breaking news
vamshi chandreddy
-
రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి జీవితంలో ఇదే ఆఖరి పదవిగా మిగిలిపోనుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేడ్కర్చౌక్వద్ద ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ చేపట్టిన రిలేనిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. తాండూరు మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆద్వర్యంలో మండలానికి చెందిన నాయకులు చేపట్టిన ఈ దీక్షకు ఏఐసీసీ కార్యదర్శి వంశిచంద్రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీ.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్ మహరాజ్ హాజరయ్యి సంఘీభావం తెలిపారు. అనంతరం వంశీచంద్ మాట్లాడుతూ... తాండూరులో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన పంజుగుల రోహిత్‌రెడ్డి పార్టీ మారడం తాండూరు నియోజవకర్గం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యేకు జీవితంలో ఇదే మొదటి, చిట్ట చివరి పదవిగా మిగిలిపోతుందన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడే రోహిత్‌రెడ్డికి బుద్ధి చెప్పినట్లవుతుందన్నారు. ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలని చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తాండూరు ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే రానున్న రోజుల్లో తగిన శాస్తి కలుగకమానదన్నారు. నిరహరదీక్ష చేస్తున్న రాజ్‌కుమార్, జర్నప్ప, రాఘనాత్రెడ్డి, జెన్నెనాగప్ప, శివగౌడ్, శివకుమార్‌తో పాటు పలువురు నాయకులకు సాయంత్రం జూస్ తాగించి దీక్షను విరమింపచేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి రమేష్, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉత్తంచంద్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మా జీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, తాండూరు మం డల మాజీ అధ్యక్షుడు హేమంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లిరవికుమార్, నాయకులు జనార్ధన్‌రెడ్డి, కల్వ సుజాత తదితరులున్నారు. -
'బోగస్ సర్వేలతో మైండ్ గేమ్'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టు బోగస్ సర్వేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే సి.వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, రైతు సమస్యలను పరిష్కరించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి బూటకపు సర్వేలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని వస్తున్న సర్వేలన్నీ నిజమని నమ్మితే, టీఆర్ఎస్లో చేరిన ఇతరపార్టీల ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దంకావాలని వంశీచంద్ సవాల్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన సవాలును టీఆర్ఎస్ స్వీకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని వంశీచంద్ ప్రశ్నించారు.