breaking news
vaishali benarji
-
ప్లాటినంపై యువత మోజు
కొరుక్కుపేట: ప్లాటినం నగలపై యువతకు మోజు పెరగుతుందని, దీంతో ప్లాటినం అమ్మకాలు పెరుగున్నాయని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ అన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆమె మట్లాడారు. ప్లాటినం జ్యువెలరీ బిజినెస్ రివీవ్– 2017 ఇటీవల చేపట్టామన్నారు. అందులో ఇండిపెండెంట్ ప్లాటినం మార్కెట్ నిపుణులు, ఇండస్ట్రీ అనలిస్ట్ సంయుక్తంగా భారత్‌లో కన్సూమర్ రీటైల్ సేల్స్ గ్రోత్‌పై సర్వే నివేదికను అందించారన్నారు. భారత్‌లో ప్లాటినం మార్కెట్ గ్రోత్ పటిష్టంగా ఉందన్నారు. రీటైల్ సేల్స్ 21 శాతం ఏటా పెరుగుతున్నాయన్నారు. ఫ్యాబ్రికేషన్ డిమాండ్ గ్రోత్ ఏడాది ఏడాదికి 34 శాతం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రసుత్తం ప్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో యువత సైతం ప్లాటినం జ్యువెలరీపై మోజు పెరుగుతుందన్నారు. బ్రైడల్ మార్కెట్ సైతం చైనా, జపాన్, యూఎస్‌తోపాటు భారత్‌లో పెరుగుతుందన్నారు. -
‘నగ’ధీరుడు!
పురుషుల ఆభరణాల కీలక మార్కెట్లలో హైదరాబాద్ పుత్తడి కంటే ప్లాటినంపైనే అధికాసక్తి ప్లాటినం గిల్డ్ సర్వేలో వెల్లడి ముంబై: ఆభరణాలపై మోజు అతివలకే కాదు పురుషులకు కూడా పెరిగిపోతోంది. నగలు ధరించి ధగధగలాడిపోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరిగిపోతున్నారని, ఇలాంటివారి సంఖ్య మెట్రో నగరాల్లో మరింతగా ఉందని ప్లాటినమ్ గిల్డ్ తాజా సర్వేలో తేలింది. మగవాళ్ల ఆభరణాల కీలక మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచిందని ఈ సర్వే వెల్లడించింది. పురుషుల లగ్జరీ యాక్సెసరీలు, ఆభరణాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో మార్కెట్‌గా భారత్ అవతరించిందని పేర్కొంది. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. పురుషుల అభరణాల మార్కెట్, ఆభరణాలు ధరించడం పట్ల వారి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకునే నిమిత్తం ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజర్ వైశాలి బెనర్జీ చెప్పారు. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.., పురుషులు ఆభరణాలను గుడ్డిగా ఏమీ కొనడం లేదు. ట్రెండ్స్‌ను బట్టి, రీసెర్చ్ చేసి మరీ డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. ఆభరణాలు ధరించాలనే కోరిక మగవారిలో పెరిగిపోతోంది. ఆభరణాలు ధరించడం వయస్సులో పెద్దవారిమయ్యామనే గుర్తింపుగా యువకులు భావిస్తున్నారు. సొంతంగా తమకు కొనుగోలు శక్తి ఉందనే విషయాన్ని నగల కొనుగోలుతో వ్యక్తం చేస్తున్నామన్నది ఉత్తరాది మగవాళ్ల అభిప్రాయం. ఇక పురుషుల ఆభరణాల మార్కెట్లలో కీలకమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, బరోడా, పుణే, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్లు కూడా ఈ ఘనతను సాధించాయి. మగాళ్ల ఆబరణాల్లో ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. ప్లాటి నం, పుత్తడిలతో తయారైన నగలపై పురుషులు మక్కువ చూపిస్తున్నారు. మరోవైపు పుత్తడి ఆభరణాల కన్నా ప్లాటినం ఆభరణాలపైనే పురుషులు అధిక ఆసక్తి చూపుతున్నారు. ప్లాటినం ఎక్కువగా అరుగుదలకు లోనుకాదనే అంశమే దీనికి ముఖ్య కారణం. అన్ని వయస్సుల మగవాళ్లూ విలువైన లోహాలను ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశంతో కొంటున్నారు. ఇతర నగరాలతో పోల్చితే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మగవాళ్లు అధికంగా ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.