breaking news
Vadde shobhanadeswara rao
-
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్‌పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్‌కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్‌కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
‘26వ తేదీన రాష్ట్ర బంద్’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్‌లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. సమితి సమావేశం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్‌ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు. 19న వ్యవసాయ మార్కెట్ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు
ఏ తరహా పరిశ్రమలు నిర్మిస్తారో చెప్పండి రైతులకు వెన్నుదన్నుగా ఉంటా..: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మచిలీపట్నం(కృష్ణా జిల్లా): భూసమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మచిలీపట్నంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉన్న సమయంలోనే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో భూసమీకరణను ప్రభుత్వం తెరపైకి తేవడం రైతులను మోసగించడమేనన్నారు. భూసేకరణ అమలులో ఉన్నప్పుడు రైతులు తమ భూములను విక్రయించేందుకు అవకాశం లేకుండా చేశారన్నారు. భూసమీకరణను తెరపైకి తెచ్చి కొందరు మంత్రులు తమ అనుచరులతో మచిలీపట్నంలో భూములు కొనుగోలు చేయించారని, ఆ భూములను పారిశ్రామిక క్యారిడార్‌కు ఇస్తామని ప్రకటించి రైతులను మోసగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం : 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. రైతు సంఘాలు ఏళ్ల తరబడిన చేసిన పోరాటం కారణంగా పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ విరమించుకున్నారని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రే వెనుకంజ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేమీకరణ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించడం రైతాంగ వ్యతిరేఖ చర్యేనన్నారు. ప్రస్తుతం జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్లో రైతులు 60 రోజుల్లో తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు వెసులుబాటు ఇవ్వాల్సి ఉండగా 15 రోజులకే కుదించటం దుర్మార్గమైన చర్య అన్నారు. తెలంగాణాలో భూసేకరణ నిమిత్తం 123వ నెంబరు జీవోను జారీ చేస్తే అక్కడి రైతులు కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. రైతులను ముంచి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనమా : బందరు పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాల భూమి అవసరమని చెబుతున్నారు. పారిశ్రామిక క్యారిడార్ కోసం 28వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం రైతులను ఇబ్బంది పెట్టడమేనన్నారు. ఏ పరిశ్రమలు నిర్మిస్తారో వాటికి ఎంత భూమి కావాలో వివరాలు చెప్పకుండా భూములు ఎలా సమీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తారా అన్నారు. పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు సైతం అభివృద్ధి చేయలేకపోయారన్నారు. గిలకలదిండి హార్బర్ వద్ద ముఖద్వారం పూడిక తీయలేదని, హార్భర్‌లో తాగునీటి వసతి కల్పించలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రైతులు చేసే పోరాటానికి రైతు సమాఖ్య ప్రతినిధిగా తనవంతుగా అండదండగా ఉంటానని ఆయన చెప్పారు. పోర్టు, పారిశ్రామిక క్యారిడార్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న భూదందాపై ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అందజేసి వారిని చైతన్యవంతం చేస్తామన్నారు.