breaking news
Vandalize
-
లవర్స్ డే బీభత్సం: మాజీ ఎమ్మెల్యే, 22మందిపై కేసు
భోపాల్: ప్రేమికుల దినోత్సవం రోజు వచ్చిందంటే ప్రేమికులతో పాటు మరికొందరు గుర్తొస్తారు. వారే పాశ్చాత్య సంస్కృతి అంటూ వాలంటైన్స్ డే నిర్వహించుకోవద్దని చెబుతూ హిందూ సంఘాలు విజ్ఞప్తి చేస్తాయి. అయితే దాన్ని పట్టించుకోకుండా ఫిబ్రవరి 14 రోజులు ప్రేమికులు ఎక్కడైనా కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించే విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ప్రేమికుల రోజు బీభత్సం జరిగింది. పలు చోట్ల దాడులకు పాల్పడడంతో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వాలంటైన్స్ డే రోజు శుక్రవారం భోపాల్‌లోని శ్యామల హిల్స్ ప్రాంతంలో బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న హుక్కా బార్ లాంజ్ ఆస్తులపై కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌పై కేసు నమోదు చేశారు. భోపాల్‌లోని అరేరా కాలనీ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మహిళలు కూడా పాల్గొనడం విశేషం. శ్యామల హిల్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించిన వారిపై హబీబ్‌గంజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హుక్కా బార్లను, లాంజ్‌లపై మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ వ్యతిరేకతను ప్రదర్శించారు. భోపాల్‌లో వివిధ ప్రాంతాల్లో హుక్కా బార్లను, లాంజ్‌లను మూసివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ‘యువతులకు డ్రగ్స్ అందిస్తున్న, లవ్ జిహాద్‌కు ప్రోత్సహితస్తున్న హుక్కా బార్లకు ఇది ఒక ప్రారంభ హెచ్చరిక మాత్రమే’ అని బీజేవైఎం నాయకుడు అమిత్ రాథోడ్ చెప్పారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్‌తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు జోన్-3 అదనపు ఎస్పీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు. వాలెంటైన్స్ డే రోజు చోటుచేసుకున్న రెండు ఘటనలకు సంబంధించి హబీబ్‌గంజ్, శ్యామలహిల్స్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లో బీభత్సం సృష్టించిన ఘటనలో మొత్తం 23కేసులు నమోదయ్యాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. Saffron brigade on the rampage on Valentine Day in Bhopal. Shiv Sena and BJYM (BJP's youth wing) activists vandalized property at separate restaurants and hookah bar-lounge.17 persons, icluding ex BJP MLA Surendra Nath Singh 'Mamma' held. @NewIndianXpress pic.twitter.com/PloSOiXqvG — Anuraag Singh (@anuraag_niebpl) February 14, 2021 -
గుంతకల్లులో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ఏడు ఆయిల్ ట్యాంకర్ల లారీలను ధ్వంసంచేయడమే కాక, అడ్డు వచ్చినవారిపై దాడికి దిగారు. ఇంధన సరఫరాలో అధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. టీడీపీ నేతల దాష్టీకానికి నిరసనగా బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గుంతకల్ డిపో బంద్‌కు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. -
అనుమానంతో అపార్ట్మెంట్లో రచ్చ..70కార్లు ధ్వంసం
కోల్‌కతా: అకారణంగా అనుమానంతో దక్షిణ కోల్‌కతాలో కొందరు వ్యక్తులు నానా భీభత్సం చేశారు. దాదాపు 70 కార్లను ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్ అద్దాలు పగులగొట్టారు. ఓ యువకుడు చనిపోవడానికి ఆ అపార్ట్ మెంట్ లోని వ్యక్తే కారణం అని అనుమానంతో ఈ రచ్చ సృష్టించారు. ఆదివారం తెల్లవారు జామున హజ్రా ఏరియాలో 2.55గంటల ప్రాంతంలో స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువకులను ఓ మెర్సిడీస్ కారు ఢీకొట్టింది. వారిని ఆస్పత్రిలో చేర్పించగా అందులో 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ వందమంది అక్కడే ఉన్న ఓయాసిస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లారు. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అందులోనే ఉన్నాడని అనుమానించి అతడిని బయటకు పిలవాలని కేకలు పెడుతూ ఇటుకలు, రాళ్లు కర్రలతో దాడులు చేశారు. 70 కార్లను ధ్వంసం చేశారు. పలు ఇళ్ల అద్దాలు పగులగొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై చేయిచేసుకున్నారు. అయితే, చివరకు కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఆ అపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని తెలిసింది. కొన్ని కార్లపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయానికి పోలీసులు రావడంతో మరింత విధ్వంసం చోటుచేసుకోకుండా అడ్డుకోగలిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రచ్చ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.