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ మీ–కోసంలో వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక వివరాల నివేదికను వెంటనే సమర్పించాలని, 15వ తేదీన ఈ అంశంపై చీఫ్ సెక్రటరీతో కలెక్టర్ల సమీక్ష ఉంటుందని జేసీ తెలిపారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి భీమ్ యాప్‌ను ఉద్యోగులందరూ ఉపయోగించాలన్నారు. జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ కె.పద్మ, సీపీఓ మోహన్‌రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వర్మీ కంపోస్టు, నాడెప్ యూనిట్లకు పోత్సాహం
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్లతో బాటు నాడెప్ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం 15 వేల వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకూ 300 ఏర్పాటు చేశారన్నారు. వానపాముల వినియోగం లేకుండా నూతనంగా రూపొందించిన నాడెప్ యూనిట్లలో చెత్త, పేడ, గడ్డి, ఆకులు, కొమ్మలు వంటి వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చవచ్చన్నారు. రూ.10 వేలు ఖర్చయ్యే ఈ యూనిట్లను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఐదు నెలల్లో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మొత్తం 60 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంటుందన్నారు. ఏజెన్సీలో దోమతెరల పంపిణీకి ఆదేశం ఏజెన్సీలో పంపిణీకి 1.03 లక్షల దోమ తెరలు సోమవారం జిల్లాకు వచ్చాయన్నారు. వీటిని మంగళవారం నుంచి ఏజెన్సీలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా వివిధ సైజులలో దోమతెరలను పంపిణీ చేస్తారన్నారు. జెడ్పీ నిర్ణయాలపై స్పందించాలి ఇటీవల జెడ్పీ సర్వసభ్య సమావేశాలలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.వివిధ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్లపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా వెబ్సైట్లో డేష్ బోర్డు జిల్లా వెబ్సైట్లో జిల్లా డేష్బోర్డులో వివిధ శాఖల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చన్నారు. మీకోసం పోర్టల్‌లో పెండిం గ్లో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలను నిర్ణీత కాలంలో చేపట్టాలనిÜూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం రవాణాపై నిఘా కాకినాడ సిటీ : ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ల నుంచి రవాణా చేసి జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు కొంతమంది మిల్లర్లు చూపుతున్న విధానంపై నిరంతర నిఘా అవసరమని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షించా రు. వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ కమిటీల స హకారంతో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రవాణా అక్రమాల ను అరికట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి, కోతలు మొ దలయ్యే ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ వరకూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రాథమిక పరపతి సంఘాలు, డ్వాక్రా మహిళల ద్వారా ప్ర చారం చేయించాలని డీసీఓ, డీఆర్డిఏ అధికారులను ఆదేశించారు.