breaking news
vadlamudi village
-
సంగం డైరీలో దొంగలు పడ్డారు
సాక్షి, గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డైరీలో సోమవారం భారీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు సంగం డైరీలో చొరబడి బీరువా పగులగొట్టి డబ్బు దోచుకెళ్లారు. ఆఫీస్ రూమ్‌లోని రూ.44 లక్షల సొమ్మును అపహరించుకుపోగా.. అక్కడే ఉన్న మరికొంత నగదును వదిలేసి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన విధానం చూస్తే ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌టీమ్ ఆధారాల కోసం వేలిముద్రలు సేకరిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వల్లంపూడి(వేపాడ): మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన పటాన మహమ్మద్ అలియాస్ చిన్న (26) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు... వల్లంపూడి గ్రామానికి చెందిన చిన్న వేపాడ గ్రామానికి చెందిన ఎస్.అప్పారావు, ఎస్.శ్రీరాము వద్ద మైక్‌సెట్ లో పనిచేస్తుంటాడు. అప్పారావు, శ్రీరామ్‌లు శనివారం సాయంత్రం చిన్నాను మైక్‌సెట్ పని ఉందని తీసుకెళ్లారని, కానీ సోమవారం ఉదయం తన భర్త శవాన్ని ఇంటికి తీసుకువచ్చారని చిన్న భార్య జిలానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న... అప్పారావు ఇంటిపై చనిపోయాడన్న సమాచా రం వచ్చిందని, అక్కడకు చిన్న తల్లి చాందిని, అత్త సహీద్లు వెళ్లి చూడగా చిన్నా మెడకు కేబుల్ వైర్లు చుట్టుకుని ఉన్నట్లు, నోటి నుంచి రక్తం వస్తున్నట్లు వారు గుర్తించారని జిలానీ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం చేస్తామని ఎస్ఐ తెలిపారు. చిన్నకు ప్రస్తుతం ఆరేళ్ల వయసున్న కుమార్తె నురానీ ఉంది.